Tuesday, February 26, 2008

తెలుగులో అత్యుత్తమ బ్లాగులు

26, ఫిబ్రవరి : టపా కొద్దిగా సాగు చేయబడింది...

ఈ టపా రాద్దామని చాలా రోజుల నుంచి తెలుగు టీవి డైలీ సీరియల్ లాగా లాగుతూ వస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. తెలుగులో వెలుగులు విరజిమ్మే తెలుగు బ్లాగులను పట్టుకోవటం అంత కష్టమేమి కాదనుకోండి. అయితే నా దృష్టిలో, మూడు సంవత్సరాలకు పైగా తెలుగులో బ్లాగుతున్న ఒక బ్లాగరుగా మంచి తెలుగు బ్లాగుకు ఉన్న నిర్వచాల ప్రకారం తెలుగులో అత్యుత్తమ బ్లాగులను గూర్చి రాయదలచుకున్నాను. నేను ముఖ్యంగా ఒరిజినాలిటీ, పారదర్శకత, సృజనాత్మకత, బ్లాగు క్రమ శిక్షణ, సమాచార పరిశోధనల పరంగా ఈ బ్లాగులను ఎంచుకున్నాను. వీటిలో నేను ర్యాంకింగ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇవన్నీ వాటికవే సాటి. ఆ బ్లాగులు ఆ బ్లాగర్లు మాత్రమే రాయగలరనే బ్లాగులు. పోటీ ప్రసక్తే లేదు.

