మొదటిగా...బ్లాగులు సొంతంగా రాసుకునేవి. ఎవరి కోసమో మనం రాయటం లేదా రాయకుండా మిన్నకుండటం అస్సలు బ్లాగు దేహానికి సరిపడదు అని నమ్మే వారిలో నేనొకడిని. గత నూటా ఇరవై టపాలలో కూడా నేను ఇదే ధోరణిలో పోయాను. తోటి బ్లాగరుల అభినందనలు అందుకున్నాను. దాదాపు పదిహేను వేలకు పైగా హిట్లు వచ్చాయి. కాబట్టి ఇకపై కూడా ఇదే రకంగా బ్లాగుతాను :-)
మీకు శోధన నచ్చినప్పుడల్లా నాకు కామెంట్ల ద్వారా అభినందించారు. అందుకు అందరికీ నా ధన్యవాదాలు. అదృష్టవశాత్తు నాకిప్పటివరకూ సద్విమర్శలే వచ్చాయి. అది కేవలం నా తోటి బ్లాగు మిత్రుల, ప్రియ పాఠకుల సంస్కారానికి, హుందాతనానికి గీటురాయిగానే నేను భావిస్తున్నాను.
మీకు కూడా శోధన నిజంగా నచ్చితే (భావ వ్యక్తీకరణ, వైవిధ్యం, ముక్కుసూటితనం, మరియు క్లుప్తత అంశాలుగా) మీరు ఇండిబ్లాగర్స్ అవార్డులకు ఈ బ్లాగును సూచించవచ్చును. మంచి తెలుగు బ్లాగు అవార్డును తేనెగూడు వారు అందిస్తున్నారు.
మీరు శోధనను గానీ మరో తెలుగు బ్లాగును గానీ ఈ విధంగా నామినేట్ చెయ్యవచ్చు.
౦౧. మీకు http://del.icio.us అనే సైట్లో ఒక లాగిన్ ఉండాలి. దానిని సృష్టించండి. తరువాత లాగిన్ అవ్వండి.
౦౨. తరువాత ఈ పేజీలో క్రింద చూపిన విధంగా ఎంపిక చేసుకోవాలి.
tags ఇవ్వాల్సిన చోట తప్పని సరిగా మీరు "ib06 ib06Indic ib06Telugu" అని నింపాల్సి ఉంటుంది. ఇది చాల ముఖ్యం.
౦౩. "Save" బటన్ నొక్కండి. అంతే మీరు మీ అభిమాన బ్లాగును నామినేట్ చెయ్యటం అయిపోయింది.
ధన్యవాదాలు...ఇక మీ అభిమాన బ్లాగును నామినేట్ చెయ్యటమే ఆలస్యం.
0 comments:
Post a Comment