విచిత్రంగా ఉంది కదా...బురదకు బురద అంటితే ఏమవుతుంది...బురదే అవుతుంది. ఈ సారి కూడా మన నంది అవార్డులు అదే విషయాన్ని నిరూపించాయి. మహేష్ బాబు, సిరివెన్నెల, శ్రీహరి, అనుకోకుండా ఒక రోజు తప్పితే మిగతా అవార్డులన్నీ పోటీ ఎవరూ లేక ఇవ్వలేదనిపిస్తోంది. అసలు ఈ నంది అవార్డు కమిటీలో ఎవరుంటారో, వారి భావ చైతన్యం స్థాయి ఎంత ఉందో అర్ధం కాదు..
నాకు చిరాకు పుట్టిన కొన్ని అవార్డులు...
01. ఉత్తమ కధానాయకి : కుమారి త్రిష (ను.వ.నే.ఒ ?) - ఇందులో త్రిష బాగానే చేసింది కాదనటం లేదు, కానీ అవార్డు స్థాయి మాత్రం అస్సలు లేదు. నా మట్టుకు ఈ అవార్డు ఛార్మికి (అనుకోకుండా ఒక రోజు) దక్కాలి.
02. ఉత్తమ చిత్రం : పోతే పోనీ (ఎప్పుడైనా విన్నారా ఈ పేరు?)...ఇది ఒక భారీ పరాజయం పొందిన చిత్రం...ఇది వారికి ఉత్తమ చిత్రం ఎలా అయిందో మరి. తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రభావం అనుకుంటా...ఎంతైనా నిర్మాతల మండలి అధ్యక్షుడు కదా..
03. ఉత్తమ సంపూర్ణ హాస్య చిత్రం : పెళ్ళాం పిచ్చోడు ...జుగుప్స కలిగించే ఒక కధనంతో చిరాకు పుట్టించే చిత్రం ఇది.
04. ఉత్తమ సహాయక నటి : భానుప్రియ (ఛత్రపతి) : నేను ఈ చిత్రం చూసాను. భానుప్రియ నటన ఎంత కృత్రిమంగా ఉంటుంది అంటే..పావలా ఇస్తే పది రూపాయల నటన చేసినంతగా...
తెలుగు చిత్ర పరిశ్రమా నువ్వు బాగుపడవు....హాలీవుడ్ వర్ధిల్లాలి. ఉత్తమ విలువలకు పెట్టింది పేరు హాలీవుడ్ చిత్రాలే...
8 comments:
ఉత్తమ నటి చార్మి కి ఇవ్వాలి అన్న మీ వాదనతొ నేను ఏకీభవిస్తాను.కాని భానుప్రియ గురించి చెప్పింది నెను ఒప్పుకోలెను.ఇక పెళ్ళం పిచ్చొడు అదొక చెత్త సినిమ.దాని గురించి మాట్లడుకోవడం కూడా వ్యర్దం.మరి అల్లంటి దానికి ఎలా ఇచ్చారో?పొతె పోని మొవిఎ మీరు అన్నంత చెత్తలా వుండదు.మంచి మెసేజు వుంటుంది.చక్రం సినిమాకి క్రిష్న వంశి కి రావడం నాకు బాగ ఆనందం కలిగిన విషయం.
7G బృందావన కాలనీ లాంటి నికృష్ట సినిమాని 100 రోజులపైగా ఆడించిన తెలుగు ప్రజలు ఇంతకన్నా ఎక్కువ భాగ్యానికి నోచుకోలేరనుకొంటా. పత్రికల్లో విజయవంతమైన 80వ రోజు అని వేస్తే, ఆనంద్ హీరో రాజా ఉన్నాడుకదా అని 'వెన్నెల' సినిమాకి వెళ్ళాం. వెన్నెలెక్కడ? అంతా చీకటే.
రాధిక గారు,
భానుప్రియ ఒక మంచి తెలుగునటి, స్వర్ణకమలం వంటి చిత్రాలలో అద్భుతంగా నటించారు. కానీ ఆ స్థాయి ఈ శివాజీ చిత్రంలో కనిపించదు. భారీ డ్రామా సంభాషణలు ఉన్నాయి. బహుశా ఈ చెత్త అంతా దర్శకుడికి సంభందించినది కావచ్చు.
శివాజీ ని ఛత్రపతి అని చదువుకోండి :-)
మన నంది అవార్డులు నిజానికి **ది అవార్డులని ఎన్నడో నిర్ణయించేశాను...
ఉత్తమ నటి చార్మి కి ఇవ్వాలి అన్న మీ వాదనతొ నేను పుర్తి గా ఏకీభవించను. ఆ ఆవార్డు కి అర్హురాలు బాపూ బొమ్మ "రాధగొపాళం" రధ @ స్నేహ. ఇక భానుప్రియ మంచి నటి కాని ఈమధ్య మంచి పాత్రలు ఏన్నుకోవటం లో విఫలం అవుతున్నది.
chk this
http://www.apweekly.com/cinema/cineItems.asp?ID=AWC20061112215810&Title=Cinema+%2D+News&lTitle=&Topic=0&Author_Id=0&spart=0&scat=0
క్లుప్తంగా.
-తమ్మారెడ్డి వారు తమ పదవి ని వాడుకొని గెలిచిన (లాగుకున్న) ఒక నంది
-సి.సి.రెడ్డి వారు కాంగ్రెస్ పార్తి ని నమ్ముకున్నందుకు ఒక నంది.ఈయన గత ఎన్నికల్లొ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి
-పెళ్ళాం పిచ్చొడు కి కాంగ్రెస్ సంబంధం నాకు తెలియదు..కాని తప్పకుండా ఎవరొ వుండె వుంటారు.
రాజశేఖరుల వారు వారిని నమ్ముకున్న వారిని ఎప్పుడు బాగా చూసుకుంటారు అని బాగా పేరు.అది ఇలాగ ఎమో!
Post a Comment