  • గుండె చప్పుడు : http://hridayam.wordpress.com/ : దిలీప్ గారు రాసే గుండె చప్పుడు ఇది. సమాచారం అంతా పక్కాగా వుంటుంది. మీరు వ్యాఖ్య రాయాలన్న జాగ్రత్తగా టపా చదివి రాయాలనేంత చక్కగా వుంటాయ్ టపాలు. బ్లాగు పేరుకు సరిసాటిగా వుంటాయ్.
  • చదువరి : http://chaduvari.blogspot.com/ : ఒరిజినాలిటి అడుగడుగునా ఉట్టిపడే తెలుగు బ్లాగులలో ఒకటి. ముక్కు సూటిగా మొట్టికాయలు వేసే ఈ బ్లాగు అందరికీ సుపరిచితం.
  • అంతరంగం : http://blog.charasala.com/ : అమెరికాని, ఆంధ్రాని..ఆవకాయతో కలపి తింటున్నామా అనిపించేటట్లు చక్కగా తన అంతరంగాన్ని ప్రసాద్ చరసాల గారు రాస్తారిక్కడ.
  • తెలుగు నేల : http://nagaraja.info/telugu_nEla/ : నాగరాజా గారు తన తెలుగు సౌరభాలను, హాస్యాన్ని, మానవత్వాన్ని, ఆధ్యాత్మికత తో కలపి రాస్తున్న చల్లని బ్లాగు.
  • సత్య శోధన : http://satyasodhana.blogspot.com/ : సత్య సాయి కొవ్వలి గారు, కొరియా కబుర్లంటూ మెల్లగా మొదలు పెట్టి, అతి త్వరగా మంచి బ్లాగుల క్లబ్బులో స్థానం కొట్టేసారు. రాసినవి 45 టపాలే అయినా మరీ మరీ చదవాలనిపించే బ్లాగ్.
  • ప్రసాదం : http://prasadm.wordpress.com/ : హాస్యాన్ని జంధ్యాలను గుర్తుకు తెచ్చే స్థాయిలో ప్రసాదం లా పంచే ప్రసాదం గారి బ్లాగు.
  • రెండు రెళ్ళ ఆరు : http://thotaramudu.blogspot.com/ : రాసినవి కేవలం పది హేను టపాలు. కానీ ఈ బ్లాగు నవ్వించి కళ్ళంబడి నీరు కారించిన వారు వేలలోనే వుంటారు. ఈ బ్లాగ్ టపాలు ఈ-లేఖలుగా ఇప్పటికీ తిరుగుతున్నాయంటే నమ్మండి. గౌతమ్ DSG అనే చెన్నయ్ చంద్రుడు రాసే బ్లాగిది. నవ్వలేక చావాలి. జాగ్రత్త.
  • కలగూరగంప : http://www.tadepally.com/ : మంచి సమాచారం, పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు రాసే పక్కా తెలుగు బ్లాగ్ ఇది.
  • విహారి : http://blog.vihaari.net/ : హాస్యపు జల్లుల బేహారి, తెలుగు బ్లాగ్స్ంఘ ఆస్థాన విదూషకుడన్న బిరుదున్న విహారి గారు రాసే పక్కా నవ్వుల బ్లాగు ఇది. మీకు మనసు బాగోలేనప్పుడు ఈ బ్లాగు పూటకు ఒక సారి వేసుకోండి. సరిపోతుంది.
  • నా మదిలో : http://praveengarlapati.blogspot.com/ : తెలుగులో సాంకేతిక అంశాలకు టెక్ క్రంచ్ లాంటి బ్లాగేమైనా వుంది అంటే అది ప్రవీణ్ గార్లపాటి "నా మదిలో" మాత్రమే. పేరుకు తగినట్లు ఏ బేషజం లేకుండా సీదాగా వుండి మరీ మరీ చదవాలనిపిస్తుంది.
  • సాలభంజికలు : http://canopusconsulting.com/salabanjhikalu/ : తెలుగు సాహిత్య వైద్యం చేసే అతి కొద్ది బ్లాగులలో నాగరాజు గారి సాలభంజికలు బ్లాగు ఒకటి. అత్యున్నత ప్రమాణాలు దీని సొంతం.
  • రానారె : http://yarnar.blogspot.com/index.html : తెలుగు బ్లాగులు చదివే వారికి బాగా పరిచయమున్న రాజు గారు, యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి (ముద్దుగా రానారె) రాసే ఆణిముత్యాల జల్లు ఈ బ్లాగు. తెలుగులో ఒక మంచి రచయత రచనలు అచ్చు వేయించుకోకుండా బ్లాగు రాస్తే మరి ఇలానే వుంటాది...మరి యేం జెప్తాం !
  • అప్పుడు ఏం జరిగిందంటే : http://kranthigayam.blogspot.com/ : క్రాంతి గారు ఈ మధ్యనే మొదలు పెట్టిన బ్లాగు. మంచి హాస్యంతో ఆపకుండా చదివించే బ్లాగు.
  • 24 ఫ్రేములు, 64 కళలు : http://www.24fps.co.in/ : మన తెలుగు వెంకట్, నిశితంగా తను గమనిస్తున్న చిత్ర పరిశ్రమ మీద, చరిత్ర మీద రాస్తున్న అతి వైవిధ్యమైన బ్లాగు.
  • సౌమ్య : http://vbsowmya.wordpress.com/ : తెలుగు బ్లాగర్లకు సుపరిచితమైన సౌమ్య IIIT లో చదువుతూనే సాగిస్తున్న ఒక సాహిత్య యాత్ర ఈ బ్లాగులో మీ ముందు. చాలా మంచి పుస్తకాలు మీకు పరిచయం అవుతాయ్ ఇక్కడ.
  • నా బ్లాగు, నా సోది, నా నస : http://www.mpradeep.net/ : వికీ వీరుడు ప్రదీప్ రాసే బ్లాగు ఇది. కలగూరగంపలా వున్నా మంచి విషయ పరిజ్ఞానం ఉన్న బ్లాగు ఇది.
  • ఓనామాలు : http://onamaalu.wordpress.com/ : తెలుగు ఫర్ కిడ్స్ అనే వెబ్ సైట్ ను నిర్వహించే లలిత గారు రాసే ఓనామాలు బ్లాగు ఇది. చాలా స్ప్రష్టమైన అభిప్రాయాలు, చాలా వరకూ జీవితపు అనుభవాల మాలికతో అందంగా సాగిపోయే బ్లాగ్. ఈ బ్లాగును నాగరాజు గారు సూచించారు. అందుకు ధన్యవాదాలు.

