Tuesday, January 30, 2007

తెలుగు సినిమా వజ్రోత్సవాలు..హీరోలు, జీరోలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు ధాటిగా ప్రారంభమై వాగ్ధాటిగా ముగిసాయి. ఈ హడావిడిలో కొన్ని నిజాలు తెలిసాయి. నటీ నటుల నిజమైన హీరోయిజం అర్ధమయింది.

ఈ వజ్రోత్సవాలలో హీరోగా నిలచి అందరి మనసులు కొల్ల గొట్టిన వాడు ఒకే ఒక్కడు...

ఆశ్చర్యంగా ఉన్నా అది...బాలకృష్ణ

హుందాతనం, చెరగని చిరునవ్వు, పెద్దలంటే గౌరవం, చిన్న పెద్ద తారతమ్యం లేకపోవటం , కొట్టొచ్చిన అమాయకత్వం, బోళాతనం అందరిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయాలకు పూర్తిగా అతీతంగా కనిపించాడు.

నేను ముందర బాలకృష్ణ అంటే చాలా తేలిగ్గా తీసి పడేసే వాడిని. (సినిమాల వలన).కానీ బాలకృష్ణ నిజ జీవితంలో పూర్తిగా తేడా ఉందనిపించింది. నాకు ఇవన్నీ చూస్తే అలనాటి విమాన ప్రమాదం ఒక్క సారి గుర్తుకొచ్చింది. చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.

ఇక జీరోలు

౦౧. ఖచ్చితంగా ఈ ఉత్సవాల కమిటి. ఖర్చు పెట్టిన డబ్బంతా ఎక్కడ పోయిందో అర్ధం కాలేదు. విమానం ఛార్జీలు చెల్లించి మరీ ముంబయి హీరోయిన్లను రప్పించారో ఏంటో? దిగ్గజాలన్నారు...బతికున్న మహామహులను మర్చిపోయారు. చనిపోయిన మహా నటుల కుటుంబాలను ఆహ్వానించి వారికి ఇవ్వొచ్చుగా దిగ్గజాల అవార్డులు? అలా అయితే ఖచ్చితంగా ఇప్పటి తరం నటులు మొదటి 75  దిగ్గజాలలో ఉండరు.  రంగస్థలం మీద కనీసం సినీ మహామహుల చిత్రాలు లేవు. కార్యక్రమాలన్నీ ముంబాయి భామలు, చెన్నై భామల చేతుల మీదగానే. శ్రీదేవి(ఇప్పటి), సుహాసిని(ఇప్పటి) వంటి తెలుగు తారలు నృత్యాలకే పరిమితం.పురుషాధిక్యత సుస్ప్రష్టం. శ్రీదేవి(సీనియర్) వంటి సినీ దిగ్గజం అసలు హాజరు కాలేదు. చిరంజీవి పద్మ భూషణ్ సత్కారానికి ఇంతకంటే బాగనే తెలుగు హీరోయిన్లు వచ్చారేమో.

౦౨. మోహన్ బాబు : చెప్పేదంతా నిజమే అనిపించినా చెప్పిన విధానం చాలా చవకబారుగా ఉంది. నేను గొప్ప అని చెప్పుకోవటం గొప్పవాళ్ళ లక్షణం అసలు కాదు. చెప్పిన కారణాలు కూడా కొద్దిగా అతడు ఆలోచించుకుని చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యా సంస్థను స్థాపించటం గొప్ప కాదు...అందులో 25% ఉచిత విద్య మరీ అంత గొప్ప విషయం కాదు. పూర్తిగా ఉచితంగా వైద్యం చేసే వైదులు, చదువు చెప్పే టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక రాజ్య సభకు ఎంపిక కావటం. అతను ఆ సభకు ఎలా వెళ్ళాడు? రాజ్య సభ అంటే ఒకొప్పుడు మేధావుల సభ.ఇప్పుడు అది ఒక రాజకీయ పునరావాస సభ. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకుని సినీ దిగ్గజం అంటారనుకుంటే టొమేటో పప్పులో కాలు వేసినట్లే.ఇతడికి అస్సలు క్రమశిక్షణ లేదు. ఒక నలభై నిమిషాలు తినేసాడు (నాలుగు నిమిషాల ప్రసంగం చెయ్యబోయి).

