ఈ మధ్యలో నేను చూసిన చాల కామెడీ మనుషుల్లో కుమారి విజయ శాంతి ఒకరు. ఆమె తెలుగు వింటూ ఉంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. సినిమాలు జనాలని ప్రభావితం చెయ్యటం చూసాం గాని, ఇలా నటులను కూడా ఇలా ప్రభావితం చేస్తాయనుకోలేదు. నాకు తెలిసి దేవానంద్ తరువాత, విజయశాంతి తను నటించిన పాత్రల వల్ల బాగా ప్రభావితం చెందిందనుకోవచ్చు.:-)
మన తెలుగు ప్రజలు సినీ నటులకు ఇచ్చే అతి గౌరవాన్ని ఎలా వాడుకోవచ్చొ ఈమెనే అడగాలి. సినిమాలు తప్పితే, ఆమెకు అసలు ఈ రాష్ట్రం మీద ఏ మాత్రం అవగాహన వుందో తెలియటం లేదు. ఆమెకు తోడు మన టైగర్(ఈయన అంతా రక్తం, మాంసం అనే పదాలే వాడుతూ మాట్లాడుతారు) ఆంధ్ర (ఎవరు ఆంధ్రులు? తెలుగు మాట్లాడే వారా? లేకా ఇంకెవరైనా వున్నారా? :-)) వారి చిత్రాలు ఆడనివ్వరంట...ఇంత కంటే పెద్ద జోకు మరొకటి వుండదు. కర్నాటక లో కొద్ది రోజులు తెలుగు చిత్రాలు ఆపితేనే అక్కడి ప్రజలు తెగ నిరసించారు...మరి మన సొంత రాష్ట్రంలో మన చిత్రాలు కాక పోతే ఇంకెవరి చిత్రాలు చూస్తామబ్బా ! ఇదేదో తెలుగు తాలిబాన్ ల గుంపు లా కనిపిస్తుంది నాకు.
3 comments:
నిత్య జీవితంలో హాస్య నటులు.. ఆహా, చక్కగా అతికినట్లు సరిపోయింది వీళ్ళకు. వాళ్ళిద్దరూ మాట్లాడింది నేనూ చూసాను. వృత్తి మాత్రమే కాదు, బతుకే నటనై పోయిన బతుకీమెది. ఎదటోణ్ణి తిట్టి పెద్దోణ్ణవుదామనుకుంటున్న టైగరుడీతడు.
ఆంధ్రా సినిమాలు ఆడనివ్వమన్న ఈ డైలాగు వీళ్ళ సొంతం కాదు. ఇది స్వర్గీయ చెన్నారెడ్డిగారి కారుకూతల్లో ఓ భాగం. ఎందుకంటే 1970 ప్రాంతంలో ఆయన నడిపిన పత్రిక తాలూకు పాతప్రతి ఒకటి ఈమధ్య నా చేతిలో పడింది. అందులో ఇలాంటివి చాలా ఉన్నాయి.ఆంధ్రా అంటే యావత్తు తెలుగుభూమి అనే జ్ఞానోదయాన్ని తెలంగాణా సోదరులకి కలిగించగల వారెవరున్నారో.... ఆంధ్రానే కాదు, తెలంగాణా అన్నా మొత్తం తెలుగునాడే సూచితమౌతుంది. దాని వ్యుత్పత్తి (etymology) ఇలా ఉంది : తెలుంగు + ఆణియం = తెలుంగాణ్యం =తెలంగాణ్యం.ఉర్దూలో అదే తెలంగాణా అయింది. ఆణియమంటే దేశం. అంటే, మన పూర్వీకుల దృష్టిలో తెలుగుదేశమే ఉంది గాని, ఈ ప్రాంతీయభేదాలు లేవని స్పష్టమౌతోంది. అందుకే రాజమండ్రికి చెందిన నన్నయ్య తన పుస్తకానికి ఆంధ్రమహాభారతమని పేరుపెట్టుకుంటే, వరంగల్‌కి చెందిన బమ్మెర పోతన తన రచనకి ఆంధ్రమహాభాగవతమని పేరుపెట్టుకున్నారు. అంతేగాని తెలంగాణా భాగవతమని పెట్టుకోకపోవడం గమనించాల్సిన విషయం. తెలంగాణా అనే పదం ఇప్పుడు మనం వాడుతున్న సంకుచితార్థంలో వాడడం మొదలయింది 1947 తర్వాతే. అంతకుముందు Nizam State, Hyderabad State లేదా నిజాం రాష్ట్రం అనేవారు.ఆంధ్రా అనే పదం కూడా 1960 తర్వాతే ఇప్పటి సంకుచితార్థంలో వాడడం మొదలయింది. పదాలకున్న అర్థాలు విరిచి, నలిపి నాశనం చేసిన మన నాయకుల నైపుణ్యానికి జోహార్‌లు అర్పించాలి.ఈ అర్థాల సంకుచితత్వం ఒక మహాజాతి యొక్క దృక్పథాన్నే మార్చి కొట్టుకుచచ్చేలా చేస్తోంది.
తెలుంగు ఆణియము -- అంబానాథ్ గారికి కృతఙ్ఞతలు.
తెలుగు తాలిబాన్ ల గుంపు - తాలిబన్లు కూడా ఇదే సంకుచితంతో ఆ దేశాన్ని రాతియుగానికి నెట్టారంటారు.
Post a Comment