Sunday, January 06, 2008

అంపైర్ చేతిలో రాయి

చాలా రోజులకి, మైదానంలో అంపైర్లు క్రికెట్ ఆడారు. ఆస్ట్రేలియన్లు సైతం సిగ్గుపడేలా ఒక ఇరవై సంవత్సరాలు క్రికెట్ క్రీడను ఈ ఇద్దరు అంపైర్లు "స్టీవ్ బక్నర్, బెన్సన్" లు తీసుకుపోయారు. జిల్లా స్థాయి అంపైర్లు సైతం ఇలాంటి పొరపాట్లు చెయ్యరేమో. అసలు వయసు అంతగా మీద పడిన వీరిని ఎందుకు ఐ.సి.సి ఇంకా పోషిస్తుందో అర్ధం కాదు. ఈ రోజు భారత్ టెస్టు మాచ్ కోల్పోవడంలో ఆసీస్ క్రీడాకారుల ప్రమేయమ్ ఏమీలేదు. అంతా మన అంపైర్ల మహిమే. అందులో స్టీవ్ బక్నర్ సంగతి అందరికి తెలిసిందే. మూడో అంపైర్ నిద్రపోతున్నాడనుకుంటాడేమో అర్ధం కాదు. వరల్డ్ కప్ 2007 లో వీరు చేసిన మహిమలు ఎవరికి తెలియదు? చీకట్లో ఆటను నడిపిన ఘనత వుంది.

అసలు మ్యాచ్ ఫిక్సింగులలో ఈ తెల్లకోటు కుర్రాళ్ళకు కూడా వాటాలు రావటం మొదలుపెట్టాయా?

వీటన్నింటిని మించినది ఆసీస్ నీతి నిజాయతీలు. తెల్లోల్ల దరిద్రపు బుద్ధి మాత్రం ఎక్కడకు పోతుంది. అవుటయ్యానని మూడు సార్లు తెలిసిన కోతి వెధవ చక్కగా సెంచరీ చేసుకున్నాడు. అది కాక జాతి వివక్షత అని అబధ్దాలు చెప్పటం. వీడిని కోతి అంటే కోతి జాతికే అవమానం కాదా? నక్క అంటే సరిపోతుంది.

ఈ టెస్టు మాచ్ ద్వారా అపఖ్యాతి తెచ్చుకున్న ప్రఖ్యాత ఆసీ గాడిదలు వీరే

౦౧. రికీ పాంటింగ్ (వీడి మీద ఆస్ట్రేలియన్స్ కే ఇష్టం లేదు.)

౦౨. సైమండ్స్ (తూచ్..తూచ్ అని చివర వరకూ ఆడేస్తాడు)

౦౩. క్లార్క్ (కింద పడిన బంతులు పట్టేయటంలో దిట్ట)

౦౪. హస్సీ (సిగ్గు లేకుండా..అంపైర్ అవుటంటే కానీ క్రీజు కదలడు)

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బీ.సి.సి.ఐ ఇప్పుడు ఫిర్యాదు చేస్తుందంట. క్రికెట్లో సింహ భాగాన్ని ఆక్రమించుకున్న భారత ఉపఖండపు దేశాలు, ఐ.సి.సి విషయంలో మాత్రం పిల్లులలానే వుంటాయి. మన ఖర్మ. అసలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కలసి ఒక పోటీ క్రికెట్ కౌన్సిల్ ఎందుకు పెట్టకూడదు?

బక్నర్ గాడిని పంపెయ్యమని ఐ.సి.సి కి పిటిషన్ ఒకటి పెట్టారు. మీరు కూడా మరి సంతకం చెయ్యండి.

http://www.petitiononline.com/RetireSB/petition.html

3 comments:

ప్రవీణ్ గార్లపాటి said...

మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
అసలు మన దేశాలంటేనే ఐసీసీ కి ఒక చులకన భావమేమో అని అనిపిస్తుంది.
అన్నిటికన్నా ఎక్కువగా సంపాదించేది మళ్ళీ మన దేశాల మీదే.
మన బీసీసీఐ వెధవలకు డబ్బు గోలే కానీ సరయిన పనులు చేసే దృష్టి మాత్రం ఉండదు. ఎంతసేపూ అంతర్గత కొట్లాటలే సరిపోతాయి.
ఇక ఆసీస్ "స్పోర్టీవ్ స్పిరిట్" గురించి ఎంత చెప్పినా తక్కువే. అనవసర వ్యాఖ్యలతో దూషించడం, తప్పుడు అప్పీళ్ళు చెయ్యడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
ఈ రోజు మాత్రం క్రికెట్టును అందరూ కలిసి చంపేసారు.

Ravi said...

బాగ చెప్పారండీ. అసలు ఈ సంఘటన తర్వాత మూటా ముల్లే సర్దుకుని రమ్మని చెప్పాలి, మన BCCI. కానీ ఇప్పటికే ఆడ్స్, అమ్యమ్యా లు, ఎవరికి ముట్టవలసినవి వాళ్ళకి ముట్టి వుంటాయి. అందుకే, ఈ BCCI వెన్నెముక లేకుండా వ్యవహరిస్తూంది, అనిపిస్తుంది. ఇక రికీ పాంటింగ్. ఈన గురించి పీటర్ రోబుక్ "వీడు క్రికెట్ కి కాదు, వీధి రౌడీ" అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేపర్ లో రాసాడు http://www.smh.com.au/ .. నాకు తెలిసి ఈ మాచ్ లో అందరికంటే మైన్ విలన్ వీడే. అంపైర్లు వీడికి అమ్ముడు పొయారు.

Nagaraju Pappu said...

మీరి కూడా న్యూస్ పేపరు వాళ్ళ లాగే మాట్లాడితే ఎలా సార్?
మనవాళ్ళు ఇంకా ఏడు బంతులు మిగిలుండగానే ఓడిపోయారు - ఇది వాస్తవం. రెండు ఎంపైరింగు తప్పులు జరిగేయి - నిజమే. మరి మిగిలిన ఎనిమిదిమందీ ఏం చేసినట్టూ - నిద్దరోయారేమో పాపం. అనీల్ కుంబ్లేదే రెండో ఇన్నింగులో అత్యధిక స్కోరు - ఇది చాలదూ మనమెంత గొప్పగా ఆడేమో తెలియడానికి? రెండు ఓవర్లు మాత్రమే నిలుచుంటే ఆట డ్రా అవుతుందని తెలిసినా కూడ - ఒక్క ఓవర్లోనే హర్భన్, ఆర్పీసింగ్, ఇషాంత్ లు ఎలా అవుటు అయిపోయారు?
మనలో మనమాట - హర్బజన్ నిజంగానే ఆమాట అనలేదంటే మీరు నమ్ముతారా? మనకేపాటి స్పోర్టివ్ స్పిరిట్ ఉందేఁవిటీ - ఇంకోళ్ళని ఆడిపోసుకోటానికి? మైదానంలోకి సీసాలు, రాళ్ళు విసిరే జనం ఇక్కడ లేరూ? క్రితంసారి, సిమ్మెండ్స్ ని ఇక్కడ అవమానం చెయ్యలేదూ మన జనాలు? శ్రీశాంత్ ఎంత అసహ్యంగా ప్రవర్తించాడో మరిచిపోయారా?

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name