౦౩. ఇక చిరంజీవి....మొదలు పెట్టటమే ఉబికి వస్తున్న కన్నీళ్ళతో మొదలు పెట్టాడు. చెప్పేది మోహన్ బాబును ఉద్దేశించి అయినా ముందర మోహన్ బాబు సభలో ఉన్నాడో, లేనిదీ ఒక సారి టెస్ట్ చేసి (ఏడీ మోహన్ బాబు...) మరీ మొదలు పెట్టాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కాదు ..నేనే అనిపించాడు, క్లాస్ గానే మాట్లాడుతూ డ్రామా రక్తి కట్టించాడు. ఇతడు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఒక విషయంలో పొంతన కుదరలేదు. ఒకప్పుడు దర్శకులు పిలిచి వేషం ఇస్తే ఎంతో సంతోషంగా చేసేవాళ్ళం, ఒదిగి ఉండే వాళ్ళం...ఇప్పుడూ అలానే ఉందాం..అర్ధాకలితో ఉందాం అన్నాడు. అయితే ఆ ప్రసంగానికి ఒక రోజు ముందరే పూరీ జగన్నాధ్ సుమతో "చిరంజీవి గారికి నాలుగు కధలు వినిపించా, కానీ అతనికి నచ్చలేదు" అని చెప్పాడు. ఇప్పుడు తెలుగులో ఉన్న దుస్థుతి ఇది. ఇదే కారణం మీద రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో సినిమాకు గుడ్ బై చెప్పేసాడు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే తన్ని పోయాడు. ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇచ్చిన అవార్డును తిరస్కరించి చాలా తప్పు చేసాడు. అది ముఖ్యమంత్రికే అవమానం. అది చాలక డ్రామా సహితంగా టైమ్ కాప్స్యూల్ లో వెయ్యటం ఒకటి. ఆ పెట్టెలో ఏమి వెయ్యవచ్చో అల్లు అరవింద్ పది సార్లు చెప్పినా కూడా చిరంజీవి ఆ పని చెయ్యటం ద్వారా ఈ అవమానకర సంఘటనను తరువాత ఇరవై అయిదు సంవత్సరాలకు, ప్రతిష్టాత్మకమైన శత వత్సర పండుగ వరకు పొడిగించారు. అప్పటికి చిరంజీవి, మోహన్ బాబు స్నేహితులుగా చెట్టా పట్టాలు వేసుకుని ఉంటే వారికి ఆ శత వత్సర పండుగలో వారు చేసిన పనులు చాలా చెత్తగా అనిపించక మానవు. ఎప్పుడూ  ఆదర్శంగా
మాట్లాడే చిరంజీవి ఇలా ప్రవర్తించటం అసలు ఊహించనిది.


౦౪. దాసరి : శకుని పాత్ర అంటున్నారు.


౦౫. పవన్ కల్యాణ్ : అస్సలు మెచ్యూరీటీ లేదు. తప్పనిరిగా మానసిక వైద్యం అవసరం. నాకుండే గౌరవం పోయింది.

10 comments:

Anonymous said...

ఈ వజ్రోత్సవం ఒక గుంపు వాళ్ళకి బాగా సాయపడింది. మిగిలిన వాళ్ళు కేవలం ప్రేక్షకులే. పద్మ భూషణ్ అవార్డ్ ఉత్సవంలో మోహన్ బాబు విలన్ అయితే ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు అయ్యాడు. చిరంజీవి యాంటీ హీరో అయ్యాడు. గెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాల్సిన బాల కృష్ణ పెద్ద హీరో అయ్యాడు.

