రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం
సీతారాం సీతారాం, భజ ప్యారే తు సీతారాం
ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్. ||
పుట్టిన తరువాత, నూటా ముప్పై ఏళ్ళకు పైగా గడచినా, ఈ ఒకే ఒక్కడు కలలు గన్న దార్శనిక లోకం, యావత్ ప్రపంచాన్ని ఇంకా విభ్రమంలో ముంచెత్తుతూనే ఉంది.
భగవంతుడు, భారతీయులకు ఉమ్మడిగా ఇచ్చిన వరం "బాపు" జన్మదిన సంధర్భంగా, వారికివే హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం యధావిధిగా "ఈనాడు గాంధిగిరీ పనిచేస్తుందా?" అనే విషయం మీద చాల ప్రసార వాహికలు చర్చలు జరిపాయి. అందులో నాకు నచ్చింది సీ.యన్.యన్-ఐ.బి.యన్ వారు నిర్వచించిన కార్యక్రమం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, యువతరం ఇంకా కొంత వరకు గాంధీ అడుగు జాడలపైన ఆశలు పెట్టుకోవటం.అయితే కొంత మంది చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పినదేమంటే, "ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపిస్తే, దాన్నీ వాయించి, ఉచితంగా వీపు గూడా వాయగొట్టే కాలం ఇది" :-) కొంత వరకూ నిజమే కదా ! ఇప్పుడు నాకు తెలిసీ గాంధీగిరి కొద్దిగా పనికొస్తున్నది "మౌన పోరటాలు" వరకే. అంత వరకూ ఎందుకూ, గాంధీ బాటలో చిత్త శుద్ధితో నడచిన పొట్టి శ్రీరాములు చనిపోయే వరకూ అప్పటి ప్రభుత్వం దిగి రాలేదు కదా ! నా స్నేహితులొకరు చెప్పినట్లు "బ్రిటీషు వారు కాబట్టి గాంధీ సిధ్ధాంతాలు పని చేశాయి, అదే కనక జర్మన్లు అయితే, భారత దేశ జనాభా సగం తుడిచిపెట్టుకుకు పొయేది, గాంధీతో సహా". అంతే మరి ...శత్రువు బట్టే శరం కూడా ఎంపిక చేసుకోవాలి.
ఐన్‍స్టీన్ అన్నట్లు : రాబోయే తరాలు, అస్సలు ఇలాంటి మనిషి భూమి మీద రక్త, మాంసాలతో నడచేడంటే నమ్మలేకపోవచ్చు.
6 comments:
ఇప్పటికి అనిపిస్తు౦ది... సౌత్ ఆఫ్రికా లో రైల్వే అధికారి మన గా౦ధీని first class ను౦చి క్రి౦దకి తోసేయకి పొతే , తను బహుసా అక్కడే పెద్ద లాయర్ గా వు౦డిపోయేవాడు, మనకి ఈ 'ఒక్కడు' దొరికేవాడు కాదు : )
లేదండీ, బహుశా అతడు తన పోరాటాన్ని దక్షినాఫ్రికాలో కాకుండా, భారతదేశంతోనే మొదలుపెట్టేవాడేమో
నిజమే, శత్రువుని బట్టే శరం..బాగుంది.
గాంధి గురించి ఈ మధ్య చాలా వ్యాసాలు చదివాను. ఒక మంచి వ్యాసం చదివానన్న అనుభూతి కలిగిందిది చదివాక.
కృతజ్ఞ్ఙతలు రావు గారు :-)
అవును మీరన్నది చాలా నిజం జర్మనీ వాళ్లయ్యింటే పరిస్థితి భయంకరంగా ఉండేది. అంతెందుకు భారత దేశము మొత్తము ఫ్రెంచి వాళ్ల ఆధీనమయ్యే ప్రమాదము డూప్లే మరణముతో తృటిలో తప్పినది.
Post a Comment