ఇది ఒక అద్భుత యజ్ఞ్ఙం. కుక్క పిల్లా, సబ్బు బిల్లా కాదేదీ అక్షరానికి అనర్హం...మెదక్ జిల్లా లో ఈ మంత్రంతో శంఖం పూరించిన విశ్వనాథుల భీమాచారి మాష్టారు అక్షరాలను దిద్దటానికి పలకొక్కటే మార్గం కాదంటున్నారు. ముగ్గులు, దీపాలు, గోవులు, కరడాలు, జంతికలు...ఏవైనా, ఎక్కడైనా, ఏ రూపంలో అయినా మీరు అక్షరాన్ని సృష్టించి పూజించవచ్చునంటున్నారు. దీనినే అక్షర దశ తంత్రం అంటున్నారు.
మెదక్ లో జిల్ల కలెక్టర్ గారి చొరవతో డబ్బై రోజుల తెలుగు అక్షర యజ్ఞ్ఙం (సంక్రాంతి వరకూ) మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అక్షర దీపారాధన, అక్షర దశ తంత్రం మొదలైనవి పాటించనున్నారు.
మన నాయకులు పనికిరాని ప్రాచీన హోదా మాటలు ఆపి, ఇలాంటివి మరిన్ని చేపడితే అదే తెలుగు తల్లికి కనకాభిషేకం...తెలుగు ప్రాచీనమైనది అయినా, తెలుగు తల్లి నిత్య యవ్వన సంపన్నురాలని చాటినట్లు అవుతుంది.
0 comments:
Post a Comment