మన ప్రభుత్వానికి కోడి మీద ఎంత ప్రేమో చూస్తూ వుంటే చాలా ఆనందంగా ఉంది. జిల్లా అధినేతల నుంచి వై.ఎస్ వరకు స్వయంగా కోడి కూర తిని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, ఒక్క సారి అయినా మన అన్నదాత కు ఇలా అండగా నిలబడ్డామా అని అనిపిస్తుంది. మన అన్నదాత టొమేటో కిలో అర్ద రూపాయ కి అమ్ముకున్న రోజులు, ఉల్లిని దళారులు కిలో నలభై రూపాయలకు అమ్ముకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి.
నిజం చెప్పాలంటే మన రాష్ట్రం లో కోళ్ల పరిశ్రమ ఇప్పుడు నష్ట పోయిన దాని కంటే వందల రెట్లు రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు...ఎవడికి పట్టిందీ?
నకిలీ ఎరువు అమ్మితే అయిదు వందల జరీమానా లేదా ఆరు నెలల ఖైదు...దాదాపు ఒక ట్రాఫిక్ ఉల్లంఘన కు విధించే శిక్షతో సమానం. కాని ఆ నేరం విలువ ఒక నిండు ప్రాణం కావచ్చు....మన వై.ఎస్ ప్రభువులు దాన్ని మానసిక దౌర్భల్యం అననూ వచ్చు...ఈ నేల పై ఏదైనా సాధ్యమే...
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
It is not only about Hens.
but more..
Tourism
Industry
investments etc..
మీ ఆలోచన బావుంది...కోళ్ళ వ్యాపారుల మీదున్న ప్రేమ రైతుల మీద ఎందుకు లేదు?....
ఫొటో లకి పోజులు ఇచ్చినంత మాత్రాన కోళ్ళ రైతుల మీద ప్రేమ ఉందంటారా? ఈ మధ్య వస్తున్న వార్తలు చూస్తోంటే వారి పరిస్థితి కూడ చాల దయనీయంగా ఉన్నట్లు కనపడుతోంది. మన సమాజంలో దళారీ లకు తప్ప రైతులకు మంచి రోజులు లేనట్లు కనపడుతోంది.
అయినా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతలకు కంట్రాక్టర్లంటే ప్రేమ ఉంటుంది కాని రైతులంటే ప్రేమ ఎందుకుంటుంది లేదా ఎందుకుండాలి చెప్పండి?
Post a Comment