చరిత్ర, పురాణాలు చదువుతుంటే కొన్ని సార్లు అవి అవి రాసిన రచయతల అభూత కల్పనలకు, వక్ర బుధ్ధికి బలయి పోయాయేమొ అనిపిస్తాయి. ఎవరో చెప్పినట్లు చరిత్ర విజయవంతులు, బలవంతులు చుట్టూనే తిరుగుతుంది. శతాబ్దాల తరబడి ప్రజలను మోసగిస్తూ వుంటుంది.
ఉదాహరణకి : గెలీలియో పీసా శిఖరం ప్రయోగం.
అందరూ దీన్ని గురించి చదివే వుంటారు. గురుత్వాకర్షణ కు భారంతో సంబంధం లేదని నిరూపించడానికి గెలీలియో పీసా శిఖరం నుంచి ఒక సీసపు గుండును, పావురాయి ఈక ను వదిలాడని,అవి రెండూ ఒకే సారి భూమి మీద పడ్డాయని సవాలక్ష పుస్తకాలలో రాసేసారు. అయితే మీరు ఆ ప్రయోగమే ఒక వంద సార్లు చేసినా సీసపు గుండే ముందు భూమిని తాకుతుంది.ఎందుకంటే అక్కడ చాలా ప్రసిద్ధమైన జడత్వం, ఘర్షణ అనే కారకాలు పనిచేస్తాయి. ఇక్కడ గెలీలియో చేసిన ప్రయోగం తప్పు కాదు. చేసిన వర్ణన తప్పు. నిజానికి సీసపు గుండుని, పావురాయి రెక్కని ఒక శూన్య నాళికలో వదిలితే అవి ఒకే సారి భూమిని తాకుతాయి.
ఇలాంటివి చరిత్ర పుస్తకాలలో కోకొల్లలు.
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
సరిగ్గా వివరించారు.
చిన్నప్పుడు ఇది చదివి అవునా అనుకొనేవాన్ని. మీరన్నట్లు పరీక్షించినప్పుడు అది తప్పేమొ అనిపించేది కాకుంటే ముద్రణలో చదివిందంతా నిజమే అని నమ్మేవాణ్ణప్పుడు కాబట్టి సరిపోయింది.
-- ప్రసాద్
http://charasala.wordpress.com
Post a Comment