Thursday, November 02, 2006

నల్ల రాజకీయాలు

  • కేసీయార్ నల్ల రాజకీయాలు శ్రుతి మించి పాకాన పడ్డాయి...త్యాగాలు, ప్రాణాలు బలిగొన్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నల్ల దినంగా పాటించమనటం ఒక దుస్సాహసం. పోతే ఆ సందర్భంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా మాట్లాడే తెలుగు మీద, తెలుగు తల్లి అనే భావన మీద దాడి మరీ నీచం . మరి ఈ వికారపు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో తెరాసలోని మేధావులమని చెప్పుకునే వారినే అడగాలి. ఇలాంటి వెధవలు రేపు హైదరాబాదు, కాశ్మీరు పాకిస్తాన్ కు చెందుతాయని వాదించే సందర్భం రావచ్చు. ఈ బాషా విద్రోహం ఎవరు క్షమిస్తారు? వీరసలు తెలంగాణా ప్రాంత ప్రజలు మాట్లాడే బాష ఏ బాష అనుకుంటున్నారు?
  • ఈ రోజు బంద్ అంట. కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే బంద్ జరిగిందని ప్రసారవాహికలు చెప్తుంటే, తెరాసా మాత్రం బంద్ సంపూర్ణం అంటోంది smile_sarcastic. ప్రసార వాహికలలో చూపించిన ప్రకారం...పాఠశాలలోనికి దౌర్జన్యంగా ప్రవేశించి విద్యార్ధులను బలవంతంగా పంపటం, బస్సుల టైర్లలోని గాలి తియ్యటం, రైల్లను ఆపివేయటం, దుకాణాలు మూసివేయించటం...ఏమిటివి? దీన్ని సంపూర్ణ బంద్ అని ఎలా అంటారో వారికే తెలియాలి..అల్లరి మూకల్ని వెంటేసుకుని దేనినయినా ఆపవచ్చు. కాని అది ఎంత మందిని ఇబ్బందికి గురి చేస్తుందో తెలుసుకోవటం మంచిది...మీరు మీ వీ.ఐ.పి వాహనాలలో వస్తే మేమందరం గంటలు ఆగి మరి దారి ఇస్తున్నామే? మరి మీరు మా జీవిత గమనాన్ని ఎందుకు స్థంభింప చేస్తారు? smile_angry
  • తెలుగు దేశం, కాంగ్రెస్ పిచ్చోల్లందరూ మూగ ప్రాణాల మీద పడ్డారు. వాటిని పేర్లు పెట్టి, కొడుతూ  రోడ్ల మీద తిప్పటం...ఎంత సిగ్గు మాలిన పని? పార్టీ పెద్దోల్లు మొట్టి కాయలు వేస్తే గాని ఆగడాలు ఆపలేదు...దేవుడా ఎందుకు ఈ సృష్టిలో ఈ నీచ రాజకీయ జాతిని పుట్టించావు? లోక్ సత్తా ఏమి చేస్తుందో చూడాలి మరి.

3 comments:

Anonymous said...

మా సోదరులు కనిపించుటలేదు

తెలంగాణా అనేది ఒక ప్రత్యేక భాషట. తెలంగాణా రచయితల వేదిక పిచ్చి కూతలు చదవలేదా ? మరి తెలంగాణా అనే పదంలో ఇమిడి ఉన్న తెలంగు ఎక్కణ్ణుంచి వచ్చిందో వారే చెప్పాలి. తెలంగాణా ప్రత్యేక భాషయితే 10 కోట్ల తెలుగు జనాభాలో మూడున్నర కోట్ల మంది కనిపించకుండా పోయినట్లేనా ? ఇప్పుడు మన సంఖ్య ఆరున్నర కోట్లు మాత్రమేనా ?

Anonymous said...

సుధాకర్ గారూ !

మీరు ఈనాడులో ఇచ్చిన సాలెగూళ్ళ జాబితాలో veeven.com/koodali, chanduonline.com ఇంకా తెలుగు బ్లాగర్ల గుంపు చిరునామా లేవేంటి ? ఒకవేళ మీరు ఇచ్చినా ఆ సంపాదకులు ఎడిట్ చేశారంటారా ?

Anonymous said...

నేను ఈనాడుకు ఎటువంటి జాబితా ఇవ్వలేదండి. మీరు ఇప్పుడు పైన పేర్కొన్న సైట్లు ఎందుకు ప్రచురించలేదని మాత్రమే ఆడిగా..

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name