Friday, October 27, 2006

తెలుగు మీకు ఇప్పుడు బ్రౌజరులో ఒక భాగం

మనం రోజూ చాలా తెలుగు పత్రికలు, బ్లాగులు చదువుతుంటాం. కానీ అవన్నీ గుర్తుంచుకోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటం కోసం నేను ఈ తెలుగు ఉపకరణ పట్టీ తయారు చేశాను. దీన్ని వ్యవస్థాపితం చేసుకుని మీరు కూడలిని శోధించగలరు, తెలుగు సైట్లకు వెళ్ళగలరు, తెలుగు పత్రికలు, కూడలి మరియు లేఖినిని దర్శించగలరు.

ఈ ఉపకరణ పట్టీ ప్రస్తుతం మీరు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+ లలో వ్యవస్థాపితం చెయ్యగలరు. దీనిలో ఇంకొక సౌలభ్యం ఏమిటంటే, మీరు ఈ పట్టీ కొత్త పరికరాలను ఎప్పటికప్పుడు పొందుతారు. మరలా మీరు ఎన్నడూ దీన్ని వ్యవస్థాపితం చెయ్యనక్కరలేదు.

ఇంకా ఆలస్యం ఎందుకూ? ఈ తెలుగోపకరణ పట్టీని దిగువ లంకె నుంచి ఆనందించండి.

తెలుగోపకరణ పట్టీ (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+)

గమనిక : ఈ పట్టీలో నాకు తెలిసి ఏ స్పైవేరు, మాల్వేరు, ఏడ్ వేర్ జత చెయ్యబడలేదు. ఈ సాఫ్ట్ వేరు యొక్క ప్రవర్తన, కలగ చేసే అదనపు ఇక్కట్లతో నాకు సంబంధం లేదు.  మరిన్ని వివరాలకై

12 comments:

రానారె said...

Great attempt. Before I suggest anything I need to install it, but
does it get neatly uninstalled?

Anonymous said...

yes, I tested it :-)

spandana said...

మంచి పనిముట్టు. అభినందనలు. కానీ ఇంటికెళితేనేగానీ పరీక్షించలేను.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

అద్భుతం!

Anonymous said...

ధన్యవాదాలు. కూడలికి RSS ఉంటే బాగుండును. కూడలి టపాలన్నీ ఈ పట్టీ నుంచే చూడవచ్చు.

Anonymous said...

భేషే.మీవలన నాకు మేలు కలి గినది
నాకు వక్చ్ తపాలను చదువ లేకుంటి ని
మరియు నా ఎక్సెప్లోరార్లో పెట్టేలే
వస్తున్న వి దానికి కూడా
మీరు ఉపాయం చూడండి
తెలుగు గుంపులకు ఎంతో సహాయం
చేసిన వారగు దురు

Anonymous said...

quite handy.. thanks

oremuna said...

అద్భుతం!

Anonymous said...

వేద పండిత గారు, మీ సమస్య బహుశా ఎన్ కోడింగు సమస్య కావచ్చు.లేదా మీ తెలుగు ఉపకరణ పట్టీ మీద ఉన్న "Enable Telugu" ని నొక్కండి. మీకు కావలసిన మొత్తం సహాయం సిధ్ధంగా ఉంటుంది.

Anonymous said...

కూడలి కి ఆర్.ఎస్.ఎస్. సిద్ధం.
http://veeven.com/koodali/rss20.xml

Anonymous said...

కూడలి తాజా కబుర్లు ఇప్పుడు ఈ పట్టీ నుంచే దర్శించుకోవచ్చును...ధన్యవాదాలు వీవెన్ గారు.

Anonymous said...

Ganesh, You can click on the life boat tube icon on the toolbar and see how you can enable telugu.

otherwise go here

http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name