ఈ రోజు ఫైర్ ఫాక్స్ 2.0 బీటా 2 వ్యవస్థాపితం చేసాను. చాలా బాగుంది. మొదలవ్వటానికి కొంత సమయం పట్టినా కూడా, అంతా శుభ్రంగా అందంగా అనిపించింది. ముఖ్యంగా పుటలు (టాబ్స్) పొందిగ్గా వున్నాయి. అయితే తెలుగు చదవటంలో వున్న ఇబ్బందులు ఇంకా తొలిగిపోలేదు :-( ఒత్తులు, నుడికారాలు అన్ని విడిపోతున్నాయి. పద్మను కూడా వ్యవస్థాపితం చేసి చూడాలి.
అసలు ఫైర్ ఫాక్స్ మొదటి పుట (గూగుల్ శోధన) తెలుగు లో మార్చి అన్ని సైబర్ కేఫ్ లలో వ్యవస్థాపితం కోసం పంచితే ఎలా వుంటుంది? ఆ పుట లో తెలుగు వికీ, బ్లాగర్లు, దినపత్రికల లింకులు వుంచితే ఇంకా ఫలితం వుండవచ్చు.
(నా బ్లాగులో ఇది షష్టి పూర్తి టపా :-))
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
షష్టి పూర్తి టపా కు అభినందనలు! :)
మీ ఆలోచన భేషుగ్గా ఉంది. ఐతే ఫైర్‌ఫాక్స్ కు చదువరి గారు మంటనక్క అనే అచ్చతెలుగు పేరు పెట్టారు. ఆయన కూడా "మంటనక్క పైనే మన స్వారీ :)" అంటారు.
షష్టి పూర్తి టపా కు అభినందనలు! :)
ఫైర్‌ఫాక్స్ 2 బీటా 2 నాకు నచ్చింది. కాకపోతే అప్పుడప్పుడు క్రాష్ అవుతుంది. తెలుగు ఇబ్బందులు ఫైర్‌ఫాక్స్ 3 తో తీరిపోనున్నాయి (XPలో ప్రాంతీయ సెట్టింగులు మార్చకపోయినా). ఫైర్‌ఫాక్స్ 3 నైట్లీ తెరచాపని చూడండి.
అహహ్హా! మంటనక్క. భలే ఉంది.
షష్టి పూర్తి టపా సందర్భాన హార్దిక అభినందనలు.
మైన్ ఫీల్డ్ బాగున్నది. మంటనక్క (రెడ్ ఇండియన్ పేరులా వుందండి :-)) 3.0 కోసం ఎదురుచూస్తా..
ధన్యవాదాలండి :-)
షష్ఠి పూర్తి టపా పూర్తి చేసినందుకు అభినందనలు!
సుధాకర్ గారు.. firefox 2(bon echo) నేను కూడా ట్రై చేశాను కానీ IE7 కి మారిపోవడానికి కారణాలు, ఒకటి తెలుగు వత్తులు విడివిడిగా ఉండటమైతె, రెండు IE7 లో తెలుగు బాగా కనపడుతుంది మరియు firefox లో లాగనే tabs ఉన్నాయి. నాకు మాత్రం feeds and tabs firefoxలో కంటే IE7 లోనే సౌకర్యంగా అనిపించాయి. firefox 3 ఎలా ఉంటుందో చూడాలి.
P.S: మీ తెలుగు వికీ సెర్చ్ ప్రొవైడర్ నా IE7 కి సమకూర్చుకున్నను. థ్యాంక్స్ అండీ.
Post a Comment