Wednesday, February 13, 2008

నంది అవార్డులు...2006

2006 వ సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు. ఎప్పటిలానే నంది అవార్డుల కమిటీ తన నాసిరకాన్ని కొంత బయట పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాపకంలో వున్న ఏ కమిటీ అయినా అలానే పనిచేస్తుందని నిరూపించింది.

మనకర్ధం కాని కొన్ని అవార్డులు ఇవి...

ఉత్తమ నటుడు : నాగార్జున (రామదాసు). :- రామదాసు చూస్తే నాకు రాఘవేంద్రరావు తప్ప ఎవరూ కనపడలా. అసలు రామదాసు జాడే లేదు. అక్కినేని నాగార్జున కొన్ని సీన్లలో, అన్నమయ్య కొన్ని సీన్లలో కనిపించారు. మరి ఏ ప్రాతిపదికన నాగ్ కు ఈ అవార్డ్ ఇచ్చేశారో ఆ రాముడికే తెలియాలి. ఈ విభాగంలో ఈ అవార్డు మిస్సయిన అసలు  ఉత్తమ నటులు : ప్రకాష్ రాజ్, సిద్ధార్ధ్, మహేష్ బాబు.

ఉత్తమ సందేశాత్మక చిత్రం : స్టాలిన్ :- ఇది మరీ టూ మచ్. స్టాలిన్ లో ఉన్న సందేశం ఏమిటో అసలు అర్ధం కాలేదు. సినిమా ప్రారంభంలోనే కధానాయకుడు ఒక పెద్ద పచ్చని చెట్టుని నేల కూల్చి కొంత మందిని అడ్డుకునే దృశ్యం చిత్రానికే హైలైట్. ముగ్గురు మరో ముగ్గురికి సాయం అనేది కొంపదీసి సందేశమా? ఏమో?

నచ్చిన, సత్తా నిజంగా వుండి గెలుచుకున్న అవార్డులు ఇవి...

ఉత్తమ దర్శకుడు : శేఖర్ కమ్ముల (గోదావరి) :-  తెలుగు సినిమాని ఎంత సులభంగా, తక్కువ ఖర్చులో , అందరికి నచ్చేట్లు , అసలు ఏ పకోడీ స్టార్లు లేకుండా ఎలా తీయొచ్చో మరీ మరీ నిరూపిస్తున్న మన పక్కింటి కుర్రాడు. హాట్సాఫ్.

ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (బొమ్మరిల్లు) :- ఎదురులేని వాచకం ఇతని సొత్తు. ఏ సినిమాలో  ఉన్నా సరే అతడే  హీరో అనిపిస్తాడు.

ఉత్తమ సంభాషణల రచయత : అబ్బూరి రవి (బొమ్మరిల్లు):- హాయిగా, సరదాగా ఎంతా బాగా ఉంటాయ్ కదా బొమ్మరిల్లు డైలాగులు.

ఉత్తమ చిత్రం : బొమ్మరిల్లు :- అవును. ఇదే ఉత్తమ చిత్రం. ముమ్మాటికీ. దీని ముందర ఏ దాదాలు, బాబులు పనికి రారు.

10 comments:

Anonymous said...

Meeru annadi akshraala nijam...Nag cannot be a best actor at all. Similarly Stalin can never belong the category of message oriented movie. Anta dabbu mayam

కొత్త పాళీ said...

పంది అవార్డులు ఇంత ఆలస్యంగా ఇస్తారా? ఇప్పుడీవ్వాల్సినవి 2007 సినిమాలకి కాదా/

Anonymous said...

మీ బ్లాగ్ చూసాకే తెలిసింది 'నంది ౨౦౦౬ అవార్డులు ' ప్రకటించారని.

రామదాసు పాత్రకు గాను 'నాగార్జున' కు ఉత్తమ నటుడు ఇవ్వటం సబబే అని నా అభిప్రాయం. మీరు చెప్పినట్టు మహేష్ బాబు కానీ (బహుశా పోకిరి అనుకుంటా), సిధార్త కానీ, ప్రకాష్ రాజ్ కానీ (ఈయన విషయంలో నో కామెంట్) చేసినటువంటి పాత్రల కంటే ఒక చారిత్రిక పాత్ర పోషించిన నటుడికి ఈ అవార్డు ప్రకటించడం సబబెనేమో. పోకిరి నచ్చలేదని కాదు. బహుశా నేను పోకిరి ఆరేడు సార్లు చూశాను (డివిడి) . బొమ్మరిల్లు కూడా మూడు నాలుగు సార్లు చూశాను. చివరగా, నాగార్జున నటన కూడా బాగుందని నా అభిప్రాయం.

