Saturday, September 30, 2006

ఉల్టా చోర్ కొత్వాల్‍కో డాంటే

దీన్నే కాస్త తెలుగులో చెప్పుకోవాలంటే : ఎద్దు తన తోక మీద కాలేస్తే పిల్లి ఎలక వంక ఎర్రగా చూసిందంట :-)

కాకపోతే ఇక్కడ 'ఈనాడు' ఎలక కానే కాదు, అక్కడే వచ్చింది చిక్కు మన "భగవంతుని పాలనకు".

దొరికింది దొరికినట్లు మేసెయ్యవచ్చు అనుకొని వేసుకున్న డొంకలు తీగలు లేకున్న కదుల్తున్నాయి. మీరు మీ ప్రభుత్వం లో తిన్నారు, మేము ఎందుకు తినకూడదు అన్నట్లుగా ఉంది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తాము చిక్కుల్లో పడ్డట్లు తెలియగానే ఇక అతి దరిద్రమైన రాజకీయం మొదలయింది. గత ప్రభుత్వం ఐ.ఎమ్.జి సంస్థ కు లీజుకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుని దానిపై సీ.బీ.ఐ విచారణ మొదలుపెట్టింది. ఎంత సిగ్గు చేటు. అంటే పత్రికలు ఈ భూబాగోతం బయటపెడితేనే ఇట్లాంటివి ప్రభుత్వానికి గుర్తొస్తాయా? లేకపోతే చూసీ చూడనట్లు సర్దుకుపోవటమేనా?

 

ఇవన్నీ కాక పత్రికల మీద దుమ్మెత్తి పొయ్యటం, ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేస్తామనటం పరిపక్వత లేని, హుందాతనం అస్సలు లేని చేతకానితనాన్ని చూపిస్తుంది. ఈ రోజు ఈనాడు తన మీద వస్తున్న ఆరోపణల మీద విరుచుకు పడిన తీరు నాకు చాలా నచ్చింది.

కొన్ని మంచి చెణుకులు

"పత్రికల మీద విశ్వాసం లేకుంటే ఒక్క రోజులో వాటిని వదిలించుకోవచ్చు, కానీ వచ్చిన చిక్కల్లా, మీ లాంటి నాయకులను ఒక సారి ఎన్నుకున్న తరువాత , ఐదేళ్ళ పాటూ మోయక తప్పదు ప్రజలకు !"

"పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నయని ఆక్షేపిస్తున్నారు వై.ఎస్. అవును అందులో తప్పేముంది? ప్రతిపక్షాల్లా కాక అధికార రాజపత్రికలలా ఉండాలా?"

ఇక ఇందిరమ్మ రాజ్యం మీద మంచి వ్యాఖ్యలు పడ్డాయి. ఇందిరమ్మ రాజ్యం అనిచెప్పి అమాయకులను మోసం చెయ్యొచ్చేమో గానీ, ఆ ఇందిరమ్మ గారు ఏలిన చీకటి రాజ్యం, మొండిగా భ్రష్టు పట్టించిన విదేశీ సంబంధాలు, అవివాహితులకు బలవంతపు కుటుంబ నియంత్రణలు, తమిళ తీవ్రవాదులకు పెరటి సాయం తెలిసిన వాడెవడయినా నవ్విపోతాడు. ఇంకా ఇందిరమ్మ వ్యక్తిత్వం మీద ఏవైనా భ్రమలు ఉంటే పుపుల్ జయకర్ (ఇందిర స్నేహితురాలు) రాసిన బయోగ్రఫీ చదవాల్సిందే. ఎమ్బీఎస్ ప్రసాద్ గార "పడక్కుర్చీ కబుర్లు" లో చెప్పినట్లు భారత దేశం లో నెహ్రూ కుటుంబ పరిపాలన నెహ్రూ తోనే అంతమయ్యింది. తరువాత నుంచి ఇందిరమ్మ కుటుంబ పాలనే !

ప్రజాస్వామ్యాన్ని నక్క తెలివితేటలతో హత్య చేసెయ్యటం ఇందిర తోనే మొదలయ్యింది. ఇందిర హత్య గానీ, రాజీవ్ హత్య గానీ త్యాగలనీ చెప్పలేము. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట ఒక చీమ; రాజీవ్ విషయంలో అది చీమ కాదు, తమిళ పులి. ఇప్పుడు బుష్ చేస్తున్నదీ అదే...అనుభవిస్తాడు.

3 comments:

murthy said...

కథ లో అసలు మలుపు యేమిటయ్యా అంటే:

ఈనాడు వ్యవస్థాపకుడు అయిన రామోజీ రావు గారి స్థలం (మూడు ఎకరాలు) ప్రభుత్వం చెపట్టిన స్థల సేకరణ ప్రక్రియలో తుడిచి పెట్టుకు పొయాయి. న్యాయస్థానం తీర్పు కూడ ప్రభుత్వ పక్షమే.. అందుకే అయన అక్కసు అంతా...

Anonymous said...

అది నిజమే, కానీ అది ఒక్కటి తప్ప, ప్రభుత్వానికి ఈనాడును తిట్టడానికి ఏమీ దొరకటంలేదే...అసలు ఆ విషయం కూడా ప్రభుత్వం ఎత్తటం లేదు..హుడా మాత్రమే ఒక అతి చెత్త ప్రకటన ఈనాడు మీద ఇచ్చింది..ఒక ప్రభుత్వేతర రియల్ ఎస్టేట్ కంపెనీలా !

Anonymous said...

edi emi na gani, naaku ee meaning eppudu artham indi. Eppudu problems vachhina ela prajala tho mora pettukuney ramji rao marala adey vidaanam lo thana godu vinipincharu telugu prajalaki. Kaani naaku ee hindi sametha artham kaka...eppudu edo thana sontha sodi cheppatanikey ala paper lo ok column ni vrudha cheyyatam...manam daniki ohhh antuuu oo 30pisalu evvatam sara mamooley.. indulo kachitham ga eru vargalu labaha paduthunnai...nasta poyedi mathram manam samanya prajalam.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name