అయితే ఏంటంటా గొప్ప? తొమ్మిది రోజులు కష్టపడి, కిలోల కొద్ది ఆభరణాలు ధరించి, రక రకాలుగా ఊరేగి నిద్ర కూడా లేకుండా భక్తులకు అలసి సొలసి దర్శనమిస్తే తొమ్మిది కోట్లు వచ్చాయి పాపం.
హైదరాబాదులో రోజుకు మూడున్నర కోట్లు వసూలవుతాయి...స్వామీ వింటున్నారా? ఈ నగరంలో మందుబాబులందరూ కలసి అక్షరాలా రోజుకు మూడున్నర కోట్లు మధుపాత్రకు సమర్పిస్తారు.... అంటే తొమ్మిది రోజులలో ముప్ఫైరెండు కోట్లు...:-)...పాపం గాంధీ గారు కూడా ఈ రాబడి ఒక్క రోజు ఆపలేకపోయారు.
అలా నీళ్ళు నమలకుండా ఏదో చెయ్యొచ్చు కదా? మీకూ హుండీ ఆదాయం పెరగొచ్చు, ఈ తాగుబోతులు తగ్గితే...అసలు మీకు ఏమైనా ఆలోచించటానికి భక్తులు సమయమిస్తే కదా !
1 comments:
ayya
thamari baadha artham ayyindi
kaani
jeevithamloni sunyanni tholaginchu
konenduku intha kante kicku icchedi emundi
simham
Post a Comment