Thursday, April 06, 2006

విండోస్ ఎక్స్ పి ఇక మన తెలుగు లో

ప్రతి చోటా గ్రామీణ కంప్యూటర్ రాక గురించి వార్తలు వెలువడుతున్న సందర్భంలో మంచి తేనె లాంటి తెలుగు వార్త. విండోస్ ఎక్స్ పి తెలుగు భాషలో మిమ్మల్ని అలరించబోతున్నది. ఇక మీరు మీ బామ్మ గారికి ఈమెయిల్, చాట్ నేర్పించే రోజులు వచ్చేసినట్లే.

tel_lip

మీరు ఈ దిగువన ఇవ్వబడిన లింకు ను ఒక సారి క్లిక్ చెయ్యండి.
తెలుగు భాషా సరంజామా విండోస్ ఎక్స్ పి కొరకై సంగ్రహించండి

త్వరిత వివరాలు
ఫైల్ పేరు: LIPSetup.msi
వెర్షన్ : 1.0
ప్రచురించబడిన తేది: 05-04-06
భాష: తెలుగు
డౌన్ లోడ్ పరిమాణము: 6.5 ఎం.బి (డయల్ అప్ పైన సుమారు 16 నిమిషాలు పడుతుంది)

2 comments:

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

బాగుంది. నేను నా వ్యవస్ధ లో ప్రతిష్ఠాపించాను. అయితే ఆంగ్ల భాష కి తెలుగు భాష కి మధ్య మారటానికి ఎమన్నా ఏర్పాటు ఉన్నదేమో నని చూస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే ఇక్కడ తెలియ పరచగలరు.

నేను నా కార్యాలయంలో విండోస్ 2000 జపనీస్ వాడుతున్నాను. దానిలో ఆ విధమైన ఏర్పాటు ఉంది.

murthy said...

రాజ గారు,

ఇక్కడ మన పళ్లెము లొ ఆ వంటకం (తెలుగు మరి ఆంగ్లం అనువాదం) ఇంకా వండుతున్నారు. ఆ వంటకం పాశ్చాతులు సరిగ్గా వండగలరా?

శోధన గారు ఇచ్చిన విండోస్ ఎక్స్ పి లొ పదజాలం చాలా బాగుపరచాలిసి వుంది. ఇదే ఇలా వుంటే, ఇంకా భాష మార్పిడి ఎలా వుంటుందో ???

వేంకట మూర్తి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name