ఈ పైన పేర్కొన్న బ్లాగులు నాకు తెలిసిన, బాగా విరివిగా రాస్తున్న బ్లాగులనుంచి తీసుకున్నాను. పైన చెప్పినట్లు నేను ఆ ఐదు అంశాలకు లోబడే ఈ జాబితా తయారు చేసాను. నేను సంకలనం చెయ్యని మంచి బ్లాగ్ ఏమైనా ఉంటే నాకు ఈ-లేఖ పంపండి. ఈ చిట్టాకు జత చేస్తాను. నేను ఈ చిట్టా తయారులో కొన్ని బ్లాగులను వదిలేసాను. దానికి చాలా కారణాలు వున్నాయి. డాక్యుమెంటేషన్ బ్లాగులు, ఆపేసిన బ్లాగులు, సేకరణ బ్లాగులు, లింకు బ్లాగులను నేను పరిగణనలోనికి తీసుకోలేదు. బ్లాగు అంటే నా దృష్టిలో ...ఇడియట్ చిత్రంలో హీరో చెప్పినట్లు "బుర్రలో ఏముందో అదే నా నోటి నుంచి వస్తుంది. నోట్లో ఏముందో అదే నా బ్లాగులో రాస్తా.." అనే వారు రాసే డైరీ. తెలుగులో పైన ఉన్న బ్లాగుల లాంటివి ఒక ఐదు వేలు వస్తే జన్మ ధన్యమైనట్లే. తెలుగు బ్లాగులు చరిత్ర సృష్టించినట్లే అని నేను నమ్ముతాను.

ఆఖరుగా....ఒక మాట

"ఎన్ని బ్లాగులు రాస్తున్నాం అనేది ముఖ్యం కాదన్నయ్యా !....అసలు సిసలు టపాలు రాస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంటు" :-)

36 comments:

Naveen Garla said...

ఈ లిస్టులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటో తెలుసా...చాలా వరకు బ్లాగులు ఒక లక్ష్యానికి, విషయానికి కట్టుబడి టపాలు ప్రచురిస్తున్నవి. తెలుగు బ్లాగుల్లో ముందు వరుసలో నిలువటానికి ఈ బ్లాగులు ఎంతైనా అర్హమైనవి. వచ్చే సంవత్సరానికి ఈ జాబితా హనుమంతుని తోకలా పేద్దగా పెరగాలని ఆశిస్తున్నాను :)
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

Naveen Garla said...

ఈ లిస్టులో ఒక గమ్మత్తైన విషయం ఏమిటో తెలుసా...చాలా వరకు బ్లాగులు ఒక లక్ష్యానికి, విషయానికి కట్టుబడి టపాలు ప్రచురిస్తున్నవి. తెలుగు బ్లాగుల్లో ముందు వరుసలో నిలువటానికి ఈ బ్లాగులు ఎంతైనా అర్హమైనవి. వచ్చే సంవత్సరానికి ఈ జాబితా హనుమంతుని తోకలా పేద్దగా పెరగాలని ఆశిస్తున్నాను :)
- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

ఆసా said...

good post Sudha.. atleast for part time visitors (not intentional) like me,good opportunity to catch up in a short time.
I guess blog world is changing so much in each month..

Anonymous said...

నిజమే. ఇవే తెలుగులో అత్యుత్తమ బ్లాగులు.బాగా ఎంపిక చేసారు.

Anonymous said...

అమ్మయ్య ఇలాంటి బ్లాగులు వెతుక్కోలేక చస్తున్నానండి. ఇక ఇ చిట్టా చాలు. నెనర్లు.

Nagaraju Pappu said...

సుధాకర్,
నెనర్లు. "సాహిత్యం వైద్యం రాసే.." అంటే??

"మీకు మనసు బాగోలేనప్పుడు ఈ బ్లాగు పూటకు ఒక సారి వేసుకోండి." -- సూపర్.

ఈ మధ్యకాలంలో నాకు తెగ నచ్చేసిన బ్లాగు, ఫణీంద్ర కుమార్ గారి కలంకలలు. సాహిత్యం బ్లాగులలో మణిపూస ఈ బ్లాగే. ఇందులో ప్రతివాక్యం పదిసార్లు చదువుకోవాలనేంత ముచ్చటగా ఉంటాయి. శైలి, శిల్పం నేర్చుకోవాలనే వాళ్ళకి ఈ బ్లాగో మాన్యువల్. ఇలాటి రచనలకోసం ఏ పత్రికైనా పడిగాపులు పడల్సిందే.
http://naagodava.blogspot.com/


బ్లాగు అనే నిర్వచనానికి నూటికి నూరుపాళ్ళు ఒద్దికగా ఒదిగిపోయే ఒనామాలు బ్లాగుకూడా చాలా బావుటుంది.
http://onamaalu.wordpress.com/

చీర్స్,
నాగరాజు (సాలభంజికలు)

Sudhakar said...

