అసలే వేసవి. ఆపై భయంకరమైన రద్దీ. దేవుడిపై భారం వేసి రోజుల తరబడి క్యూ కాంప్లెక్సులలో కాపురాలు గడిపే పరమ భక్తులు..ఆహా ఏమి విశేష అభిమానులునారయ్యా వెంకు బాబు నీకు :-)
మరి వీళ్లందరిని ఇలా పడిగాపులు కాయించి పెరట్లో నుంచి అమితాబు కుటుంబానికి పెరటి దేవుడివైపోయావే? ఇది న్యాయమా? అసలే వీ.ఐ.పీ విహారాలతో పోటెత్తి పోతున్న తిరుమలలో ఇదొక కొస మెరుపా? లేదా 'సిరి' ఉన్నవాడిదే వేంకటేశ్వరమా?
రేపు చి..ల.సౌ. ఐష్ బచ్చన్ గారు, తన నూతన భర్త చి. అభి తో నీ దర్శనానికి వచ్చి కేవలం గంట అంటే గంటలో అన్నీ ముగించుకుని విమానమెక్కి పోతారంట గదా? ఆహా దేశ అభివృద్ధితో పాటు నీ పూజారుల బుర్రలు కూడా ఏమి అభివృధ్ధి చెందుతున్నాయి స్వామీ ? అటు ముగ్గురు, ఇటు ముగ్గురు పూజారులు ఐషమ్మ చుట్టూ రేపు వుండక పోతే నన్నడుగు. పందెమా?
6 comments:
అచ్చం ఇదే నేను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా. ఏ చెత్త వెధవ తిరుపతి కి వచ్చినా విఐపి అని చెప్పి అందరినీ ఆపేసి వారికి దర్శనం కల్పిస్తారు.
ఆఖరికి దేవుడి దగ్గర కూడా రిజర్వేషన్లే. ప్చ్...
ఇదే కారణంగా తిరుపతి వెళ్ళాలంటే భయమేస్తోంది. ఆయన మరీ వి.ఐ.పి. దేఁవుడైపోయాడు. తిరుమలలో వి.ఐ.పి. కౌంటరుకెళ్తే దేశంలో ఎంతమంది వి.ఐ.పి.లున్నారో తెలుస్తుంది. అన్నమయ్య సినిమాలో పద్మావతీదేవి, పవిత్రమైన కొండమీదికి చెప్పులేసుకొస్తే స్వామి ఎలా కన్పిస్తాడని అడుగుతుంది. చెప్పులే కాదు ముండల్నేసుకొచ్చినా, వి.ఐ.పి. సిఫారిస్ ఉంటే స్వామి దర్శనం నిమిషాల్లో అయిపోతుందని తెలియదా తల్లికి. తిరుమలకి రోడ్లు, బస్సులు పూర్తిగా తీసెయ్యడమొక్కటే నిజమైన భక్తులకి స్వామి చేరువయ్యే మార్గం.
నిజమే తిరుపతి వేళ్ళడానికి అస్సలు ఇష్టం ఉండటం లేదు. అదే దర్శనం ఇంటి దగ్గరి గుడిలోకాని, ఇంట్లోనే పెట్టుకుంటే మేలనిపిస్తుంది. అష్టకష్టాలు పడి, వేలకు వేలు ఖర్చు పెట్టుకుని వెళ్లినా సంతృప్తి ఉండదు.టిటిడి వారి ధనదాహానికి అంతులేదనిపిస్తుంది.కాటేజీల అద్దె కూడా సగం దినానికి ఒక రోజు అద్దె కట్టాలంట. ఇదంతా కాంగ్రేస్ మహిమ...డబ్బులుంటే అన్నీ రాజభోగాలే.
నాయనా సుదాకర, మీ అలొచన బహు ఉత్తమం. కాని నేను వారికి ఎటువంటి వరాలు ఇవ్వను నాయనా. నేను శ్రమపడి దర్శించుకునే నా భక్తుల మాట వింటాను కాని, పెరటి తోవన వచ్హి Flight ఎక్కి తుర్రుమనె వి.ఐ.పి వాల్ల మాట కాదు.
నేను నా భక్తులకె కాని వి.ఐ.పి కి కాదు నాయనా. ఇక ఉంటాను, ఎవరొ వి.వి.ఐ.పి అట వచ్హాడు.
ఇట్లు,
బాలాజి (at)తిరుపతి
" సిరిగలవానిని జుచిన సిరింకింజెప్పడు....." అని పొతన మహానుభావుడు తన పద్యాన్ని తిరగరాసుకొవలిసిన పరిస్తితి కనిపిస్తుంది, ఈ వి.ఐ.పి.ఆగడాలు, వారికి తన దర్శినభాగ్యం కలిగించేందుకు ఆ శ్రీవారు పడుతున్న పాట్లుచుస్తుంటే.
"ధనమే రా అన్నిటికీ మూలం..." మన ఇంట్లొ పూజ చెస్కున్న ఆ ప్రసాంతతే వేరు.
Post a Comment