Saturday, July 01, 2006
హాయ్ నా పేరు గణపతి...అయాం ఫ్రం పారిస్.ప్లాస్టర్ ఆఫ్ పారిస్...
వినాయక చవితి వచ్చేస్తుంది...హుస్సేన్ సాగర్ కు ముచ్చెమటలు పోస్తున్నాయి. చాలా పకడ్బందీగా, ఐ.ఏ.యస్ లు, ఐ.పి.యస్ లు, రాజకీయ నాయకులు, విద్యావంతుల సాక్షిగా....ఆ బొజ్జ గణపతి పేరు మీద నగరానికి ఒక తల మానికమైన జలాశయం కొన్ని వందల టన్నుల విషాన్ని మౌనం గా దిగమింగాలి. గత సంవత్సరం ప్రభుత్వం అట్టహాసంగా ఏదో జీ.వో జారీ చేసినట్లు గుర్తుకొచ్చింది. అది ఏమిటంటే ఈ సంవత్సరం నుంచి అన్ని విగ్రహాలు కేవలం మట్టి తోనే చెయ్యలనీ. మరి ఎవరు దీన్ని పర్వవేక్షిస్తారు? ఈ రోజు కూకట్‌పల్లి లో చూసాను, వేల విగ్రహాలు యధాతధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసేస్తున్నారు. ఒక 8 నెలల ముందు గానే ఆ కార్మికులకు కొంత అవగాహన, మట్టితో బొమ్మలు చెయ్యటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించవచ్చు కదా. మన ఖర్మ కొద్దీ మనకు ఈలాంటి పనికిమాలిన ఐ.ఏ.యస్ లు దొరుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ కి లంచాల కోసమే బదిలీల మీద వస్తున్నట్టుగా వుంది.
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
మీ రన్నది నిజమే, కుకట్‌పల్లి మాత్రమే కాదు, ఉప్పల్ నుండి ఎల్ బి నగర్ వెళ్ళే దారిలో చూడండి. సగం హుస్సేన్ సాగర్ నిండిపోతుంది. అంతేకాదు, వీటికి వాడే రంగుల్లో వుండే ప్రమాదకరమైన కెమికల్స్, సపోర్ట్ కోసం వాడే ఇనుప రాడ్లు... వీటి గురించీ చెప్పుకోవాలి.
Post a Comment