Sunday, November 11, 2007

అంతా నువ్వే చేశావు....అవును అంతా నువ్వే చేశావు.

ఈ మధ్య ఈనాడు ఆదివారం సంచికలో ఇదే తరహాలో ఒక పేరడీ ప్రచురించారు. అది చూసి, ఆ ప్రేరణతో రాసినది ఇది.

ఇవి బొమ్మరిల్లు అనే మంచి చిత్రంల్లో, బాగా హిట్టయిన సంభాషణల పరంపర. దీనిని సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్ అద్భుతంగా రక్తి కట్టించారు.



గోపి : అంతా నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు. చాలు రాధా పెళ్ళైన నాటి నుంచి నువ్వు నా చేత చెయ్యించిన పనులు చాలు. ఇక వద్దు ప్లీజ్.

రాధ : గోపీ…నేనేం చేసాను

గోపి : ఇంకా అర్ధం కాలేదా నీకు. పక్కింటి బ్యాచిలర్ కుర్రోడు దగ్గర ఏముందో, అదే నేను కోల్ఫోయింది. ఆనందం. జీవితంలో సొంత ఆనందాలను కోల్పోయాను నీ వల్ల.

నువ్వు ప్రపంచంలోనే గొప్ప భార్యవి రాధా. నీ భర్త ప్రపంచంలోనే ఒక గ్రీకు వీరుడు అవ్వాలని ఆలోచిస్తావు తప్ప, అసలు నా సీను ఏంటో అర్ధం చేసుకోవు.

రాధ : నేనేది చేసినా వెయ్యి సార్లు మీకు అది బాగుంటుందో లేదో ఆలోచిస్తా గదండి.

గోపి : అవును వెయ్యిసార్లు నాకు బాగుంటుందో లేదో ఆలోచిస్తావు, నాకు నచ్చిందో లేదో ఆలోచించవు.

పని చెయ్యటంలో ఆనందం నీకు తెలుసు. గానీ ఏ పని చెయ్యనివ్వకపోతే పడే కష్టం ఏంటో నాకు తెలుసు.

అసలు నన్ను ఏదైనా చెయ్యనిస్తేగా నా బాధేంటో తెలియటానికి. నీకు ఏదైనా ప్రాబ్లెం వస్తే ఎదురింటి రిటైర్డు ముసలాయన్ను సలహా అడుగుతావు. నన్ను అడగవు. నాతో మాట్లాడు రాధా…ఫ్రెండ్లీగా వుండు రాధా…

రాధ : ఆ మాట అనేది నేను కదండీ (గద్గద స్వరంతో)

గోపి : అంటావు. కానీ వుండవు. ఎందుకంటే అంతా నువ్వనుకున్నట్లే జరగాలి కదా

ఈ కూరలు కొనాలో నువ్వే చెప్తావు. నాకెలా వుంటుందో తెలుసా. నాకు ఆ కాకరకాయ నచ్చదూ అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. నేను తినను అని పారిపోవాలనిపిస్తుంది.

బజారుకెళ్ళి చికెన్ తెమ్మంటావు. అక్కడికి వెళ్లేలోగానే పక్కింటి కుర్రాడిని పంపి వాడి చేతే అది బేరమాడించి కొనిపించేస్తావ్. నవ్వుతున్నారు రాధా బజారులో అందరూ.

నేనేదో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటాను. గానీ నువ్వు నేను "సాగే జీవితం 34233 వ ఎపిసోడ్" చూసి ఆనందించాలనుకుంటావ్. అదే నాకిష్టమని అందరితో చెప్తావు.

నేనేదో మాడి పోయిన మసాలా దోశ ఒకటి వెయ్యాలనుకుంటాను. కానీ నువ్వు దానిని ఇంకా బాగా, అందంగా ఎలా చెయ్యెచ్చో చెప్తూ నా దోశ కూడా నువ్వే వేసేసి సరదా పడిపోతావ్. నేనెలా చెయ్యాలో కూడా నువ్వే చెప్ర్తుంటే ఇంకా నేనెందుకు రాధా దోశలు వెయ్యటం?

చివరికి షేవింగ్ ఎలా చేసుకోవాలో కూడా నువ్వు చెప్తుంటే గడ్డం అస్సలు తెగటం లేదు రాధా. నీకు తెలీదు. నువ్వు చెప్పింది చెయ్యలేక, నాకు నచ్చింది చెప్పలేక నరకం అనుభవించాను రాధా. నరకం.

