Thursday, November 08, 2007

ఒప్పించే శక్తి ఒక వరం

ఈ మధ్యన ముంబైలో ఒక సెమినార్ కు హాజరయ్యాను. ఆ సెమినార్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సాఫ్ట్ వేర్ ఆర్కిటక్ట్స్ అనే అంశం మీద ఒకాయన అద్బుతంగా ప్రసంగించాడు. అందులో నాకు బాగా నచ్చింది "conviction" అనే అంశం. మనం చెప్పేది తప్పా? ఒప్పా అనే విషయం ఎక్కడా పనిచెయ్యదు. మనం ఎదుటివారిని కన్విన్స్ చేసామా లేదా? అనేదే ముఖ్యం. అందుకు ముందర మనలని మనం కన్విన్స్ చేస్తుకోవటం చాలా ముఖ్యం. ప్రముఖ వార్తా పత్రికలు చేసేది అదే. అవి రాసేది తప్పుడు వార్తలయినా ఈ "conviction" అనే దానిని మహా బలంగా వాడుతాయి. జనాలలో వున్న Negative Pulse ని బాగా లాగి లాగి ఒక్క సారి వదిలి, అప్పుడు విషయాన్ని రాస్తాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. పైన చెప్పిన వక్త ఒక మంచి జోకు కూడా చెప్పాడు (ప్రసంగం మొత్తం నవ్విస్తూనే వున్నాడనుకోండి)

ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.

అది ఒక సాఫ్టు వేర్ నిపుణుడు చూసి, అతనిని ఎలా అయినా ఆపాలని…కేకలు వేస్తూ ఒక్కసారి ఆగు వస్తున్నా అని అరిచాడు

అతడు మనోడి వైపు చూసి, కొద్ది సేపు ఆగాడు…

అతికష్టం మీద ఆ శిఖరం ఎక్కి అతని దగ్గరకు వెళ్ళాడు

ఒక పది నిముషాలు వాళ్లిద్దరు మాట్లాడుకున్నాక……

ఇద్దరూ ఆ శిఖరం మీది నుంచి దూకి చచ్చారు.

అదన్న మాట "conviction" కి వున్న శక్తి. :-)

2 comments:

braahmii said...

బాగుంది, దూకి చచ్చారు అన్నది ముందు సరిగా చదవలేదు. అలవాటులో భాగంగా దిగి వచ్చారు అని అనుకున్నా. కాని మంచి జోకు అన్నారు కదా అని మళ్ళీ జాగ్రత్తగా చదివితే విషయం తెలిసింది. నవ్వు వచ్చింది. నెనర్లు
బ్రాహ్మీ

Anonymous said...

Hi Sudhakar
Could you please send me your Notes & imp points from that seminar?
It is very useful for the blog readers & prof.
Thanks

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name