ఈ నెల రచన సంచిక ఒక మంచి కానుక తాలుకా సమాచారంతో వచ్చింది. ఆ పత్రికలో ఉన్నది ఇక్కడ రాస్తున్నా...
1946 నుంచి ఈనాటి దాకా అవిరామంగా తెలుగువారిని తమ అపురూప చిత్రకళా - రచనా రీతులతో అలరిస్తున్న సుప్రసిధ్ధ జంట 'బాపు రమణ'.
శ్రీ బాపుగారు వేసిన బొమ్మల కధలన్నింటిని, ఒక దగ్గర కూర్చి, కొంచెం అటూ ఇటూ 400 పేజిలతో (80 పేజీలు రంగులలో) 1/4 డెమీ సైజులో, అతి చక్కని బైండింగుతో ప్రచురిస్తున్నాము.
- దాదాపు 400 పేజీల ఈ 'బొమ్మల కధలు' గ్రంధం ఖరీదు : 495/- మాత్రమే.
- 15 డిసెంబరు 2006 లోపల ప్రచురణలు ముందే కొనుగోలు చేసే వారికి కేవలం రు.450/- లకే లభ్యం.
ఎలా పొందగలరు?
నగదు/ఎమ్.ఓ/డి.డి/లోకల్ చెక్ (బయటి ఊరి చెక్కులు అంగీకరింపబడవు) ద్వారా "వాహిని బుక్ ట్రష్టు" పేరిట, "హైదరాబాదు" లో చెల్లింపబడే విధంగా రు.450/- పంపిన వారికి గ్రంధం, ఖర్చులు భరించి రిజిష్టరు పోష్టు ద్వారా, 15.12.2006 తర్వాత జరుగుతుంది. వి.పి.పి పధ్ధతి లేదు.
ఎం.వో లు పంపేటప్పుడు స్ప్రష్టంగా మీ చిరునామా, ఫోన్ నెంబరుతో సహా "స్పేస్ ఫర్ కమ్యూనికేషన్" అని ఉన్న చోట రాయడం తప్పని సరి.
ఇక ఆలస్యం ఎందుకు...ఈ సంచికను మీ మిత్రులకు బహుమతిగా కొని ఇవ్వండి. వారు ప్రత్యేకంగా ఆనందించటం మీరే గమనిస్తారు.
3 comments:
Good information. Keep it up.
మంచి వార్త చెప్పారు. మీ స్వచ్హమైన తెలుగు చాలా బాగుంటుందండి :)
ధన్యవాదాలండీ...
Post a Comment