Monday, December 17, 2007

వింటర్ విస్టా : ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూర

ఇక్కడ రాస్తున్న కూర చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన కూర. ఒక విప్లవాత్మకమైన కూర. చెయ్యటానికి విశాల దృక్ఫదం వుండాలి. ముఖ్యంగా సహనం వుండాలి. ఇది నేను సొంతంగా తయారుచేసిన, పేరు పెట్టిన కూర. తయారు చేసి మీ తిట్లు వ్యాఖ్యలుగా రాయవచ్చు. కూర మొత్తం చేసాక ఈ కూరకు ఈ పేరు ఎందుకు పెట్టానో అర్ధం అవుతుంది. ఇది చాలా తక్కువ కాలరీలు కలిగే ఆరోగ్యకరమైన కూర.

కావలసిన దినుసులు

ఎర్రని కారట్ దుంపలు - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

కాలీ పువ్వు రెమ్మలు - పది

పచ్చ్ఝ బఠానీలు - వంద గ్రాములు

గుడ్లు - రెండు

బంగాళా దుంప - ఒకటి (చిన్నది)

కార్న్ పిండి - వంద గ్రాములు

టొమేటోలు - మూడు (పెద్దవి, బాగా పండినవి)

పచ్చి మిరప - ఐదు కాయలు

ఆలివ్ ఆయిల్ - ఒక టీ స్పూన్

కార్న్ ఆయిల్ - మూడు టీ స్పూనులు

జీలకర్ర - ఒక స్పూను

మిరియాలు - పది

ముందుగా గుడ్లు, బంగాళా దుంప బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాలి. గుడ్లు ఒలిచి మధ్యలో వుండే పచ్చని భాగాన్ని తీసుకుని, తొక్క తీసిన బంగాళాదుంపతో కలపి మిక్సీలో వేసి బాగా ముద్దగా చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

పచ్చ బఠానీలు, కాలీ పువ్వు రెమ్మలు, క్యారట్లు, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయలు (ముక్కలు కావు) కలిపి కుక్కర్లో వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చే వరకూ వుంచి దింపెయ్యాలి.

కొంత సేపయ్యాక కుక్కరు మూత తీసి కూరగాయల నీటిని ఒక పాత్రలో సేకరించాలి.ఈ నీరు చాలా ముఖ్యం.

ఉడికిన కూరగాయలు పక్కన పెట్టి, ఉడికిన క్యారట్లు తీసుకుని నిలువుగా చీల్చాలి. ఇలా చీల్చిన వాటిని కార్న్ ప్లోర్, జీలకర్ర పొడి కలపిన ద్రావకంలో ముంచి నూనెలో బాగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి.

ఒక బాణలి తీసుకుని కొద్దిగా కార్న్ నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసి పోపు వెయ్యాలి.

దానిలో ఉడికిన కూరగాయలన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వటం మొదలుపెట్టాలి.

పక్కన పెట్టుకున్న కూరగాయల నీటిలో గుడ్ల, బంగాళా దుంపల పేస్టుని కలిపి బాగా బీట్ చెయ్యాలి. దీనిలో కొద్దిగా కార్న్ పిండిని కొద్దిగా కలుపుకోవచ్చు.

ఇప్పుడు ఉడుకుతున్న కూరలో, మెల్లగా ఈ నీటిని కలిపి బాగా కలిపి అలానే ఒక పదిహేను నిమిషాలు ఉడకపెట్టి (ఉప్పు తగినంత కలిపి) బాగా కూర చిక్కబడిన తరువాత దింపాలి.

ఇప్పుడు దానిపై బాగా తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వింటర్ విస్టా కర్రీ రెడీ.

8 comments:

రవి వైజాసత్య said...

చాలా బాగుందండి..ఈ మధ్య ఎక్కువగా కూరగాయలు తినిగలిగే కూర కోసం వెతుకుతున్నాను. నాకిది బాగా పనికొస్తుంది. ఇక తిని చూసి చెబుతాను

oremuna said...

where are the photos?

why are you calling it Vista?

TM voilations :)

Sudhakar said...

:-) Vista:- The visual percept of a region

రాధిక said...

అంతా బాగానే వుంది గానీ కాస్త ఇది చూసేటప్పటికే భయమేస్తుంది."పక్కన పెట్టుకున్న కూరగాయల నీటిలో గుడ్ల, బంగాళా దుంపల పేస్టుని కలిపి బాగా బీట్ చెయ్యాలి. దీనిలో కొద్దిగా కార్న్ పిండిని కొద్దిగా కలుపుకోవచ్చు".

Anonymous said...

ఎందుకు బాబూ మా జీవితం మీద నీకు విరక్తి కలిగిందా? ఓ పాషాణ పాక ప్రభూ!

oremuna said...

Alas!

Looks like Anaamaka tried it!!

Srinivasmanasa A said...

hellow sudhakar garu neela bogspot design cheyalante elago chepthara

varun electronics said...

andamaina vantakalatho mammalni champestunnavu kada...


Amarender

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name