ముందర దీనిని చదవండి : గురజాడపై గుర్రు....
ఇప్పుడు నేను దీనిని రెండవ భాగం అని ఎందుకు అన్నానంటే, ఎక్కడైయితే ఈ గురజాడ పై యుధ్ధం మొదలయిందో అక్కడ ఇంకా జనాలు కొట్టుకుంటున్నారు కాబట్టి...:-)
ఆంధ్రభూమి సాహితి నాకు బాగా నచ్చింది...నాణేనికి రెండు వైపులా అది ప్రచురిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒకే సంచికలో ఒకరు తిట్టారు...ఒకరు పొగిడారు...ఏది ఏమైనా, ఇలాంటి సాహితి సాంఘిక రచ్చలు భలే ఉంటాయి.
... గురజాడ మహా రచయతా కాదా అనేది ముఖ్యం కాదు..అతను ఒక రచయతగా తన బాధ్యత నెరవేర్చాడా లేదా అనేదే ముఖ్యం. అలా చూస్తే గురజాడ తప్పని సరిగా ఒక అద్భుతమైన రచయత. రచయత కలంతో దాడి చేస్తాడ. గురజాడ యుగ పురుషుడా? అని ఒకరి డౌటూ...!
ఇక యుగ పురుషులు అంటారా? యుగస్త్రీ అనే పదమే లేని కాలంలో పుట్టిన పదం "యుగ పురుషుడు"....నా వరకు ఆ పదం ఒట్టి మిథ్య. రాజులను పొగడటానికి వంధి మాగధులు సృష్టించిన వందల పదాలలో అది ఒకటి.
సమాజం ఒక ఈగలు మూగిన బెల్లం లాంటిది. ఒకరిద్దరు వాటిని తరిమినా అవి మూగక మానవు. సమాజానికి పట్టిన జాడ్యం కూడా అంతే. తెలుగు తల్లి ఎవరు? అని ప్రశ్నించే మహా మాయగాల్లు ఉన్న సంఘంలో ఎవరు ఎవరి చరిత్రను ఎలా అయినా చూపించవచ్చు....వీరప్పన్ భార్య ఎమ్.పి కావచ్చు...అఫ్జల్ గురు కాశ్మీరు సీ.ఎమ్ కావచ్చు.
ఆంధ్ర భూమి ప్రతీ సాహితీ సంచిక, ముందరి సంచికను తీసివేసి పెట్టబడుతుంది, అందువలన నేను వీటిని ఫ్లికర్ లో పెట్టా..
0 comments:
Post a Comment