@నాగరాజు గారు,

తప్పు దిద్దుకున్నా :-) మంచి బ్లాగులు సూచించినందుకు ధన్యవాదాలు. ఓనామాలు బ్లాగ్ నేనెలా తప్పానో అర్ధం కాలేదు. జత చేసా.
ఇక పోతే కలంకలలు బ్లాగు విలువల పరంగా చాలా బాగుంది. కాక పోతే మరీ తక్కువ టపాలున్నాయి. అందువలన కొద్ది నెలలు చూసి ఈ చిట్టా సాగు చేసినపుడు జత చేస్తాను.

Satyasuresh Donepudi said...

సుధాకర్ గారు,

మీ బ్లాగ్ ని నా బ్లాగ్ (టూకీగా...2keegaa.blogspot.com) లో పెట్టుకోవటానికి అనుమతించరూ...
~ సత్యసురేష్ దోనేపూడి.

Satyasuresh Donepudi said...
This comment has been removed by a blog administrator.
Sudhakar said...

@సత్య సురేష్ గారు,

మీరు నా బ్లాగ్ లంకె గురించి మాట్లాడుతున్నారా? నిరభ్యంతరంగా మీరు ఏ బ్లాగు లంకెనయినా వాడుకోవచ్చు. :-)

GKK said...

పబ్బులో సైగల్ పాట రీమిక్స్ విన్నంత ఆనందంగా ఉందన్నా. గవ్ అన్నా! కొత్తపాళన్న బ్లాగు యాది మర్సిపోయినావా?

రాధిక said...

చాలా మంచి లిస్టు.లలిత గారు బ్లాగు గురించి చెపుదామని అనుకున్నాను.కానీ మీరు మైల్ ఇమ్మన్నారుగా అంత ఓపిక లేక లైట్ తీసుకున్నాను.

cbrao said...

కొత్తపాళి - http://kottapali.blogspot.com/, నా ప్రపంచం - http://naprapamcham.blogspot.com/, నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు - http://computereras.blogspot.com/2007/07/blog-post_12.html

మంచి బ్లాగుకు, మీ ఉద్దేశం లో ఉండవలసిన లక్షణాలు వీటిలో వున్నవి. పరిశీలించండి.24 ఫ్రేములు, 64 కళలు - ఇది ఇప్పుడు discontinue అయి, నవతరంగం గా వస్తుంది.

Naga said...

మీ ప్రోత్సాహానికి నెనర్లు. ఇక టపాకు రెండవ భాగం రాసే ఆలోచన ఉందా?

Sudhakar said...

@ cbrao గారు,
కొత్తపాళీ గారి బ్లాగును మిస్ అయ్యాను. మొదట తెరచి పెట్టుకున్న సైట్లలో అది వుంది కానీ పొరపాటున ఆ టాబ్ మూసేసి ఉంటాను. మర్చిపోయా. జత చేసాను. ఇకపోతే నా ప్రపంచం బ్లాగ్ గురించి ఇప్పటివరకూ నాకు తెలియదు. ఒక సారి చూసి జత చేస్తా.

శ్రీధర్ గారి సాంకేతికాలు అద్భుతమైన సాంకేతిక బ్లాగ్. కానీ నేను పైన చెప్పిన తరగతులలోనికి రాలేదు. నేను కేవలం ఆలోచనలలోంచి పెల్లుబికిన బ్లాగులనే "అసలు బ్లాగులు" గా నిర్వచించాను. మిగతావన్నీ నాకు వెబ్ సైట్లే.

నవతరంగం కూడా నాకు వెబ్ సైట్లా అనిపిస్తుంది. చూడాలి.

@ నాగరాజా గారు : తప్పకుండానండి. ఈ చిట్టానే సాగుచేస్తూ పోతాను.

cbrao said...

"నేను కేవలం ఆలోచనలలోంచి పెల్లుబికిన బ్లాగులనే "అసలు బ్లాగులు" గా నిర్వచించాను." - బాగుంది.ఇది కొంచం వివరణ ఇస్తే బాగుంటుంది. అంటే సేకరణలు కానివి అనుకోవచ్చు. శోధన ఏ Category లో వస్తుంది? ఈ నిర్వచనం కింద రాని బ్లాగులను, ఎలా categorize చేస్తున్నారు?

శోధన గుండెచప్పుడు హృదయం లాగా వుండదా కొన్ని సార్లు? అనుకోకుండా, కొందరు బ్లాగరులు ఒకేలా స్పందింస్తారు; లేక ఒకే విషయంపై.Repeat ఐన కామెంట్లను తొలగించండి.

వింజమూరి విజయకుమార్ said...

