Sunday, July 02, 2006

ఒక రెండు వారాల విశేషాల కషాయం

రోజులు మంచి గానే పోతున్నయి. ఏదో ఏడిస్ ఈజిప్టీ అనే దోమంట, ఆ.ప్ర తో ఆడుకుంటుంది. మన ప్రభుత్వ పటిమ దోమలకూ అర్ధం అయినట్లుంది. అందరికి ఆ దోమ జ్వరం తో పాటు ఫుట్‌బాల్ జ్వరం కూడా పట్టుకుంది. నాక్కూడా (ఆట జ్వరం మాత్రమే):-)
మా ఆఫీస్ టీం అంతా కలసి ప్రగతి రిసార్ట్స్ అని ఒక ప్రదేశానికి వెళ్ళాం. మాతో పాటు అక్కడ మరో 7 కంపెనీల జనం వున్నారు. వెళ్ళీ వెళ్ళగానే ఆవేశంగా ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాం. నాకు ఆ రోజు ఆ ఆట ఆడటం జీవితంలో మొదటిసారి. మొదట్లో సరదాగానే అనిపించింది గాని, ఒక 20 నిమిషాల తరువాత అది అంత ఆషామాషిగా ఆడుకునే ఆట కాదని తెలిసింది. వుత్తి పాదాలతో ఆడటం వలన అరికాళ్ళు మంట పుట్టటం మొదలయ్యింది. కాకపోతే నేను మా జట్టు తరఫున ఏకైక గోల్ చేసాను. అప్పటి నుంచీ నన్ను ఒకడు వెంబడించి మరీ అడ్డుకోవటం మొదలుపెట్టాడు. ఈ హంగామా లో నా ఒల్లంతా హూనం. ఈ రోజుకి (7 రోజుల తరువాత) కూడా అక్కడక్కడా నొప్పిగా వుంది.
ఆట బాగా ఆడి అలసిపోయాక, స్విమ్మింగ్ పూల్ లోకి దూకాము. ఆనందం వస్తే మది అన్నింటిని పక్కన పెడుతుంది కదా.....అందువలన ఒక 2 గంటలు పూల్ లో వివిధ విన్యాసాలు, ఆటలు జరిగాయి. దాని ఫలితమే ఈ రోజుకూ నన్ను పీడిస్తున్న రొంప.
జూలై 2, నా పుట్టిన రోజు, బహుశా ఈ మధ్య కాలం లో చాలా బిజీ రోజు అయివుండవచ్చు. ఈ రోజు పోకిరి అనే సినిమా చూసా. నాకు పెద్దగా నచ్చలేదు. శ్రుతి మించిన రక్తపాతం, పస లేని అతుకుల కామెడీ ట్రాకు. అయితే మహేష్ బాబు నటనకు చాల మంచి రోజున్నాయి అని ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ మధ్య చూసిన ఒక మంచి చిత్రం 'ఫనా". చక్కని కధ, పాటలు, కధా నాయక, నాయకీమణుల నటన పోటీ పడుతూ మనల్ని ఆనందింపచేస్తాయి. నా హిట్ లిస్ట్ లో వున్న కొన్ని సినిమాలు ..
01. గోదావరి
02. సూపర్‌మేన్
03. ఎం.ఐ 3
04. ది వైల్డ్
05. పైరేట్స్ ఆఫ్ కరీబియన్ - ది డెడ్ మ్యాన్స్ టేల్.

6 comments:

చేతన_Chetana said...

మీ బ్లాగు కొత్త టెంప్లేట్ బాగుంది కానీ అండీ, మీరు మళ్ళీ -ళ్ళు- స్థానంలో -ల్లు- (తెలుగోల్లు) అని వ్రాసినట్టున్నారు. That could be a typo too, but just wanted to let you know.

Sudhakar said...

yes...wrote this in hurry...will correct that :-) thanks for correction chetana gaaru.

శ్రీనివాసరాజు said...

Belated happy b'day.. buddy, enjoy.

Sudhakar said...

కృతజ్ఞతలు రాజు గారు :-)

Dr.Pen said...

వరెవ్వా! ఇంత అందమైన బ్లాగుని ఇదే చూడటం!
చాలా బాగుంది మీ టెంప్లేట్(?) నాక్కూడా కాస్త చెబుదురూ!

Sudhakar said...

I used the template from this page..

http://blogger-templates.blogspot.com/archives/2006_03_01_blogger-templates_archive.html

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name