నాకు నచ్చిన మంచి పుస్తకాలలో మక్సీం గోర్కి రచించిన "నా బాల్యం". అసలు గోర్కి తన బాల్యాన్ని అంత నిశితంగా ఎలా అవలోకించాడా ? అనిపిస్తుంది నాకు...ఎంతో అసహ్యకరమైన విప్లవ పూర్వపు రష్యను ప్రపంచం లో అతను వర్ణనాతీతమైన అందమైన తన సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.
"సూర్యుడస్తమిస్తూ అకాశాన్నంతా అగ్ని ప్రవాహంతో నింపేసేవాడు. నిప్పులు ఆరిపోయి తోటలో పరచిన ఆకుపచ్చని తివాచీ మీద బంగారంతోనూ, కెంపులతోనూ నిండిన బూడిద వెదచల్లేసేవి. దాంతో చుట్టుపక్కల నెమ్మదిగా చీకటి అలుముకుని విస్తరించి, సర్వాన్ని తనలో యిమిడ్చేసుకుని వుబ్బిపోయేది. సూర్య కిరణాలను తృష్ణ తీరా దిగమింగేసి తృప్తి చెందిన ఆకులు కొమ్మల మీద సొమ్మసిల్లి వాలిపోయేవి. గడ్డి మొక్కలు తమ ఆకులు భూమి మీద వాల్చేసేవి. ప్రతి వస్తువూ కొత్త విలువల నార్జించుకుని మరింత కోమలంగా మరింత శోభాయమానంగా రూపొంది సంగీతంలా మృదువైన సువాసనతో పరిమళించేది.దూరాన పొలాల్లో వున్న సైనిక శిబిరాల నుండి సంగీతం గాలిలో తేలుతూ చెవిన పడేది. తల్లి ప్రేమకి యెలాగైంతే మనిషి తేట పడి బలపడతాడో, అలాంటి అనుభూతినే కలిగిస్తుంది రాత్రి కూడా. తల్లి కౌగిలిలాగే ఆ నిశ్శబ్దం కూడా హృదయాన్ని మృదువైన వెచ్చని చేతులతో జోకొట్టుతూ మరచిపోవలసిన దాన్నంతా - పగటిపూట పది పేరుకుపోయిన తుప్పునీ, చౌడునీ ధూలిధూసరాన్నంతటిని తుడిచివేస్తూ మరపించేస్తుంది"
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ సహాయం కావాలి..నా మరోబ్లాగును ఇలా మార్చగలిగాను - http://kmcitizens.blogspot.com/
కానీ బ్లాగు శీర్షిక లో చిత్రాన్ని ఎలా అతికించాలి?
నా ఆనవాలు...drchinthu@gmail.com
Post a Comment