మీరు రాసిన లిస్టు మంచిదే గానీ అది కేవలం మీ వ్యక్తిగత అభిప్రాయం కూడా. అందుకే మొదట్లో దాని గురించి ఏమీ అడగదలచుకోలేదు. కానీ మీరు ఆలోచసల్లోంచి పెల్లుబికిన, సృజనాత్మకమైన అనే మాటలంటుంటే అడగాలనిపించి అడుగుతున్నా. వేరొకరి బ్లాగు గురించి అడిగి వాళ్లని రెచ్చగొట్టే పని నాకెందుకు గానీ నా బ్లాగ్ గురించే ఆడుగుతా. ఆయ్యా సుధాకర్ గారూ మీకు http://abhinayani.blogspot.com అనబడే 'అభినయని' బ్లాగు సృజనశీలమైనది కానట్టుగా అన్పిస్తున్నదా. ఆలోచనల్లోంచి పెల్లుబకనట్టుగా అన్పిస్తున్నదా. అది సిద్ధాంత స్థాయికి ఎదిగిన బ్లాగే. తెలుగు బ్లాగుల్ని కూడా సిద్ధాంత స్తాయికి చేర్చిన ఒక్కగానొక్క అచ్చతెనుగు బ్లాగే. సృజనాత్మకత, ఆలోచనలు పెల్లుబకకుండా సిద్ధాంతాలు పుడతాయా. ఈ విషయం కాస్త సోదాహరణంగా వివరించగలరు. ఇదైనా ఎందుకడుగుతున్నానంటే మీరు కాస్త పేరున్న, హిట్లున్న బ్లాగరు. మీ మాటలు తోటి బ్లాగర్లు విశ్వసిస్తారు గనుక. వేరొకరైతే పట్టించుకుని వుండేవాడిని కాదు. కాకుంటే కొద్దిగా విరామం తీసుకున్నాననే సాకు చూపించకపోతే.

జింతాకు said...

సైట్లన్నీ చాలా బాగున్నయ్ అన్నా

జింతాకు said...

కొన్ని కామెంట్లు సూత్తాంటే లెజండరీ స్టేటస్ కోసం అడిగిన మోహన్బాబులు గుర్తొస్తన్నడు. ఎందో ఎందుకో.
==================================
నేడే నా బ్లాగుకి వచ్చేయండి http://appadam.blogspot.com
===================================

Sudhakar said...

@cbrao గారు,
అదనపు వ్యాఖ్యలు తొలగిస్తాను. శోధన ప్రస్తుతానికి ఒక కలగూరగంప.ఉత్తమమైన బ్లాగేమో కానీ, అత్యుత్తమ బ్లాగు కాదు :-) అందుకని దానిని చేర్చలేదు. నా బ్లాగుల నిర్వచనం క్రింద రాని బ్లాగులను నేను ముట్టుకోదలచుకోలేదు. నేను ప్రస్తుతం lively గా, fresh గా నిజజీవితాలలో దైనిందిత కార్యకలాపాలను, మనస్సులోని భావాలను రాసేబ్లాగులనే తీసుకున్నా. నా దృష్టిలో ఇంకొక మూడు బ్లాగులు అలాంటివి వున్నాయి. అవి కూడా జత చెయ్యాలి.

