ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి.
చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి.
ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు.
ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో...
నిదురించు జహాపనా - ||
పండు వెన్నెల్లో వెండి కొండల్లే
తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||
నిదురించు జహాపనా - ౨
ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా - ||
నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨
ముంతాజ్ సతీ సమాధి
సమీపాన నిదురించు - ౨
జహాపనా...
ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో
నిదురించు జహాపనా - ||
17 comments:
సుధాకర్ గారు మధురగీతం అన్నారు,నేను మార్దవగీతం అంటాను.ఎం.యస్ గళంలో పొంగిన మార్దవం వరదల్లా ముంచేస్తుంది.ఇక్కడో చిన్న విషయం సుధాకర్ గారూ,ఈ గీతానికి,రచన,గానం,సంగీతం అన్నీ యం యస్సే.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అవునండీ రాజేంద్ర గారు. గీత రచన రామారావు గారని తెలుసు కానీ సంగీతం కూడా అతనిదే అని తెలియదు. ధన్యవాదాలు
రాజేంద్ర గారు...ఇది నీరాజనం చిత్రం లోనిది......సంగీతం మాత్రం ఓ.పి. నయ్యర్ గారు....సాహిత్యం, గానం రామారావు గారు.....
ప్రేగులు కదిలించే గీతం.
నేను కూడా సంవత్సరానికి ఒక్కసారి అయినా వింటాను.
నేనూ మీ బ్యాచే. చూడండి.
మీరు పొగుడుతున్నది సినిమా వెర్షన్నా లేకపోతే 1948 లో పాడిన originalనా? నాకయితే ఆ పాత వెర్షనే ఇష్టం :-). పోతే పాత రికార్డుపై సంగీత నిర్వాహకుడిగా పెండ్యాల పేరుంటుంది. అంటే పెండ్యాల వాద్యగోష్టి నిర్వహించారు. పాట రచన,బాణీ మీరన్నట్లు రామారావుగారివే. ఆ రికార్డుకు రెండవ ప్రక్క మరో గొప్ప పాటుంటుంది: "నల్లపిల్ల" అన్న పేరుతో. ఓహొహో పిల్లాదానా చల్లగుండాలే నల్లగుంటే కోపమా అని సాగుతుంది ...
పరుచూరి గారు,
నాకు మీరన్న ఆ పాత పాట తెలియదండి. ఎక్కడయినా వినే అవకాశమున్నదా?
నరహరి గారూ,మీరు చెప్పినదాంట్లోనూ కొంత నిజముంది.ఎలాగంటే స్వరకల్పన యం.యస్ దైనా వాద్యగోష్టి మాత్రం నయ్యర్ బృందానిదే.నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నంటే,ఎల్ పి రికార్డు మీద చూశాను,దాన్నుంచే క్యాసెట్ రికార్డు చేయించాను అప్పట్లో.పరుచూరి గారు చెప్పిందో మాటు చూడండి.
అభివాదాలతో
రాజేంద్ర కుమార్ దేవరపల్లి.
సుధాకర్-గారు,
Internet లో దొరుకుతుందో లేదో చెప్పలేను కానీ, 4-5 సంవత్సరాల క్రితం సరెగమ వాళ్ళ ద్వారా ఎం.ఎస్. రామారావుగారి 17-18 పాటలు (అధిక భాగం సినిమావి, కానీ కొన్ని "బేసిక్" పాటలు కూడా) బయటకు తేవడంలో నేనూ కొంత పాత్ర పోషించాను. ఆ టేపు ఇంకా మార్కెట్లో దొరికే అవకాశాలున్నాయి.
-- శ్రీనివాస్
సుధాకర్ గారూ
అది మరిచిపోలేని మధురగీతమండీ.. మరిచిపోయినది కానేకాదు
సుదాకర్ గారు నిజంగా చెప్పనా:::
ఈ పాట వింటూ నిద్రపోయా ఇప్పుడే మెళూకువ వచ్చింది సమయం 2:40 AM
అదే చేత్తో Download link ఇవ్వొచ్చుగా .........
థాంక్స్. ఒకప్పుడు వందల సార్లు విన్న ఈ గీతం మీ ద్వారా మరో సారి గుర్తుకొచ్చింది.
చాలా కృతజ్ణతలు
అబ్బ! ఎంత కాలం తర్వాత ఈ పాటని గుర్తుకు తెచ్చరు? ఈ పాట వింటుంటే మనసు ఆనంద పారవస్యంలో తేలిపోతుంది. థాంక్స్ అండీ. ఈ పాటని గుర్తుకు తెచ్చినందుకు.
లేఖిని నాకు అంతగా సహకరించలేదు నాకు తృప్తినివ్వలేదు కాని గూగుల్ ఇండిక్ ట్రాన్స్
చాలా సులువుగా సరళంగా ఉంది ఓకే
కృష్ణ బాలు
mind blowing music. thanks for sharing..!
thank u for posting this article..really its a good Shodhana
Post a Comment