Wednesday, January 09, 2008

బిల్ గేట్స్ కి పని పిసరంత కూడా లేని ఆఖరి ఆఫీస్ రోజు

ఎవరు ఎంత ఆడిపోసుకున్నా, సన్నాయి నొక్కులు నొక్కినా బిల్ గేట్స్ కి బిల్ గేట్సే సాటి అని నా గట్టి నమ్మకం. ఈ యుగంలో ఇంటింటికీ కంప్యూటరుండాలనే ఆశను నిజం చేయాలని తపించిన కంప్యూటర్ యుగకర్తలలో బిల్ ఒకరు. అంతే కాక గీకు వీరుడిగా నేను బాగా అభిమానించే వ్యక్తులలో బిల్ ఒకడు. అలాంటి వ్యక్తి ఒక రోజు హటాత్తుగా ఆఫీస్ కి ఇదే ఆఖరు రోజు అని ప్రకటించేసాడు. CES 2008 లో బిల్ తన చివరి ప్రసంగాన్ని వెలువరించాడు. ఆ సందర్భంగా ఏ పనీ లేక పోతే బిల్ ఆఫీస్ లో చేసే పనులేమిటి? అనే విషయం మీద ఒక సరదా కామెడీ వీడియో చేసారు. భలే ఫన్నీగా వుంది. చూడండి.

2 comments:

రవి వైజాసత్య said...

బిల్లీభాయ్ రిటైరవడంతో ఒక శకం ముగిసినట్లే..i think he truly deserves what he got..పూర్తి సమయం పౌండేషన్ కార్యక్రమాలు చూసుకొనే అవకాశం ఆయనకు ఈ జీవితంలోనే లభించబోతున్నందుకు ఆనందించాలి..కంగ్రాచ్యులేషన్స్ బిల్

Unknown said...

బిల్ గేట్స్ ని మనిషిగా ఎక్కువ మంది ఆడిపోసుకుంటారని నేననుకోను.
ఆయనకున్న ఇన్నోవేషన్, ముందుచూపు ఐటీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మందికి ఉంది.
ఫిలాంత్రఫీ కి ఆయనిచ్చిన ప్రాముఖ్యం నా మనసులో ఆయనకి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చింది.
హేట్సాఫ్...

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name