@విజయకుమార్ గారు...మాబాగా కడిగేసారు నన్ను :-)
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని ముందే చెప్పా. మీరు ఆలస్యం ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఈ చిట్టా నేను ఇలా రాసుకుంటూనే పోతాను. ప్రస్తుతానికి తెలుగులో అత్యుత్తమ బ్లాగు లక్షణాలున్న బ్లాగ్లు వెతుక్కోవటం కష్టంగా వుందని చాలా మంది నాతో చెప్పడం వలన నేను ఇది తయారు చేసాను. మీరు ఆలోచనలు, సృజనాత్మకత అనే రెండు మాత్రమే తీసుకుని అడిగారు. కానీ మిగతావి కూడా చదవండి. మీరు పైన పేర్కొన్న బ్లాగులు చూస్తే అంతర్ల్లీనంగా ఒక మనిషి మీతో మాట్లాడుతున్నట్లు, తన ఆలోచనలు మీతో పంచుకున్నట్లూ అనిపించాలి. మీరన్న సిద్ధాంత స్థాయి నాకర్ధం కాలేదు. అసలు బ్లాగులు సిద్ధాంత స్థాయికి ఎందుకు చేరాలో మీరు చెప్పండి. బ్లాగేమీ గ్రంధ రచన కాదు కదా. మాగజైన్ అంతకన్నా కాదు. మీరన్నట్లు ప్రతీ బ్లాగూ సిద్ధాంతాల స్థాయికి పోతే చదివే పాఠకులలో గుంపులు తయారవుతారు. బ్లాగు కమ్యూనిటీ స్పిరిట్ కే అది విరుద్ధం. బ్లాగులు అత్యంత సరళంగా, తాజాగా, జీవితానుభవాలో, సమకాలీన, చారిత్రక అనుభవాలో పంచుకునేలా వుంటాయి.ఏ బాషలో అయినా అవే అత్యుత్తమ బ్లాగులు. ఇక మీ బ్లాగ్ http://abhinayani.blogspot.com/ చదివా. దానిలో అనీ కధలే వున్నాయి. నా వరకూ అది ఒక మంచి ఈ-సంచిక. బ్లాగు కాదు. ఆ బ్లాగులో నాకు మీరు కనిపించలేదు. మంచి కధలు మాత్రమే వున్నాయి. నిజానికి మీది ఒక ఈ-మాగజైన్ (నా వరకూ మాత్రమే) :-)

వింజమూరి విజయకుమార్ said...

'జింతాకు' గారన్నట్టు నిజంగానే యిదేదో మోహన్ బాబు లిజండరీ కోసం అడిగినట్టుంది. నాకూ నవ్వొస్తోంది. అయినా చెప్పక తప్పుదు. అసలు బ్లాగంటే పర్సనల్ డైరీ కాదు. ఏప్పుడైతే అది అంతర్జాలం లోకి వచ్చిందో అప్పుడే అది ఓ మేగజైన్ లాగానో, ఓ ఆన్ లైన్ మీడియా లాగానో తయారైంది. మన భావాలు కొందరితో పంచుకునే సాధనం అయింది. అసలు మీరు ఈ బ్లాగులకి పరిమితులు ఎందుకు విధిస్తున్నారో నాకు అర్థం కావడంలా. అసలు బ్లాగు సరళంగా ఎందుకుండాలో నాకు అర్థం కాదు. బహుశా సరళంగా వుంటే ఏక్కువ మంది చదవొచ్చు. అంతే. క్లిష్టమైన విషయాలు చెప్పాలనుకున్నప్పుడు, క్లిష్టంగానే చెప్పొచ్చు. అయితే పాఠకులు ఖచ్చితంగా తగ్గుతారు. అది బ్లాగరు యిష్టపడినప్పుడే క్లిష్ట రచన చేస్తాడు. అయినా కొందరు సాధారణ విషయాలు నలుగురితో పంచుకుంటే నేను సాధారణ విషయాలతో పాటు కథని పంచుకుంటా. అలాగే సిద్ధాంతం చేసి పంచుకుంటా. నా బ్లాగులో 'ఇంటిపేరు పురుషుడిదే-ప్రకృతి న్యాయం' ఒకవేళ స్త్రీలని బాధ పెట్టిందేమో నాకు తెలీదు గానీ అది ఒక సిద్ధాంతం, అలాగే ఒక ముడివిప్పలేని సత్యం. అదేవిధంగా నా కథ నేను సృష్టించింది. నా స్వంత భావాలు. అవి మొత్తం నా భావాలే అయినప్పుడు నా కథ చదవే ప్రతివారికీ అంతర్లీనంగానైనా నేను కన్పించే తీరాలి. మీకెందుకు కన్నించడం లేదో నాకు తెలీడం లేదు. బ్లాగు కమ్యూనల్ స్పిరిట్ దెబ్బ తినడానికి కథలు, సిద్ధాంతాలూ రాయడం కాదనుకుంటా కారణం. బ్లాగుల్ని ఇలా యివి మంచివి, యివి ఫలానా అంటూ ఒక గాటకి కట్టి విభజించడమే కారణం అని మీరేమనుకున్నా నేనంటా. ఇంకా ఈ విషయం మీద మాట్లాడితే 'జింతాకు' గారు మళ్ళీ లిజండరీ అంటారు. సమాధానం యిచ్చినందుకు కృతజ్ఞతలతో. .

Sudhakar said...

