గత నాలుగు రోజులుగా విశాఖలో థియేటర్ల మూసివేత చూస్తే మనవాళ్ళు సమ్మెకు కాదేదీ అనర్హం అనుకుంటున్నారు. నగర అదనపు కమీషనర్ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఒక హాలుని మూత వేస్తే, మిగతా థియేటర్లు ఆ కసిని ప్రేక్షకుల మీద తీర్చుకుంటున్నారు.
ఆ సంగతి అటు ఉంచితే, విశాఖ థియేటర్లలో ఈ విధమైన సౌకర్యాలు ఉన్నాయి.
- అతి చెత్తగా, రోజుకు ఒక సారి శుభ్రం చేసే టాయిలెట్లు.
- పార్కింగు పైన కట్టేసిన థియేటర్లు (రమాదేవి)
- అసలు కారు పార్కింగు కూడా లేక పోవటం (జగదాంబ)
- ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే తినుబండారాలు
- కనీస అగ్ని మాపక సదుపాయాలు, అగ్ని మాపక యంత్రం తిరిగే సదుపాయం కూడా లేక పోవటం. (ఏదో ఒకటి జరిగితేనే మన ప్రభుత్వం హడావిడి చేస్తుంది.)
ఎన్ని రోజులు సినిమాలు ఆపేసినా ఫర్వాలేదు కానీ, ఈ థియేటర్లు బాగుపడ్దాకే వాటికి అనుమతి ఇస్తే బాగుంటుందేమో...
2 comments:
అవును,
కాకపోతే స్టాలిన్ వస్తుంది కదా!
ఆ అది వచ్చింది, ముగ్గురు పిచ్చాభిమానులు పోయారు.
Post a Comment