ఇలాంటి వాటికి చస్తే రానని చెప్పిన "సోగ్గాడు" శొభన్ బాబు మాత్రం హాయిగా ఇంట్లో టీ.వీ. చూస్తూ నవ్వుకొనుంటాడు.

విహారి
http://vihaari.blogspot.com

Anonymous said...

బాలకృష్ణ ప్రవర్తన అతనిపట్ల నాకు సదభిప్రాయాన్ని కలిగించింది. ఆయన సినిమాలపై వచ్చే వ్యంగ్య వ్యాఖ్యలకు జనాలు నవ్వుకోవడం మానేయాలంటే, కేవలం తన అభిమానులమని చెప్పుకొనే వారికోసం కాక, ఇమేజ్‌కు దూరంగా ప్రేక్షకులందరూ మెచ్చే ఒక మంచి చిత్రం చేస్తారని ఆశిస్తున్నాను. అతనిలో మంచి నటుడున్నాడన్నది ప్రత్యేకంగా చెప్పాలా?

రాధిక said...

vajroastsavaalu ni anni koanaaanumdi correct ga visleashimcaaru.

చదువరి said...

"చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు." - ఇదెప్పుడు జరిగిందండీ?

Sudhakar said...

అది 1993 లో నవంబరు 15 న జరిగింది. చిత్తూరు జిల్లా లోని కల్వకుర్తి దగ్గర బాలయ్యపల్లె చెరువు అనే చోట చెన్నయి వెళుతున్న విమానం ప్రమాద వశాత్తు పంట పొలాలలో దింపివేయాల్సి (క్రాష్ ల్యాండింగ్) వచ్చింది. ఆ విమానానికి కెప్టెన్ మిస్టర్ భల్ల్లా. అదే విమానంలో చిరంజీవి తన కుటుంబంతో ప్రయాణిస్తున్నారు. బాలకృష్ణ, విజయ శాంతి కూడా ఆ విమాన ప్రయాణీకులలో ఉన్నారు.

Sudhakar said...

అదే విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడి బ్లాగు
http://vkannan.sulekha.com/blog/post/2006/11/memorable-days.htm

Unknown said...

చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.

ఆ సమయంలో ఎవరయినా అలాగే చేసేవారేమో...
బాలకృష్ణ స్థిమితంగా ఉంటే ఉండి ఉండవచ్చు కానీ చిరంజీవి ఏడవడం అతన్ని తక్కువ చెయ్యదు.

మిగతా విషయాల్లో చూస్తే ఈ వజ్రోత్సవాల్లో తప్ప చిరంజీవి ఎంత స్థిమితంగా ఉంటాడో అందరికీ తెలిసిందే.
బాలకృష్ణ ఎంత స్థిమితంగా ఉంటాడో తుపాకీ పేల్చినప్పుడే తెలిసింది.

ఒక ఇన్సిడేంట్ ఎవరిని హీరోలు చెయ్యదు అలాగే జీరోలను కూడా. అది కాలం చెప్పాల్సిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే నటీ నతులయినా వారూ మనుషులే, మనలో ఉండే ఉద్వేగాలు వారిలోనూ ఉంటాయి కాకపోతే అంత మందికి ఆరాధ్యులు కాబట్టి ఎక్కువ భాధ్యత ఉంది అంతే.

Sudhakar said...

ఎవరో ఎందుకు నేనున్నా అలానే ఏడ్చే వాడినేమో. నేనిక్కడ దానిని చిరంజీవి తాలుకా ఎమోషనల్ స్థాయిని అంచనా వెయ్యటానికి ప్రస్తావించాను.

