రాత్రి హ్యాపీ డేస్ సినిమాకెళ్లాను. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ (మన నగరానికి అదొక నగ అని చంద్రబాబు అభిప్రాయం) రాత్రి పది నలభై అయిదు నిమిషాలకు సినిమా అయితే నేను దాదాపు తొమ్మిదిన్నరకే చేరుకున్నా (ఇంటర్నెట్ కొనుగోలు కాబట్టి). నా స్నేహితుడు రావటానికి ఇంకా సమయముండటం వలన అటూ ఇటూ తిరుగుతుండగా సెక్యూరిటి మనుషులు నా దృష్టిని ఆకర్షించారు. అసలు వీల్లెలా పని చేస్తున్నారో చూద్దామని ఆసక్తిగా గమనించటం మొదలు పెట్టా…
అక్కడ రెండు సెక్యూరిటీ ద్వారాలున్నాయి. చెక్కతో చేసినవవి. కాబట్టి కాస్త చవకవే కొనుక్కున్నట్టున్నారు. రెండింటి గుండా పొలో మని జనాలు రావటం మొదలుపెట్టారు. మగవాళ్ళందరిని ఆపి ఏదో తడమాలన్నట్లు తడిమి వదులుతున్నారు.( నన్ను తనిఖీ చేసినపుడయితే వాడి చెయ్యి నా మొబైల్ని ముట్టలేదు కూడా). ఈలోగా కొంతమంది స్త్రీలు వచ్చారు. లోపలికి వచ్చాక దిక్కులు చూస్తున్నారు. బహుశా తనిఖీ చేస్తారని అనుకుంటా..
మీరెళ్ళండి మేడమ్ అని వారిని లోపలకు పంపేసారు. ఇక అప్పటి నుంచి వస్తున్న స్త్రీలందరికి ఇదే తంతు. మరి ఇదే రకం సెక్యూరిటినో అర్ధం కాదు. మగోల్లేమన్నా బాంబులు బుర్రలో పెట్టుకుని పుట్టారా? ఆడోల్లలో ఆత్మహత్యా బాంబర్లు వుండరా? అసలే ఈ మధ్య ఆడోల్లు మగాళ్ళతో పొట్టలలో సమానత్వం సాధించేసారు. (సీరియస్ గా తీసుకోవద్దు…ఇది మా ఆఫీస్లో ఆడోల్లు వేసుకునే జోకే…:-))
నేను వుండబట్టలేక వెళ్ళి వాడినడిగా. వాడు నా వైపు చూసి హి హి అని నవ్వాడు. నేను కాస్త సీరియస్ గా చూసేసరికి "నన్నడుతారేంటండి…మానేజర్ని అడగండి" అన్నాడు. వాళ్లే అమ్మాయిలను పెట్టటం లేదు ఈ పనికి…మేమేం చేస్తాం సార్ అన్నాడు. అయితే మీ మానేజర్ని పిలు అన్నాను. వాడికి లైట్లు ఆరిపోయాయి. మౌనంగా తన పని తను చెయ్యటం మొదలుపెట్టాడు. మరీ తిడితే ఫీలవుతాడేమొనని నేను నోర్మూసుకుని సినిమా చూడటనికి పోయాను. ఇక్కడ సంగతేంటంటే స్త్రీలను తనిఖీ చేసే స్త్రీలు రాత్రి తొమ్మిది తర్వాత పని చెయ్యరంట. మరి ఈ పద్దతితో వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఏడుస్తుందో అర్ధం అవుతుంది.
ఆ ద్వారాల నుంచి పోతుంటే ఒక సారి కుయ్ మని , ఒక కుయ్ కుయ్ కుయ్, కక్, క్వీ అంటుంది. ఈ భాషకు అర్ధం వాళ్లకు తెలుసా అంటే…ఏమో చెప్పలేం.
ఏది ఏమైనా పేరు గొప్ప వూరు దిబ్బ అన్న నానుడి ఈ ప్రసాద్ ఐమాక్స్ కు సరిపోతుంది. పాప్ కార్న్, ఖరీదయిన మంచి నీరు అమ్మటానికి కుప్పలు కుప్పలు జనాలుండే ఈ థియేటర్లో ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే.
Friday, November 09, 2007
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
నీను నీతో పూర్తిగా ఏకీభావిస్తున్నా , ఇదివరకు కుడా మనం ఎక్కడో ఇలానే అడిగినట్టు గుర్తు. (Eat Street ?).
అన్నీ కంటితుడుపు చర్యలండీ బాబూ...
బెంగుళూరులో ఫోరం లో రాత్రి షో కి వెళ్ళలేదు కానీ మామూలు సమయాల్లో అయితే ఆడవాళ్ళను కూడా చెక్ చేస్తారు.
అలాగే లాప్‍టాప్ లు గట్రా అనుమతించరు.
మీ టపా ఎవ్వడైనా టెర్రరిస్ట్ చూశాడంటే నెక్స్ట్ టార్గెట్ ఐమాక్స్ థియేటరే :(
ఇండియా లో వ్యక్తిగత భద్రత పూర్తిగా దైవాధీనము. ఆలా అని రక్షక శాఖ ని కూడ పెద్దగ విమర్సించడానికి లేదు, ఎందుకంటే, సుమారు 100 కోట్లు జనభా ఉన్న మన దేశం లో, అది కూడా విశ్రుంఖల ప్రజాస్వామ్య దెశంలో, వ్యక్తులకి రక్షణ కల్పించటమనేది సమాన్యమైన విషయమేమీ కాదు.
