Wednesday, April 18, 2007

మొబైల్ ఫోన్ ను వెతికి పట్టుకోవటం ఎలా?

మీ గర్ల్ ఫ్రెండు గానీ, బాయ్ ఫ్రెండు గానీ "నేను ఆఫీసులో వున్నాను, పని మీద వున్నాను" లాంటి సాకులు చెప్తున్నట్లు మీకనిపిస్తే తక్షణం ఈ ఉపగ్రహ సాఫ్టువేర్ ద్వారా వారిని ఎక్కడున్నారో ఇట్టే పట్టెయ్యొచ్చు. కేవలం వారి మొబైల్ నంబరు ఇస్తే చాలు...వారి మొబైల్ సిగ్నల్ బట్టి ఏ ప్రాంతం (కూకట్ పల్లి, అమీర్ పేట లాంటివి) చెప్తుంది.

మొదటి నాలుగు సంఖ్యలు ఒక పెట్టెలో, మిగతావి మరొక పెట్టెలో వేసి సెర్చ్ నొక్కండిక.....

http://www.sat-gps-locate.com/

10 comments:

త్రివిక్రమ్ Trivikram said...

ముందుగా మీరెక్కడున్నారో తెలుసుకుందామని మీ నంబరే ఇచ్చి చూశాను. హన్నన్నా! ;-)

rākeśvara said...

మీ బ్లాగులో పక్క పట్టీ చాలా బాగుంది.
నేను కొన్ని లోగోలు కాపీ కొట్టుకోవచ్చా...
లేఖిని, గ్లోబల్ వార్మింగ్, తెలుగులో వ్రాయడం etc.
కృతజ్ఞతలు.
- రాకేశ్
http://andam.blogspot.com/

Sudhakar said...

నిరంభ్యంతరంగా పీక్కుని మీ బ్లాగులో అలంకరించుకోవచ్చు. వాటికి కాపీ సమస్యలేమీ లేవు :-)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

తప్పుచేస్తున్నారు సుధాకర్. మీ గుట్టు కూడా రట్టయిపోయింది- మాతో పాటు. చీమ కుట్టిన బ్లాగర్లా (మిమ్మల్ని చీమ కుట్టిందని మాకందరికీ తెలిసిపోయిందనుకోండి) సైలెంటయిపోతే బెటరేమో?

spandana said...

మా ఆఫీసులో ఇది భలే పేలింది.

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

ఓ ఆవేశ పడిపోయి ట్రై చేసెసాను.సెకన్లు గడిచేకొద్దీ కళ్ళు పెద్దవి చేసుకుని చూసేసాను లొకేషన్ దాకా వెళ్ళిపోతుంటే.చివరిలో పెద్దగా నవ్వు.అదీ జరిగింది...

రానారె said...

నేనక్కడ ఆ పరిస్థితిలో అలా ఉన్నానని తెలియగానే భలే హుషారుగా అనిపించింది.

చదువరి said...

ఏమిటో నేను ఐదారు నంబర్లు ప్రయత్నం చేస్తే అందరూ అక్కడే ఉన్నట్టు చూపిస్తోంది. సాఫ్టువేరులో లోపమేదన్నా ఉందా, లేక నిజంగానే మనాళ్ళంతా అక్కడే చేరారా? :(

Anonymous said...

ఈ బోగట్టా యేదో బావుందే అని మా ఆయన నంబర్ ఇచ్చి చూసా....మా ఆయన యెక్కడున్నారో తెలిసిపోయె తరుణం లో అంతా తుస్స్...ఒకటే నవ్వు ఇంక.అంతా సాఫ్త్ వేర్ మాయ ! భలే టోపీ వేసావ్ సుధాకర్ ;-)

mohanrao said...

balega undhi

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name