తెలుగు బ్లాగర్ల ఇంటర్నెట్ వేదిక అయిన కూడలి ఇప్పుడు కొత్త సొగసులతో అద్భుతంగా మన కోసం తయారుగా ఉంది. కూడలి బ్రహ్మ వీవెన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు కూడలిని koodali.org ద్వారా దర్శించవచ్చు. కూడలి అంటే మన హై.భాషలో చౌరస్తా అన్న మాట. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు రాసే అభిప్రాయాలను ఒకే వేదిక మీద పంచుకునేందుకు కూడలి ఒక వేదికగా నిలచింది.
తెలుగు బ్లాగులు, వికీపీడియాలపై మేము వెలువరించిన పుస్తకము ప్రపంచ తెలుగు సాహితీ సభలో ప్రముఖుల చేతులలో పడినప్పుడే కూడలి ఈ అందాలను సంతరించుకోవటం ఆనందంగా ఉంది.
3 comments:
సదస్సు విశేషాలకోసం ఎదురుచూస్తున్నా. ఈరోజు కూడా అయితే రేపు రాస్తారేమో.
నూతన సంవత్సర శుభాకాంక్షలు ! సదస్సు విశేషాల కోసం ఎదురుచూపులతో...
అవును మన తెలుగు మిత్రులు తయారు చేసిన ఉచిత తెలుగు పుస్తకము సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు,తెలుగు అధికార భాష సమితి అధిపతి ఎ.బి.కె.ప్రసాద్ వగైర ప్రముఖులకు మురళీధర్ గారి ద్వారా అంద చేయబడ్డాయి. ఈ పుస్తకాన్ని ఇక్కడ నుంచి download చేసుకోవచ్చు. http://deeptidhaara.blogspot.com/2006/12/blog-post_29.htmlలింక్స్
Post a Comment