నాగ రాజా గారు ఒక మంచి నసీరుద్దీన్ జోకు రాసారు..అది చదివి నాకు మహీధర నళినీ మోహన్ రావ్ గారి మౌల్వీ నసీరుద్దీన్ కధలు చదివిన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సందర్చంలో నాకు గుర్తుకొచ్చిన ఒక మౌ.న.క జోకు..
తైమూరు యుధ్ధానికి బయలు దేరాడు. నసీరుద్దీన్ ను కూడా మూటా ముల్లె సర్దుకుని బయలు దేరన్నాడు. అది నసీరుద్దిన్ కు ప్రాణ సంకటం గా తయారయ్యింది.
చివరికి ఒక ముసలి గాడిద సంపాదించి దాని మీద బయలు దెరాడు. అది చూసి తైమూరు నవ్వు అపుకోలేక "నసీరుద్దీన్..గాడిద ఉంది సరే, మరి బాణాలేవి అన్నాడు.."
"శత్రువులు మన పైకి బాణాలు వేస్తారు కదా! అవే తిరిగి వారి మీద ప్రయోగిస్తా! " అన్నాడు నసీరుద్దీన్.
"మరి శత్రువులు బాణాలు వెయ్యకపోతే?" అన్నాడు తైమూరు తెలివిగా..
"దొడ్డ ప్రభువులు, క్షమించాలి..మీకు చెప్పేంతటి వాడిని కాదు...శత్రువులు మన పైకి బాణాలు వెయ్యకపోతే యుద్ధమే ఉండదు కదా..అప్పుడు నాకు బాణాలతో పని ఏముంది?" అన్నాడు నసీరుద్దీన్.
1 comments:
సుధాకర్ గారూ, మనం తెనాలి రామకృష్ణ జోకులను కూడా ప్రచురిస్తే బాగుంటుంది... తెలుగు నేల బ్లాగు లింకును ప్రచురించినందుకు కృతజ్ఞతలు.
Post a Comment