సద్దాంని అన్యాయంగా చంపేసారు సరే? అన్యాయం అన్నారు..అమెరికా నువ్వు నాశనం అయిపోతావ్ అన్నారు సరే...అంతవరకూ బాగానే ఉంది. దానిని అందరూ ముక్త కంఠంతో ఒప్పుకుంటారు.
కానీ, ఎక్కడ ఆగాలో తెలిస్తే మేమెందుకు పిచ్చోల్లమవుతాం అన్నట్లు సద్దాం భజనపరులు అకస్మాత్త్తుగా రాత్రికి రాత్రి బయలు దేరారు. తెగ కవితలు, దండలు వేసేస్తున్నారు. ఒక సభకయితే ఏకంగా చంద్రబాబు హాజరయిపోయి "........విన్నవించకుంటున్నాను" అని ఏదో తెలియని వాగుడు వాగాడు.ఇది దిగ్భ్రాంతి కలిగించే పరిణామం. అసలు అతని చరిత్ర ఏమిటి? ఎలాంటి నియంత ఇవన్నే తెలియని వారు ఇందులో ఉన్నారను కుంటే మన భ్రమే. అన్నీ తెలిసి కూడా..అమెరికాని తిట్టడానికి, సామ్రాజ్యవాదాన్ని తిట్టడానికి సందు దొరికింది కదా అని హంతక భజన మొదలు పెట్టడం సిగ్గు చేటు. అమెరికా సామ్రాజ్య వాదాన్ని తిట్టడానికి వంద మార్గాలున్నాయ్. ఈ కీర్తనలు ఏ స్థాయిలోకి పోయాయంటే సద్దాం గాడు పుట్టిందే అమెరికాను అణచడానికి అన్నట్లు ఉన్నాయి.
ఈ సద్దాం సుద్దకాయ కవులందరూ తెలుసుకోవాల్సింది ఒకటుంది. మొదటిది సద్దాం, ఫిడెల్ క్యాస్ట్రో లాంటి కమ్యూనిస్టు యోధుడు కాదు. అమెరికా పాలు పోసి పెంచిన కింగ్ కోబ్రా. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడాడు.దీన జనోద్ధారకుడు అంతకంటే కాదు. ప్రజల సొమ్ములతో బంగారపు టాయిలెట్ సీట్లు చెయ్యించుకున్నాడు.ఇక వీడి కొడుకులు చేసిన వెధవ పనులు ఇంక చెప్పనక్కర లేదు. అంతా కలిపి చూస్తే ఒక భయంకరమైన నియంత.
ఈ లెక్కలో రేపు అప్జల్ గాడిని భగత్ సింగుతో పోలుస్తారేమో.... కవులూ పెన్నులు తియ్యండి మీ కవిత్వంతో హంతక కీర్తనలు రాద్దురు గాని.
4 comments:
భలే వేశారు మొట్టికాయ!
సద్దాం అమెరికాను ఎదిరించే వరకు నాకు ఓకే గానీ, సద్దాంను కీర్తించాల్సిన అవసరమే లేదు. అమెరికాను తెగడాలంటే మనకు బోలెడన్ని కారణాలు వున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
చంద్రబాబులాంటి మనుషులు చెప్పాలీసంగతిని, కానీ ప్రజల మూర్ఖత్వమేకదా వారి పెట్టుబడి, కాబట్టి చెప్పరు. సద్దాం ఇరాక్‌లోని సామాన్యప్రజల జీవితాలను మెరుగుపరచే ప్రయత్నాలేమైనా చేశాడా అన్నదానిగురించి ఎవ్వరూ మాట్లాడరు. ఫిడెల్‌కాస్ట్రో తన దేశప్రజలబాగుకోసం పనిచేశాడు. అమెరికామీద పగకంటే సామాన్యజనం ప్రశాంతంగా జీవించడం అతనికిముఖ్యం. అందుకే అంతబలమైన అమెరికాకూడా అతనిజోలికెళ్లడానికి కుదరక మిన్నకుండిపోయింది. ఇద్దరికీ ఎక్కడైనా పోలిక కనిపిస్తోందా!
సరిగ్గా రాసారు, అమెరికా తప్పును ఎత్తి చూపడానికి సద్దామ్‌ను హీరో చెయ్యనక్కరలేదు! చంద్రబాబు రాజకీయ వేషగాడు; (ఇదివరలో రూమీ టోపీ మాత్రమే పెట్టుకునేవాడు, ఇపుడు షేర్వాణీ కూడా వేస్తున్నాడు.) మన రాష్ట్రంలో ముస్లిములు అసలే లేకపోతే కిమ్మనకపోయేవాడు. ఈ రాజకీయుల జాతే అంత!
కానీ, ఆంధ్రజ్యోతిలో రెండు మూడు వ్యాసాలు చూసాను - సద్దామ్‌ను ఆ వ్యాసాల్లో కీర్తించిన స్థాయికి మనకు మతే పోతుంది.
వార్తలో ఇంకా మీరు చూడలేదోమో? కత్తి పద్మారావు కూడా ఆ రాతలు రాసిన వారిలో ఉన్నారు :-) ఇదొక మాస్ హిస్టీరియా. అరుంధతీ రాయ్ కూడా ఇదే కోవలోకి వస్తారు. ప్రతీ వివాదాస్పాద అంశానికి (మాత్రమే) వారు నాయకత్వం వహించాలనుకుంటారు.
Post a Comment