ఈ ఫ్రస్టేషన్, బాధ ఎవరిమీద చూపించాలో తెలియక ఒక సారి మన టామీ మీద గట్టిగా అరిచాను కూడా. అది ఇప్పటికీ నా వైపు అనుమానంగా చూస్తునేవుంది. దగ్గరికి రావటం లేదు.

సరే, నేనిప్పుడు ధోనీలా జుత్తు పెంచాలి అంతే గదా? మీసాలు తీసెయ్యాలి అంతే కదా. చేస్తాను రాధా. నేను అవి చేస్తే ఛండాలంగా వుంటానని తెలుసు. అయినా చేస్తాను.

భార్యగా నువ్వు ఇన్నాళ్లు ఉప్పొంగిపోతున్నావు కదా? నువ్వలా ఉప్పొంగిపోవటం కోసం గత ఏడు సంవత్సరాలుగా నేను భర్తగా ఓడిపోతూనే వున్నాను రాధా. ఇలా ఓడి పోతూ వుంటే మరో మూడేళ్ళలో నా పెళ్ళి జీవితం ఏంట్రా అని చూస్తే, అందులో నేనుండను. నువ్వుంటావు. అంతా నువ్వే వుంటావు.

13 comments:

Anonymous said...

ఆదిరింది. పెళ్ళ్ అయిన ఏడేల్ల తరువాత దాదాపు ఈ సీను అందరికీ వస్తుందేమో. చాలా బాగా రాసారు.

జ్యోతి said...

సుధాకర్

ఇది ఇప్పుడు ఎందుకు రాసినట్టు??????

సంగతేంటి..

Sudhakar said...

చాలా చింపుల్
రాధలు రాయరు
గోపిలను రాయనివ్వరు

ఇక మిగిలింది పక్కింటి బ్యాచిలర్ గాడు
వాడు పెళ్ళి కాక ముందే రాసేస్తే మంచిది కదా..

Mallik said...

అసలు ఈ సినీమాలలోని పేరడీ లమీద ఒక బ్లాగు ఉంటే బాగుంటుందనిపిస్తోంది. ఎక్కడైనా ఉందా?

Solarflare said...

ఆ చివరి డైలాగులు కృష్ణ లేదా సోభన్ బాబు డైలాగులు చెప్పే స్తైల్లో చదువుతుంటే ఇంకా బావుంది.

రాదా, రాదా, రాధా... హెన్ త ప్పని చ్చేయిస్తున్నావు రాదా (ధుక్కంలో హొత్తులు ఫ్లేసులు మారిపోతున్నాయి, కొత్తవొచ్చేస్తున్నాయి) పాపమిలా ఘోపీ జ్జీవిత్తంతో ఆడుకొంటున్నావా

Anonymous said...

చాలా బాగుంది. బాగా నవ్వించింది. మరిన్ని పేరడీలు వ్రాయగలరు.

Srini said...

మొదటగా ఆ బొమ్మరిల్లు వీడియో చూసి కొంచం ఎమోషనల్ అయ్యాను, తర్వాత మీ పేరడీ చదివి నవ్వి నవ్వి కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. చాలా బాగా వ్రాసారు.

ఉదయ్ భాస్కర్ said...

adirindayya sudhaakar..nenu net cafe nundi istunna, so lekhini open chesenta time ledu..

Rajendra said...

సుధాకర్,

అదుర్సో అదుర్స్. ఇరగతీస్తున్నారు.

రాజేంద్ర ఆలపాటి

సత్యసాయి కొవ్వలి Satyasai said...

చాలాబాగుంది.

Anonymous said...

7/10

Anonymous said...

చాలా లేటు గా వ్రాస్థున్నాను క్షమించాలి ! అవును సుధాకర్...చాలా మంచి సీను ఈ చిత్రం లో . ఈ వీడిఓ ఒక యెత్తు ఐతే, ఆ వీడిఓ ని మించిన పేరడీ ఇంకోటి. సూపర్ !!

Shakthi said...

అంతా నువ్వే చేసావ్--అంతానువ్వే చేసావ్

ఇప్పుడే చూసా మీ Blog!!!!

చాలా బావుందండీ సుధాకర్ గారు

నవ్వలెక కడుపునొప్పి వచ్చింది:))

ఈ సినీమాలలోని డైలాగ్స్ కు పేరడీలు రాస్తే బాగుండు

ఇక మీదట మీ Blog ని చూస్తూవుండాల్సిందే..

ఇలాంటి పేరడీలు మిస్ కాకూడదు..Thanks చాలాబాగా రాసారు

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name