Wednesday, April 04, 2007

మూడు వందల వీరులు

300. ఇది ఒక సినిమా పేరు. గత ఆదివారం ఈ సినిమా చూశాను. లక్షల మంది వున్న పర్షియన్ సైన్యాన్ని స్వేచ్చనే వూపిరిగా, వీరత్వాన్ని ఆభరణంగా ధరించే ఒక స్పార్టన్ రాజు (లియొనార్డైస్) మెరికల్లాంటి, మడమ తిప్పని మూడు వందల యోధులతో ఎలా ఎదుర్కున్నాడో చూపే చిత్రం ఇది. 480 BC లో జరిగిన థెర్మోపైలే యుద్ధ అధారంగా దీనిని నిర్మించారు.

అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చూడదగ్గది. గ్లాడియేటర్ చిత్రాన్ని కొన్ని చోట్ల గుర్తుకు తెస్తుంది. అరే రస్సెల్ క్రో ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించాల్సింది అని అనిపించింది కాసేపు.

దర్శకుడు గంటన్నర పాటూ అసలు సుత్తి అనేదే కొట్టకుండా ప్రేక్షకులను ఆ యుగంలోనికి తీసుకు పోయాడు.

క్సెరెక్సెస్ అనే పర్షియన్ రాజు వేషధారణ కూడా చాలా విచిత్రంగా వుంటుంది. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

అయితే చిన్న పిల్లలను మాత్రం ఈ సినిమా చూడనివ్వక పోవటం మంచిది. రక్తం ఏరులై పారటం, శవాలు గుట్టలై పడటం అతియోశక్తులు అసలే కావు ఈ చిత్రంలో…అసలు శవాలతో ఒక గోడనే కట్టే సీను కూడా ఉంది.

స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వుంటాయి. సాంకేతికంగా "ఇరగ దీసారు" :-) యుద్ధ సన్నివేశాలు అయితే చెప్పనక్కరలేదు. లక్షల మంది వచ్చి పడినా సడలని ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూపించడంలో చాలా శ్రద్ధ చూపించారు.

ప్రేమ, స్వేచ్చ, రాజ కర్తవ్యం, నాయకత్వ పటిమ, ధీరత్వం వంటివి ఈ చిత్రం తాలుకా కధా వస్తువులు.

2007 ఆస్కార్ పందెంలో పాల్గొనే ధైర్యం నిండుగా వున్న చిత్రం ఇది.

6 comments:

oremuna said...

మన పల్నాటి యుద్ధం, మహా భారత యుద్ధం కూడా ఇలా ఎవరన్నా మాంచిగా తీస్తే బాగు

Anonymous said...

నా నోట్లో నానే మాట చెప్పాడు కిరణ్. మహాభారత యుద్దం అయితే కొన్ని అతిశయోక్తులు చూపడానికి ఆస్కారం ఉంటుంది. పద్మవ్యూహాన్ని ఛేదించడం దాదాపు అసాద్యం. కానీ పద్మవ్యూహాన్ని ఏ పుస్తకంలోనూ ఎవరూ వర్ణించలేదు. ఆ వ్యూహం ఎలా ఉంటుంది? శత్రువుకు కొరుకుడు పడని విధంగా దుర్భేధ్యమైన ఆ వ్యూహాన్ని ఎలా అమలుపరుస్తారు? అన్నీ ప్రశ్నలే..జవాబులు లేవు :(
ఉదాహరణకు...అభిమన్యుని కధే సినిమాగా తీయాలని అనుకొందాం.....ఒక 14యేళ్ళ కుర్రాడు ఒక వైపు...పద్మవ్యూహంలో ఉన్న వేల ఏనుగులు, గుర్రాలు, లక్షల మంది ఉన్న కౌరవ సైన్యం ఒక వైపు. మన క్రియేటీవ్ బుర్రలకు పని చెపాలేగానీ...ఇదే కథతో 300కు సాటి రాగల సినిమాను తియ్యచ్చు
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

ప్రదీపు said...

ఈ సినిమాని ఒక నవల ఆధారంగా తీసారు. అయితే నవల మాత్రం 480 BCలో జరిగిన యుద్ద ఆధారంగా తీసారు.

నాకు కూడా ఈ సినిమా చూసినప్పుడు గ్లాడియేటర్ సినిమా గుర్తుకు వచ్చింది. కానీ ఇంకోలాగా అనిపించింది. ఈ సినిమా చూసిన తరువాత గ్లాడియేటర్ సినిమా చూస్తే పిల్లల సినిమాలాగా అనిపించేదేమోనని.

One Stop resource for Bahki said...

నాకు తెగ నచ్చి నది , తరువాత నాకు నచ్చిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ . దీనికి తరువాతి బాగము కూడా తీస్తారట ,నాకు చివరి పాట తెగనచ్చి నది కాని అది ఏబాషలో పాడారో తెలియదు .

రవి వైజాసత్య said...

ఈ వివిధ వ్యాహాలను మనవాళ్లు పురాణాల్లో స్పష్టంగా వివరించారు. ప్రొఫెసర్ లక్ష్మీరంజనం గారు రాసిన తెలుగు వెలుగులు (ఇదో కాదో..పుస్తకం పేరు మాత్రం సరిగా గుర్తు లేదు) లో పద్మ వ్యూహం, గరుడ వ్యూహం ఇంకా కొన్ని ఇతర వ్యూహాలు వర్ణించారు

మన్యవ said...

ఛా! మిస్సయ్యాను. మా వూళ్ళో ఆ సినిమా పోయింది

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name