@విజయ్ కుమార్ గారు,

బ్లాగ్ అంటే పర్సనల్ డైరీ అని ఎవరన్నారు? :-) పర్సనల్ డైరీ అంటేనే ఎవరికీ కూడా చదవటానికి ఛాన్స్ ఇవ్వని పదార్ధం. నేనైతే బ్లాగులను, మాగజైన్లను కలపి మాట్లాడే వారితో విభేదిస్తాను. వారు బ్లాగులను కొద్దిగా తప్పుగా అర్ధం చేసుకుని ఇంకో రకంగా వాడుతున్నారు అంతే.

నేను బ్లాగులకు పరిమితులేవి విధించలేదు. దానికి పరిమితులు లేవని చెప్తున్నాను. అయితే నేనిక్కడ ఏవి బ్లాగులు అనే చిట్తా రాయటంలేదు. అత్యుత్తమ బ్లాగులకున్న లక్షణాలు ప్రకారం ఎంచుకున్నాను. మీరు ఏ బ్లాగు ఎకోస్పియర్లో చూసినా ఇలాంటి బ్లాగులే బ్లాగులు. అసలు మాగజైన్లగా రాసే బ్లాగులను ఎవడూ పట్టించుకోడు. నెలకో సారి చదువుతారు మహా అయితే. రోజూ బ్లాగులను RSS ఫీడ్ పెట్టి మరీ చూడాల్సిన పనే లేదు. అలా అని RSS ఉన్న ప్రతీదీ బ్లాగూ కాదు.

పొద్దు, నవతరంగం, thatstelugu.com, ఈమాటా ఎందుకు బ్లాగులు కావో, నేను చెప్పినవీ అందుకే బ్లాగులు కావు నా దృష్టిలో. చేదుగా వున్నా నేను చెప్పాలనుకున్న నిజం ఇది.
బ్లాగ్ కమ్యూనిటీ స్పిరిట్ దెబ్బ తినటానికి కధలు రాయటం కారణం అనేది మీరిప్పుడే సృష్టించారు. నేను చెప్పింది బలమైన సిద్ధాంతాల పరంగా బ్లాగుల నాణ్యతను మనం కొలవలేమనే.

వింజమూరి విజయకుమార్ said...

సుధాకర్ గారూ,

మీ అభిప్రాయం మీ యిష్టం. నేను ఆ విషయంలో మిమ్మల్ని తప్పు పట్టలేను గానీ టపాలో మీరు మొదట చెప్పిన ఒరిజినాలిటీ, ట్రాన్స్పరెన్సీ అనే అయిదు లక్షణాలూ నా బ్లాగుకున్నాయే, సృజనాత్మకత కూడా ఒకింత హెచ్చు మొతాదులోనే వుందే. అటువంటప్పుడు నా బ్లాగు మీ అంచనాల్లోకి ఎందుకురాలేదనే సందేహం కొద్దీ అడిగా. అంతకుమించి వేరొకటి కాదు నా ఉద్దేశ్యం. ఓ.కే. కృతజ్ఞతలతో. .

రాధిక said...

lalita gari onamalu link tappu ga vundi.

Sudhakar said...

@రాధిక గారు,

సరి దిద్దాను. అర్ధరాత్రిల్లు బ్లాగు రాస్తే ఇదే చిక్కు :-)

సిరిసిరిమువ్వ said...

మంచి ప్రయత్నం. కొత్తపాళీ గారి బ్లాగును జతచేసానన్నారు, లేదే????

Anonymous said...

సుధాకర్,

అసలు కంటే వడ్డీ ముద్దు!
అత్యుత్తమ బ్లాగుల గురించి మీరు వ్రాసిన దాని కంటే, కామెంట్లూ వివరణలే మస్తుగా ఉన్నాయి :-)

మొదటగా మీ లిస్టు బాగుంది. ఇంకా కొత్తపాళీ గారి బ్లాగు ఈ లిస్టులో నాకు కనిపించడం లేదు.

కథలు ఉన్న బ్లాగు మీరు అత్యుత్తమ బ్లాగులకు పెట్టుకున్న పరిమితుల్లోకి రావు అనడం నాకు సబబు గానే అనిపించింది. నాక్కూడా అవి వెబ్జీనుల్లాగే అనిపిస్తాయి. అలాగే, కవిత్వం బ్లాగులు కూడా!

