Tuesday, November 14, 2006

తెలుగులో అపురూప గీతాలు

సీ.ఎన్.ఎన్ ఐ.బి.యన్ వారు ఒక సర్వే చేసి ఆంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఐదు పాటలను పట్టుకున్నారు.

ఆ పాటలు ఇవి..

 

  •  05 . ఓం నమహా అధర జతులకు (ఇళయరాజా)
  •  04. కుడి ఎడమయితే పొరపాటు లేదోయి (సి.ఆర్ సుబ్రమణ్యం)
  •  03. శివ శంకరీ, శివానందలహరీ (పీ.ఎన్. రావు)
  •  02. శంకరా నాదశరీరాపరా (కె.వి.మహదేవన్)
  •  01. నీవేనా నను పిలచినదీ, నీవేనా నను తలచినది? (జీ.వి. రావు)

నా అరాధ్య సంగీత దర్శకుడు రాజా ఈ పట్టికలో చోటు చేసుకోవటం అంతో ఆనందంగా ఉంది...

కొన్ని ఇళయరాజా వజ్రాలు

  •  జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే ఓ మైనా మైనా
  •  వెన్నెల్లో గోదారి అందం
  •  ఆమనీ పాడవే హాయిగా
  •  అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
  •  ఇలాగే ఇలాగే సరాగమాడితె..వయ్యారం నీ యవ్వనం
  •  మాటే మంత్రమూ మనసే బంధమూ
  • మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
  • మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
  •  ప్రేమ లేదనీ...ప్రేమించరాదనీ..సాక్ష్యమే నీవనీ
  • సాగర సంగమమే..ప్రణయ....సాగర సంగమమే..
  • తరలి రాద తనే వసంతం
  • వాగర్ధావివ సంప్రుక్తౌ...నాద వినోదము

5 comments:

Anonymous said...

అన్ని వేల పాటల్లో కేవలం ఐదింటినే ఎంచడం కష్టమే! కానీ నేనూహించిన పాటల్లో ఒక్కటే ఈ జాబితాలో ఉంది - శివశంకరీ! "హే కృష్ణా ముకుందా మురారీ" కూడా ఉండాల్సింది. ఈ పాట లేకపోవడం ఆశ్చర్యమే!

రానారె said...

సీ.ఎన్.ఎన్ ఐ.బి.యన్ వారి ఆంధ్రులంటే ఎవరో? వీళ్లసలు పల్లెలకెళ్లారా అని నా అనుమానం.

కొత్త పాళీ said...

వాళ్ళు పట్టుకున్న పాటలన్నీ మంచి పాటలే - అందుకే సంతోషించాలి :-)
ప్రతీ పాటకీ సంగీతదర్శకుణ్ణి మాత్రమే చెప్పారు, గమనించారా? కవి పేరు కలికంలోకి కూడా లేదు. ఒక సినిమాపాట ప్రాచుర్యం పొందటానికి బాణీ యే ముఖ్యం, రచన కాదు అనే సిద్ధాంతానికి ఇదో నిరూపణ.
ఒక పిట్టాతి పిట్ట కథ - ఇంజనీరింగు కాలేజీ రాగింగ్ టైములో జూనియర్స్ తో మెకానికల్ ఇంజనీరింగు టెక్స్టు బుక్కుని వాళ్ళ అభిమాన హీరో సినిమా పాట బాణీలో పాడించే వాళ్ళం. నెల్లూరునించి ఒక అబ్బాయి చిరంజీవి పాట "ఇందు వదన కుందరదన" ట్యూనులో మెకానికల్ ఇంజనీరింగుని గానం చేసేవాడు అద్భుతంగా! :-)
ఒక అచ్చుతప్పు - దేవదాసు సంగీత దర్శకుడు సుబ్బరామన్, సుబ్రమణ్యం కాదు.
ఘంటసాల ని పట్టుకుని జి.వి.రావు అంటం .. హిమాలయ పర్వతాన్ని పట్టుకుని మా యింటెనక కొండ అన్నట్టుంది.

Anonymous said...

Hello,

Could u pls tell me this song is from which telegu movie " Evvoro Okkaru Eppudo aapudu kaadhalara Mundhuki aato eeto yetto vaaiupu"

Anonymous said...

"Evaro Okaru", This song is from the Movie "ANKURAM".

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name