రాధిక said...

ఏ అవార్డులయినా సరే ఉత్తమ నటుడు చిరంజీవి లేదా నాగార్జున
ఉత్తమ చిత్రం చిరంజీవి సినిమా లేదా నాగార్జున సినిమా
ఉత్తమ నటుడు చిరు అయితే ఉత్తమ చిత్రం నాగార్జున కి,ఉత్తమ నటుడు నాగార్జున అయితె,ఉత్తమ చిత్రం చిరు సినిమాకి వస్తుంది.గత 5,6 ఏళ్ళుగా ఇదే వరుస.వీళ్ళిద్దరి పేర్లూ లేని అవార్డు వుండదేమో?అలాగే వీళ్ళ సినిమాలు ఎంత చండాలంగా వున్నా అన్ని సైట్లలో రేటింగు 3.5 కి తగ్గదు.అవునులెండి పాపం వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు?చిరుకి అభిమానులు ఆంధ్రాలోనే కాదు ప్రపంచం నలుమూలలా వున్నారు.ఏమన్నా తప్పుగా రాస్తే ఏ అభిమాని ఏ మూల నుండి దాడి చేస్తాడో తెలియదుకదా.అందుకే పాపం వాళ్ళు అలా రాస్తున్నారు.వాళ్లని మనం ఏమీ అనలేము.

Unknown said...

కొత్త పాళీ గారు,
మీరు మరీను. పంచవర్ష ప్రణాళిక కాకుండా రెండేళ్ళలో అవార్డులిచ్చేస్తుంటే మీరు తప్పు పడతారా... ఆయ్ఁ...

పెద్ద సినీ హీరోలకి అవార్డులు కట్టపెట్టటానికి పుట్టినవేనేమో ఈ నందీ అవార్డులు.

Naga said...

@కొత్తపాళి: మాస్టారూ, పంది అవార్డులను ఎప్పుడు, ఎవరికి & ఎందుకు ఇచ్చినా "పెద్దగా" పట్టించుకోనవసరం లేదు.

రాఘవేంద్రదాసు, రాఘమయ్య సినిమాలు రెండూ తెలుగు వారి "చారిత్రక" దారిద్రానికి చిహ్నాలు.

Unknown said...

"తక్కువ ఖర్చులో" , ఏమీ కాదు గోదావరి సినిమాకు సుమారు ఏడు కోట్లు బడ్జెట్

Sudhakar said...

@చందన..
ఏడు కోట్లు...అది ఒక సినిమాకి మన తెలుగు బాబులు, మైక్రో స్టారులు తీసుకుంటున్న పారితోషకం. సినిమా మొత్తానికి ఏడు కోట్లు తక్కువే కదా.

@రాజశేఖర
అది చారిత్రాత్మక పాత్రా? వక్రీకరణ పాత్రా? చారిత్రక సినిమాలు తీయటం అసలు రాఘవేంద్ర రావుకు వచ్చా? ఆ లెక్కన చాలా చారిత్రాత్మక సినిమాలు వచ్చాయే ముందు కూడా...షిర్డీ సాయిబాబా మీద, జీసస్ మీద. ఆ సినిమాల్లో విజయ్ చందర్ లాంటి నటులు జీవించారు. కాదంటారా?

Anonymous said...

ప్రవీణ్, నాగరాజా గారూ, సుధాకర్ గారూ,

పోనివ్వండీ..

నాగార్జున, రాఘవేంద్ర రావ్ అవార్డ్ ఇవ్వాల్సొస్తే, అది, రామదాసుని ఇంకా చీల్చి చెండాడి మన కళ్ళల్లో రక్తం కారకుండా చూసినందుకు. ఆ రాఘవేంద్రుడు రామదాసు ధర్మపత్ని తో కలిసి జామ పళ్ళతో డ్యూయట్ పాడినట్టుగా చూపలేదు. సంతోషించండి.

పంది అవార్డులని మీరే అన్నరుగా...వూరపంది అవార్డ్ కానందుకు ఆనందించండి.

Anonymous said...

i want to say one thing.......
entandi meeru mareenu...godaavari is the remake of one oldfilm i forgot name....anr was hero in that......the first rule for nandi award is....it should not be a remake film............ok....ante meeku nachhina vatiki iste ok otherwise...comments....stalin lo chinna sandesam ichhara leda....anduke adi sandesatmaka film..its not in best film......

next prakash raj ki name vachhina characters anni because of dialogues and manchi characters selection... for example see stalin.. tooo worest acting.....manchi character leka poyina janalaalo anipinchali veedu baaga chesadu ani..ante gani.....veshalu mekap valla kadu......

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name