రానారే గారి బ్లాగు 'యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి ' నేను ఇష్టపడే బ్లాగు. మంచి భాష, భావ వ్యక్తీకరణ, పాఠకుల గుండెల్ని ఉద్విగ్న (emotion) పరిచే దృశ్యాలు ఈ రచనల్లో కనిపిస్తాయి. ఇప్పుడొస్తున్న బ్లాగుల్లో, 'అత్యుత్తమ' పైన మరేదైనా వర్గీకరణ వుంటే, అందులో చేరే అర్హత వున్న బ్లాగు ఇది. రెండు రెళ్ళు ఆరు హాస్యాన్ని పండించే అత్యుత్తమ బ్లాగు! సందేహమేమీ లేదు!
ఇవి మౌలికంగా కథల బ్లాగులు. కథకుడు కథలో ప్రధాన పాత్ర. కథల్లాగా పత్రికల్లో అచ్చులోకి వెళ్ళడానికి అన్ని అర్హతలున్న రచనలు. అప్పుడేమైందంటే కూడా రూపం దృష్ట్యా, రెండు రెళ్ళు ఆరు, రానారె బ్లాగు లాంటిదే!

కొంత మంది పోల్చినట్లు - నామిని, ఖదీర్, సోమరాజు సుశీల కథల్లా ఉంటాయి ఈ బ్లాగుల్లో రచనలు
(ఇలా వ్రాసుకుంటూ పోతే...ఇదీ ఒక బ్లాగయ్యేలా ఉంది :-)).

అయితే, ఇవి వెబ్జీనులని వదిలేయకుండా, మీ అత్యుత్తమ బ్లాగుల చిట్టాలో ఎలా చేర్చారు? తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది.

ధన్యవాదాలు,
సిరి

Sudhakar said...

@సిరి గారు,
అవును నిజానికి రానారె బ్లాగు చదివితే నాకు పోలేరమ్మ బండ కతలు గుర్తొచ్చిన మాట నిజం. కానీ అవి కధలు కావు. నిజజీవితపు అనంద క్షణాలను ఒక యాసలో చెప్పినవి. క్రాంతి గారి బ్లాగు కూడా అలానే వుంటుంది. ఎన్ని బాధలున్నా హాస్యపు జల్లు తప్పని రాత వీరి సొంతం.అవే వీరి బ్లాగులకు నిరంతర తాజాదనాన్ని సమకూరుస్తాయ్.

@జింతాక్ : నెనర్లు తమ్ముడూ :-)

Anonymous said...

బాగున్నవి! నాకు బ్లాగులు మూడు రకములు గా గోచరిస్తాయి
1)ప్రజాదరణ కోనం రేసేబ్లాగులు - టపాలు ,వాఖ్యలు మెండు
2)ప్రజలకోసం రాసేబ్లాగులు - టపాలు తక్కువ వాఖ్యలు తక్కువ
3)ప్రజలు రాసుకోనేబ్లాగులు (స్వగతాలు )- టపాలు , వాఖ్యలు రెండూ తక్కువ .
ర్యాకింగ్ ఇవ్వకపోవటం అబిలాషణీయం : )

Sudhakar said...

@kashyap,

మీ వర్గీకరణ బ్లాగులకు వర్తించదు. మీరు చెప్పిన రకాలలోనే రకరకాల కాంబినేషన్లున్నాయ్. రాంకింగ్స్ ఇవ్వకూడదనే మీ అభిప్రాయమే నా అభిప్రాయం. అందుకే ఇవ్వలేదు. :-)

Anonymous said...

నమస్తే వింజమూరన్న! లైట్ తీసుకో. గారడీ చేసి బురిడీ కొట్టించి నీ బ్లాగుకు పాలాభిసేకం సేత్తా.--నీ నియాండెర్తల్ మిత్రున్ని చెప్తున్నా.

Anonymous said...

dayachEsi naa blagu choostara?

http://vasantam.blogspot.com
under construction

Unknown said...

Sudhakar gariki namaskaram, mee krushi abhinandaneeyam

Unknown said...

Sudhakar gariki namaskaram, telugu blogula gurunchi ippudippude telusukuntunna naa lanti variki meeru icchina samaachaaram baaga upoyogapadutudanedi naa uddesem, ithe ikkada unna abhiprayalanu chustenaaku oka sandeham kaligindi......asalu blog ante emiti mee uddesam lo kaka blog rupakalpana chesina vari uddesem cheppagalaru.

గోపీనాథ్ said...

Could you check out my blog at savanam.blogspot.com.

Await your comments.

Regards
Gopinath

గోపీనాథ్ said...

Please check out my blog
savanam.blogspot.com.

Any comments?

Regards
Gopinath

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name