చిరంజీవి నాకు తెలిసినంతవరకూ చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడుతాడు. అందువలనే ఆశ్చర్యం కలిగింది. కాక పోతే చేసిన డ్రామా అంతా చిరంజీవిలో ఉన్న ఇంకో కోణాన్ని చూపింది. అది ఏమి అణచుకోకుండా , దాచుకోకుండా వ్యక్తీకరించినది కావచ్చు. ఎందుకంటే చిరంజీవి సత్కార సభలో మోహన్ బాబు కాస్త మామూలుగా "నా గురించి చిరంజీవి గారికి కొంత మంది పని గట్టుకుని తగిలిస్తున్నారు, అంతే గానీ ఇంకేమీ లేదు " అని చెప్పబోతే పవన్ కల్యాణ్ తీవ్రంగా అవమానించాడు. అప్పుడు చిరంజీవి "నాలు ఎవరూ శత్రువులు లేరు...మోహన్ బాబే ఇంకా దానిని గురించి ఆలోచిస్తున్నాడు" అని అన్నాడు. ఆ తర్వాత కూడా దానిని సరి దిద్దే ప్రయత్నం చిరంజీవి చెయ్యలేదని అర్ధం అవుతుంది. ఎందుకంటే తె.వ.లు మొదలవ్వటానికి ఒక రోజు ముందర పవన్ కల్యాణ్ మోహన్ బాబు తో తగవు పెట్టుకున్నాడంట. ఇలాంటివి చిరంజీవికి తెలియకుండా జరుగుతాయా?

spandana said...

మీ అభిప్రాయాలతో నేను ఈ వజ్రోత్సవ పండుగ వరకూ పూర్తిగా ఏకీభవిస్తున్నా! అయితే ప్రవీణ్ అభిప్రాయము చూశాక బాలయ్య ఇక్కడ హుందాగా ప్రవర్తించినా ఆ ఒక్కదానితో పూర్తిగా అంచనా వేయకూడదు అనిపించింది.
అదీగాక నేను చదువుతున్న రోజుల్లో ఒకానొక పర్యటన సందర్భంగా బాలయ్య సినిమా షూటింగ్ చూడటం తటస్తించింది. అక్కడ విశ్రాంతి సమయంలో ఆయనను చూడబోతే ఆయన హావభావాలు అన్నీకూడా ఆయన హుందతనాన్ని తెలియజేయలేదు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే తను మాట్లాడీన తీరుకి తనిప్పుడు ఖచ్చితంగా నొచ్చుకుంటూ వుంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కోసారి ఎంత నిబ్బరస్తులైనా సంయమనం కోల్పోయి ఇలా అతి వుద్వేగభరితంగా మాట్లాడే అవకాశముంది.
అయితే ఈ సంఘటనతో ఆయన పెద్దరికం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి.
--ప్రసాద్
http://blog.charasala.com

spandana said...

మీ అభిప్రాయాలతో నేను ఈ వజ్రోత్సవ పండుగ వరకూ పూర్తిగా ఏకీభవిస్తున్నా! అయితే ప్రవీణ్ అభిప్రాయము చూశాక బాలయ్య ఇక్కడ హుందాగా ప్రవర్తించినా ఆ ఒక్కదానితో పూర్తిగా అంచనా వేయకూడదు అనిపించింది.
అదీగాక నేను చదువుతున్న రోజుల్లో ఒకానొక పర్యటన సందర్భంగా బాలయ్య సినిమా షూటింగ్ చూడటం తటస్తించింది. అక్కడ విశ్రాంతి సమయంలో ఆయనను చూడబోతే ఆయన హావభావాలు అన్నీకూడా ఆయన హుందతనాన్ని తెలియజేయలేదు.
ఇక చిరంజీవి విషయానికి వస్తే తను మాట్లాడీన తీరుకి తనిప్పుడు ఖచ్చితంగా నొచ్చుకుంటూ వుంటాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కోసారి ఎంత నిబ్బరస్తులైనా సంయమనం కోల్పోయి ఇలా అతి వుద్వేగభరితంగా మాట్లాడే అవకాశముంది.
అయితే ఈ సంఘటనతో ఆయన పెద్దరికం కొద్దిగా తగ్గిందనే చెప్పాలి.
--ప్రసాద్
http://blog.charasala.com

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name