నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తెల్లవారు జామునే తేనెపట్టు దొరికితే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి :-)అందులో నాకు ఎంతో నచ్చిన "రచన" ఇంటర్నెట్ లో లభ్యమవటం ఒకటి. తపో సాధన లాంటి ఆ సాహిత్య మరియు బాషా తృష్ణకు మన తెలుగు భాషా సంఘం శాయి గారి ని సత్కరించి తీరాలి.
నాకు రచన పరిచయమయ్యింది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో అనుకుంటా...మల్లాది క్రిష్ణమూర్తి గారి "మూడు ప్రశ్నలు, ఒకటే సమాధానం" పోటీ ని నేను చాలా సీరియస్ గా చదివే వాడిని. ఒక సారి మాత్రం నాకు ద్వితీయ బహుమతి క్రింద 58 రూ. (అర్ధనూటపదార్లు అన్నమాట :-)) వచ్చాయి. అందులో ఒక అయిదు రూపాయలు తెచ్చిన పోస్టుమాన్ కి. కాకపోతే అది తప్పనిసరిగా లంచం కాదు సుమండీ :-)
తెలుగు వారంతా ఒకరిని అదుకొని తమని తాము అభిషేకించుకోవాలంటే తప్పక "రచన" లాంటి పత్రిక చదవాలి, వాటి మనుగడకు తోడ్పడాలి. ఒక్కసారి ఈ జనవరి నెల సంచిక చదవండి. మొదటి పుటలోనే నేను ఈ మధ్యనే కొన్న "బాల విహంగ వీక్షణ సంపుటి" గురించి ప్రకటన చూసాను.
ఈ రోజు దొరికిన ఇంకొక సాహిత్య కుసుమం, ఈమాట. నాకు ఇది కిరణ్ గారి సోది కామెంట్లు చదువుతుంటే దొరికింది. ఇది నిజంగా ఒక తేనె పట్టు. ఖాళీ సమయాలలో idlebrain.com చదవటం కంటే ఈ రెండూ కళ్లకద్దుకోవటం మంచిదని నా అభిప్రాయం.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఈ మాట గురించి అందరికీ తెలిసే ఉంటుందనుకున్నాను :)
కేవలం లింకు ర్యాంకులు పెంచడానికే నేను బ్లాగులో ఉంచినాను, కానీ మీకు లాభం కలిగినదని తెలిసిన తర్వాత ప్రతి సంచిక విషయసూచిననూ బ్లాగు చెయ్యవచ్చు అనిపిస్తుంది
ధన్యవాదాలండీ.. రచన, ఈ మాట ల గురించి తెలియపర్చినందుకు...ఎడారి లో ఒయాసిస్ కనపడినప్పుడు ఉన్నట్లుంది.
మీరు రచన పత్రిక బొమ్మను కొంత మార్చి మీ బొమ్మగా వాడినట్లున్నారు.
లేదండి. రచన పత్రిక కూడా ఈ బొమ్మను వాడుతున్నది. నేను ఇక్కడ చూసి వాడా
http://www.bapubomma.com/g3.htm
ఈమాట గురించి ఇన్ని మంచి మాటలు రాసినట్లు ఇప్పటిదాకా చూడలేదు.
అనేక ధన్యవాదాలు. :-) ముఖ్యంగా సుధాకర్ గారికి, కిరణ్ చావా గారికి.
Post a Comment