Wednesday, February 20, 2008

బ్లాగర్ ఇప్పుడు తెలుగు రాత సౌకర్యంతో మీ కోసం

బ్లాగర్.కామ్ ఇప్పుడు తెలుగు టపాలు రాసుకునేందుకు లేఖిని వంటివి వాడకం అవసరం లేకుండా మన కోసం ఒక సౌకర్యాన్ని తెచ్చింది. ఇప్పటి వరకూ హిందీకి మాత్రమే వున్న ట్రాన్స్ లిటరేషన్ ఇప్పుడు మరికొన్ని భారతీయ బాషలలో కూడా లభ్యం అవుతుంది. అందులో మన తెలుగు కూడా వుంది. :-)

మీరు బ్లాగర్.కామ్ ను మీ తెలుగు బ్లాగు రాసుకునేందుకు వాడుతుంటే కనక, క్రింది సోపానాలు పాటించండి చాలు.

౦౧. బ్లాగర్ లోనికి లాగిన్ కండి.

౦౨. సెట్టింగ్స్ విభాగంలో బేసిక్ లోనికి వెళ్ళండి.

౦౩. గ్లోబల్ సెట్టింగ్స్ అనే విభాగంలో క్రింద చెప్పిన విధంగా చెయ్యండి.

google transliteration

౦౪. ఇప్పుడు మీ బ్లాగుల టపాల (Posts) విభాగంలో కంపోజ్ (Compose) విభాగంలో మీరు కొత్త టపా పూర్తిగా తెలుగులో రాసుకుంటూ పోవచ్చు. ఆంగ్లంలో రాయాలంటే "అ" అని కనిపించే బటన్ ను ఒక నొక్కు నొక్కటమే. తెలుగులో రాయాలన్నా అదే బటన్ ను మరో సారి నొక్కటమే.

google transliteration2

౦౫. ఇక మిమ్మల్ని ఆపేదెవరు? విజృంభించండి :-)

15 comments:

సిరిసిరిమువ్వ said...

బాగుందండి. తెలిపినందుకు ధన్యవాదాలు.

మరమరాలు said...

Good Information, Thanx

జ్యోతి said...

sudhaker i am able to write in telugu in title and label boxes but not in subject area. tried many times. can u chek again..or wat is the problem

సత్యసాయి కొవ్వలి said...

మాతృభాషాదినోత్సవ సందర్భంగా మంచివార్త అందించారు. శుభం.

రాధిక said...

thank you sir.

Anonymous said...

జ్యోతి,
పైన toolbar లో "అ" అనేది నొక్కి ఉందా?
శరత్ చావా

Prasad said...

విలువైన సమాచారాన్ని తెలియచేసారు. ధన్యవాదాలు.

శరత్ said...

Thanks

సుధాకర్ said...

@జ్యోతి : టైటిల్లో తెలుగులో రాయలేమే? మీకెలా వస్తుంది. బరహా ఏమైనా పనిచేస్తుందేమో చూడండి. అవును టూల్ పట్టీలో "అ" నొక్కు వుండాలి.

Anonymous said...

టైటిల్ బాక్స్‌లో తెలుగులో ఎప్ప‌టినుంచో వ్రాయగలిగినా, మీరు చెప్పిన సోపానాలు అన్ని పాటించినా, ఫైర్‌ఫాక్స్‌లో బ్రొజర్ ఇంజిన్ ఐ.యి. కి మార్చినా, కంపోజ్ బాక్స్‌లో తెలుగు అక్షరం "అ" నొక్కబడిఉన్నా, తెలుగు ట్రాన్ల్‌లిటరేష్‌న్ ఆప్షన్ పనిచెయ్యడంలేదు. ఇండిక్ ఇంపుట్ ఎక్స్‌టెంషన్ - డిఫాల్ట్ తెలుగు / ఇంగ్లిష్ కి మార్చి చూసినా పని చెయ్యలేదు.
మీ సలహాలిచ్చి పుణ్యం మూటగట్టుకోరు, ప్లీజ్?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నెనర్లు. నెనర్లు. నెనర్లు - మీకూ బ్లాగర్ డాట్ కామ్ వాడికీ కూడా ! తెలుగులో నేరుగా బ్లాగడానికి వీలు కల్పించే మూడో అంతర్జాల నెలవు (portal)గా బ్లాగర్ డాట్ కామ్ అవతరించింది.

మీ సూచనలు పాటించి బ్లాగర్ కంపోజు బాక్సులో తెలుగుని విజయవంతంగా టైపు చేశాను. అయితే పనిలో పనిగా - ఇప్పటికే సశక్తమై ఉన్న view--> Encoding --> UTF-8 ని మళ్ళీ ఇంకో సారి సశక్తం చేశాను. అప్పుడు తెలుగులో టైపు చెయ్యడం బాగా సాధ్యమయింది.

ఇంక జీమెయిల్‌లోను యాహూ మెయిల్‌లోను నేరుగా తెలుగు టైపు చెయ్యగలగడమే తరువాయి. అప్పుడు మన తెలుగు సంపూర్ణ అంతర్జాల భాషగా పరివర్తన (transform) చెందుతుంది.

(మరీ తొందరపడిపోతున్నానంటారా ? బహుశా, కావచ్చు)

మళ్ళీ ఇంకో సారి నెనర్లు.

తెలుగు బుడుగు said...

మొత్తానికి ఒక అరగంట కష్టపడి అన్ని సెట్ చేసుకున్నాను, శోధనగారికి నెనర్లు...

Chakravarthy said...

tying in Telugu at Google is really a pain at w**** p****

infact, am used to Lekhini.org. Now-a-days for tying in telugu, am tying as fast as i do in English.

Many many .. tons of many .. thanks to the creators of lekhni.org

Hariharakumar said...

Hi
I have some questions to be asked, this blog is in Telugu, right

how you are getting visitors to your blog, since search engines can only track English words?

How many visitors visit your blog daily?

How can i write Telugu words in comments?(is that copy and paste from lipi software)

Last word, Happpy to see Telugu thanam in popular Blogger blogs. Nice blog.

Happy Blogging.

PUTHETI said...

Thank you very much for helping how to write posts in Telugu.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name