రాష్ట్రంలో నవ్వు పుట్టించే కుళ్ళు రాజకీయాలు ఊపందుకున్నాయి...అందులో కొన్ని..
- హటాత్తుగా బీడీ కార్మికుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మన కె.సీ.ఆర్ కు. ఈ రోజు ఆవేశంగా ప్రసంగించేస్తున్నాడు..మీ తోనే నా బతుకు, నా చావు అని...తమరు రెండు సంవత్సరాలుగా వెలగ బెట్టిన కేంద్ర మంత్రి పదవిలో ఏం చేసారు సారూ ! ఈగలు తోలుతున్నారా? అసలు పుర్రె వలన ఎంత మంది పొగ తాగటం మానేస్తారబ్బా? అసలు ఈ తాగే వాళ్లందరూ పొగ తాగితే అనారోగ్యం అని తెలియకుండా తాగుతున్నారా? ఒక వేళ తాగినా సరే, వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఏది ముఖ్యం? ఆరోగ్యమా ? ఓట్లా?
- హఠాత్తుగా నరేంద్ర గారికి విజయశాంతి (అదేనండీ తెలంగాణాకు ఏదో రకంగా మానస పుత్రిక) ని ఆహ్వానించడానికి అనుమతి లభించింది. పాపం ఇతను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తే ఇన్నాల్లకు కె.సి.ఆర్ గులాబీ ఊపాడు. మన విశాంతి గారు మద్రాసు యాస తెలుగులో ఒక రకంగా ఎదో వాగారు టీవీలలో...ఇక ఈవిడ జనాలమీద తన సినిమ తైతక్కలు ప్రదర్శించటమే తరువాయి.
- సంవత్సరాల నుంచి సినిమాలలో అపహాస్యం పాలవుతున్న ఉత్తరాంధ్ర యాస ఇప్పటికి రాజకీయ నాయకుల కళ్ళకు ఆనింది. కుళ్ళును కుళ్ళపొడుస్తున్న ఈనాడును మరేటీ సెయ్యనేక, ఇదో ఇలాగ నరుక్కొత్తన్నారు...ఇప్పటికైనా భాషకు, యాసకు ఉన్న సంబంధాన్ని అందరు గమనిస్తే మంచిది. కళ్ళు చిదంబరం చేత ఈ యాసతో అపహాస్యం చేస్తే తప్పులేదు కానీ, అన్నింటినీ బొక్కే బొత్సను అనేటప్పటికి ఎక్కడి లేని రోషం వచ్చేసింది..ఎవరికీ? మన రాజమహేంద్రంలో వున్న డిటెక్టివ్ ఉండవల్లి గారికి.
1 comments:
వోట్ల కోసం ఫీట్లు! 2 లక్షల వోట్లతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆ పని నే జెయ్యలేదంటే నే జెయ్యలేదని అరుస్తున్నారు. పుర్రె గుర్తు వ్య్వహారంపై ఢిల్లీలో నిన్న కాంగ్రెసు ఎంపీల ప్రహసనం గురించి చదివాం కదా.. వోట్ల కోసం కోట్ల పాట్లు!
Post a Comment