తెలుగు లో వ్రాయలంటే చాలా కష్టంగా ఉంది :( (of course with English keyboard, when do we get keyboards with Telugu alphabets (and numbers?) :))
@Nenusaitam
Correct ga chepparu.
blog koncham chadavagane naku kuDa alane anipinchindi.
Anavasaram ga terrorists ki clue istunnaTTu vundi.
:-) దీనికి పెద్దగా క్లూలు ఇవ్వనక్కరలేదండి. ఇవి చాలా బేసిక్ సెక్యూరిటి విషయాలు. టెర్రరిష్టు బుర్రలు ఇంకా చురుగ్గానే పనిచేస్తాయి. అమెరికన్ ఎయిర్ పోర్టు సెక్యూరిటీనే ఒక లెక్కలోనికి రాలేదు వాళ్లకు.
నేను చెప్పదలచుకున్నదేమంటే మనకి సెక్యూరిటి కల్చర్ లేదు. రాదు కూడా. ఒక సింహం ఒక లేడి మీద దాడి చేసి తింటుంటే మిగతా లేళ్ళు పరిగెత్తడం ఆపేసి నిలబడి చూస్తుంటాయే. అదే మనమూ చేస్తున్నది.
ఇక నేనుసైతం గారి వ్యాఖ్య విషయానికి వస్తే...టెర్రరిష్టులు మన తెలుగు బ్లాగులు చదివితే మహా సంతోషం :-) గానీ ఇక్కడ నేనేదో పెద్ద ఐడియా ఇవ్వలేదు. ఇవి మినిమమ్ కామన్ సెన్స్ వున్న ఏ మనిషికైనా (ఎనిమిదేళ్ళు వయస్సు దాటితే చాలు) అర్ధం అయిపోతాయి. అందువలన కంగారు పడకండి.
If you look at it the other way, it can be a clue to our police department also (if we assume that Terrorists read these blogs, we can assume even our police will read these blogs). Jokes apart, we can bring these points to the notice of the management of that facility and also to the police department about the inadequacy of the security arrangements and the processes so that they will (hopefully) take appropriate actions to prevent any future tragedy.
ఆ లావు రక్షణ/శోధనని భరించడం కష్టమేమో! చేతుల్తో తడమడాలు కాకుండా, ఇంకా మంచి టెక్నాలజీ వచ్చేవరకు - ఇవి ఇలాగే ఉంటాయి.
నిజమే అండీ.....ఆ బాంబు పడిన రెండు రోజులే హడావుడి అంతా,తరువాత అందరికీ మామూలే..
అందుకే ఉగ్రవాదులకు బాంబు పెట్టడం "కేకు నడక" అయ్యింది
మీరు చెప్పినది నిజమే కాని మన అంత భద్రత మన GOVT airports కి కుడా పెట్టలేదు, మీరు అన్తునట్టు, ఒకవేళ ఉగ్రవాదులు మన AIRPORT ని టార్గెట్ చేస్తే GOVT ఎంతవరకు protect చెయ్యగలదు ఇప్పుడు ఉన్నా సెక్యూరిటీ తో అని మీరు అనుకుంటున్నారు, మనం వెళ్ళేది CINEMA చూడటానికి అక్కడ వాళ్ళు అర్రంగే చేసిన సెక్యూరిటీ ఉగ్రవాదులు అపోటానికి ఇతేయ్ మనం మొరినింగ్ షో కి వెళ్లి మధ్యాన్నం సినిమా చుదలసిందే, వాళ్ళు మనకి కలిపిస్తున్న రక్షణ Minimum దీ అటు ఇబ్బంది కలగ కుండ మనకి ( అంటే సెక్యూరిటీ అస్సలు లేదు అనుకునే వాళ్ళకి కొద్దిగా ఐనా ఉన్నది ) చెప్పటం, నాకు ఇతేయ్ IMAX సెక్యూరిటీ లో లోపం కనిపించలేదు.
@Suresh
నాకు ఎయిర్ పోర్టు రక్షణ చూసి ఏడుపొస్తుంది. భయం భయంగానే నేను విమానమెక్కుతుంటా...ఎవడెవడో లోనకి పోతుంటాడు, వస్తుంటారు ఏదో మామ గారి ఇల్లయినట్లు. అక్కడ లేనంత మాత్రాన ఇక్కడ వుండకూడదా? అన్ని దగ్గర్లా వుండాలి. ప్రతీ ముఖ్యమైన ప్రదేశాలలో. ఒక చిన్న సీ-టైప్ బాంబు చిన్న మొబైల్ అంతదే, కానీ ఒక ధియేటర్లో పేల్తే పది రోజులు మీరు చదువుకోవటానికి హృదయ విదారకమైన వార్తలు దొరుకుతాయి. మనకి కక్కుర్తి తగ్గనంతవరకూ పరిపూర్ణ రక్షణ లేదు. మనకసలు సెక్యూరిటీ కల్చరే లేదు. ధియేటర్లో సినిమా మధ్యలో గబుక్కున కొంతమంది మధ్యలో వెళ్లిపోతే ఒకప్పుడు నచ్చక పోయారేమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఖాలీ చేసిన కుర్చీలు, వాటి క్రింద ఒక్క సారి చూడాల్సిన పరిస్థితి. అలా చెయ్యటం అక్కరలేదనుకుంటే ఇంటి దగ్గర అందరినీ తనివి తీరా చూసుకుని సినిమాకు పోవటమే.
Post a Comment