ఈ నెలంతా చాలా గందరగోళంగా, హడావిడి గా వుంది నాకు. పని ఒత్తిడి అయితే ఇక చెప్పనక్కరలేదు. కొద్దిగా తృప్తిగా వున్నదేంటి అంటే, నా వరల్డ్ స్పేస్ రేడియో మరల పని చెయ్యటం మొదలు పెట్తింది. నిజం చెప్పాలంటే "స్పందన తెలుగు ఛానెల్" ఆకాశవాణి ఘనమైన గత కీర్తిని మరల గుర్తు తెస్తోంది. స్పందన కు నా అభినందనలు. నాకు నచ్చిన కార్యక్రమాలు..
1.ప్రతి వారం ఒక సంస్కృత నాటక పరిచయం - విశ్లేషణ. (డా. మృణాళిని గారు) - ఈ వారం : అభిఘ్నాన శాకుంతలమ్ (ఘ్నాన అనే పదం తప్పు కావచ్చు...ఈ సాఫ్టువేరు సహకరించటం లేదు---)- "అభిజ్ఞాన" - లేఖిని తో రాయగలిగా :-)
2.ప్రతి శని, ఆది వారాలలో మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే "పడక కుర్చీ కబుర్లు" -- యమ్.యస్.వి. ప్రసాదు గారు. ఈ వారం నెహ్రు, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి తెలియని పరిశోధనాత్మక విషయాలు చాలా చెప్పారు. వింటూ వుంటే కాలమే తెలియలేదు.
రావి కొండల రావు గారి హ్యూమరధం కూడా మొదలయింది కాని నేను ఇంకా వినలేదు.
వీటన్నింటిని మించి అధ్బుతమయిన మన పాత మధురాలు...వాటిలో కొన్ని
1. ఎవ్వరిదీ ఈ పిలుపు - మానస వీణ2. వీణ వేణువైన - 2. రవి వర్మకే అందని ఒకే ఒక - రావణుడే రాముడైతే
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
world space marI costly kadaa
yes, but it is worth for the quality you get in audio. You can listen at CD quality.
yes I agree with sudhakar... pinDi koddI roTTe...
"అభిఙ్ఞాన శాకుంతలం" వ్రాయగలనో లేదో అని చిన్న ప్రయత్నం చేసాను...!
తెలుగు లో బ్లాగులు చూస్తోంటే చాల ఆనందం కలుగుతోంది...:-)
ఇప్పటికే తెలుగు బ్లాగులు ప్రారంభించిన అందరికి అభినందనలతో...
అభిజ్ఞాన శాకుంతలము....ఇది నేను లేఖిని ఉపయోగించి రాయగలిగాను.
http://veeven.org/lekhini
mee telugu sie chala bagundandi...
Post a Comment