మనందరికి తెలుసు, భాగ్యనగరం ఒక మేడిపండు అని. కొత్తగా ఋజువులు కూడా అక్కరలేదు. ఇప్పుడు ఆ మేడిపండుకు మన ఎమ్.సి.హెచ్ కొత్త రంగులద్దబోతుంది. వారి ప్రకారం మన నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలిట. నగరానికి బ్రాండ్ ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. అదీ పక్కా ఇంగిలిపీసులో. నిజంగా చెప్పలంటే భాగ్యనగరానికి ఒక లోగో కావలంటే ఇలా ఉండాలి...(అపహాస్యానికి క్షమించాలి..కానీ పరిస్థితి ఇలానే ఉంది మరి).
ఈ హాస్యాన్ని పక్కన పెడితే, మనకు ఎంచుకోవటానికి ఇక్కడ నాలుగు లోగోలు ఉన్నాయి..నేను B కి వోటేసా...అది కొద్దిగా బిర్యాని పద్ధతిలో ఉంది, రాజసంగా...:-) మరి మీరు ఓటెయ్యండి మరి...www.ourmch.com లో నవంబరు 28 లోపు మీరు మీ ఓటు నమోదు చెయ్యవచ్చు.
5 comments:
అవును. ఉన్నవాటిల్లో 'బీడీ'లే బాగున్నాయి. సి లో vibrant violent లాగా అనిపించడంలేదూ?
అవును సుధా, 'B'option బావు౦ది. కాకపొతే caption లో వున్న ఆ tomorrow ఎప్పటికైనా వస్తే బాగానే వు౦టు౦ది. లేకపోతే మన మ౦త్రివర్గ౦ పనులు 'mission' - tomorrow..కదా , పనులు రేపు చూద్దా౦ అని ప్రతిరోజు అనుకొ౦టే అ౦తే స౦గతులు.:)
అవునండీ సాయి గారు, కాక పోతే అన్నీ కాపీ కొట్టి తయారు చేసిన లోగోలే..."బి" కూడా తాజ్ క్రిష్ణ హోటల్స్ లోగో కాపీ...
ఆసా గారు, మనది mission impossible :-)
బెంగుళూరు అనగానే Software అంటుంది కదా ప్రపంచం, అలాగే మన నగరానికి బ్రాండ్ విలువ తేవాలనుకున్నారేమో. ఇంతకంటే సృజనాత్మకమైనవేవీ లోగోలుగా దొరకలేదేమో.
avunu .. okaa logo kooda baaledu waste
Post a Comment