Wednesday, April 11, 2007

ప్రాణ సంకట బాదు

మన భాగ్యనగరంలో ఒక రోడ్డును దాటాలంటే సామాన్యమా? మన మీద నుంచైనా వాహనాన్ని పోనిస్తారేమో కానీ, ఆపే సమస్యే లేదు. ఇది చూడండి. తీసిన వ్యక్తి ఎవరో గానీ గుండె ధైర్యం మస్తుగా వున్నవాడు.

11 comments:

స్వేచ్ఛా విహంగం said...

అవును. ఇక్కడ రోడ్డు దాటాలంటే చుక్కలే.

rākeśvara said...

అవును చాలా గుండె ధైర్యం గల వ్యక్తి.

Anonymous said...

naakikkaDa Em kanipiMcalEdE.. Edaina link^ iccaaraa..

ప్రదీపు said...

నాకు కూడా ఏమీ కనపడటం లేదు. కొంచెం పరిశోధిస్తే ప్రస్తుతం youtube పనిచేయకపోవటం వలన ఇక్కడ యేమీ కనపడటం లేదని అర్ధమయింది. తరువాతొచ్చి మళ్ళీ చూస్తాను.

చదువరి said...

హైదరాబాదు రోడ్ల మీద పాదచారులు ఎంత అడ్డగోలుగా రోడ్డు దాటతారో చక్కగా చూపించాడీ సెల్లుమణి!

spandana said...

ఇది గుండె ధైర్యము కాదు మొండి ధైర్యం. కాస్తా బుర్రలో పిచ్చి వున్నట్లుంది తీసినవాడికి. రోడ్డు దాటకూడని చోట దాటుతూ, వీడియో తీస్తూ, ఎందరు హారన్లు మోగిస్తున్నా పట్టించుకోకుండా...పిచ్చిగాక మరేమిటి?

--ప్రసాద్
http://blog.charasala.com

కొత్త పాళీ said...

విడియో కనబట్టల్లేదు కానీ, మంచి సమస్య లేవనెత్తారు సుధాకర్!
టపా రాసిన మీరేమో వాహనాల వాళ్ళని తప్పు పడితే, చదువరీ, చరసాలా అడ్డగోలుగా రోడ్డు దాటేవాళ్ళమీదికి తిప్పారు తమ వ్యాఖ్యల్ని. దృక్కోణంలో తేడా అనుకుంటా :-)
నేను సుమారు రెండున్నరేళ్ళు హైదరాబాదులో ఉన్నా ఈ మధ్య కాలంలో. కొన్నాళ్ళు బేగంపేట బ్లూమూన్ హోటలు వెనకాల ఒక ఇంట్లో ఉండేవాణ్ణి. లకడీకాపుల్ నించి మొదటిసారి సిటీబస్సులో వచ్చి దిగి, రోడ్డు దాట లేక మళ్ళీ ఆటో ఎక్కి చుట్టూ తిరిగొచ్చి అవతల వేపు దిగాను.
మొదట్లో లకడీకాపుల్ బస్టాండు దగ్గరకూడా ఇదే పరిస్థితి ఉండేది. తరవాత అక్కడ అన్ని దిశల వాహనాలకీ ఎర్ర దీపం ఒకటి వేశారు. కోఠీ మెయిన్రోడ్డు కూడా దాటటం చాలా కష్టం.

Anonymous said...

I too wonder what this person was trying to achieve trying to shoot the traffic going from opposite direction and indiscriminately crossing the road. That such a thing was allowed, might be taken as an indication of the traffic situation rather than the video itself.

It is true. Every time you cross, you play with your life, even at supervised crossroads (I mean with signals). I had the same problem and it took me at least 15 min. to cross, at I think Panjagutta, the last time I visited. Then too, I thanked my stars that I came alive the other side. When I said that to my friends, they dismissed it easily, saying that I simply "lost touch", after coming to US.

Sudhakar said...

చదువరి గారు, చరసాల గారు మీరన్నది నిజమే కానీ, పాపం వాడు సెల్లుతో వీడియో తీసాడు, వేల మంది తియ్యటం లేదు అంతే తేడా...ఈ లెక్కన హైదరాబాదు లో అందరికి కాస్త పిచ్చి వుంది. ప్రసాద్ గారు మీరు చివరి సారి ఎప్పుడు ఇక్కడికి వచ్చారో గానీ..ఇక్కడి పరిస్థితి మీకు తెలిసినట్లు లేదు. అమెరికాలా ఇక్కడ రోడ్డు మీద కాలు పెడితే ఠక్కునా ఆగి దారి ఇచ్చే కార్లు లేవు. మీరు ఒక రోజంతా ఆగినా ఆ రోడ్డు దాటలేరు. పైన చూపిన విధంగా దాటాల్సిందే..అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వుండవు...వుంటే పని చెయ్యవు...పని చేస్తే పాటించరు..అదీ హైదరాబాదు భయ్ :-)

లలిత గారు..ఇక్కడ అచీవ్‌మెంట్ ఏమీ లేదు..తీసిన జర్మన్ ఆయన నరకం అంటే ఏమిటో జర్మనీలో చూపించాలనుకున్నాడంతే...మీ స్నేహితులు చెప్పింది కూడా నిజమే..అమెరికా వెళ్లిన తెలుగోల్లు కొద్దిగా సున్నితంగా తయారవుతారు. వెళ్లిన ఆరు నెలల తరువాత వచ్చిన ఒక స్నేహితుడు ఇలానే అన్నాడు. ఆరు నెలలలో ఈ నరకాన్ని మొత్తం వాడు అమెరికాలో మరచిపోయాడు :-)

spandana said...

నేను 2003 డిసెంబరులో హైదరాబాదు వచ్చాను. అప్పుడూ రోడ్డూమీద కాలుబెట్టే సమయమే దొరకలేదు. ఈసారి తప్పకుండా గడపాలి "ప్రసాదం'గారి ప్రాసాదంలో ఓ వారమైనా!

ప్రసాద్
http://blog.charasala.com

చదువరి said...

సుధాకర్ గారూ, నేను రాసిన పాదచారుల అడ్డగోలుతనం ఒక కోణం మాత్రమే! నడిపేవాడిదీ, నడిచేవాడిదీ - అందరిదీ అడ్డగోలుతనమే. క్రమశిక్షణ లేమి అసలు కారణం. నేనూ దీనికి అతీతుణ్ణేం కాదు.
అన్నట్టు మీరు ట్రాఫిక్కు ఇబ్బందులు, పరిష్కారాల గురించి ఓ పోస్టు బాకీ అనుకుంటా. గతంలో ఈ విషయమై ఓ జాబు రాస్తానని మరో జాబులో మాటిచ్చినట్లు గుర్తు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name