ఈ మధ్య అద్భుతమైన తెలుగు బ్లాగర్లు పుట్టుకొస్తున్నారు. మంచి మంచి వంటకాలతో నోరూరించేవి కొన్ని అయితే, గడ గడ లాడించే రాజకీయాల విసుర్లతో కొన్ని. చిన్ననాటి ముచ్చట్లు, నసీరుద్దీన్ పకపకలు, అందమైన భావాలు, గేయాలు, నీతి కధలు, సాంకేతిక విషయాలు ఒకటేమిటి...చదవటానికి తీరిక లేనన్ని...మరి ఇవన్నీ ఎలా చదవకుండా వదిలెయ్యటం? అందుకని మనం చెయ్యగలిగేది ఒక్కటే...వాటిని తస్కరించి మన దగ్గర భధ్రపరచుకుని, తీరిగ్గా పకోడీలు (బ్లాగులో నేర్చుకున్నవి) నముల్తూ ఏదో ఒక రోజు చదువుకుంటే బాగుంటుంది కదా...
సరిగ్గా మన లాంటి వారికోసమే ఉంది ఈ క్లిప్ మార్క్స్ అనే ఉపకరణం...
ఇది ఒక్క సారి మన బ్రౌజరులో వ్యవస్థాపితం చేసుకుంటే...ఒక పండగే పండగ..:-)...ముందుగా ఈ క్లిప్ మార్క్స్ ని ఇక్కడి నుంచి వ్యవస్థాపితం చేసుకోండి...మనము ఏదైనా పేజిలో ఉన్నప్పుడు ఈ క్లిప్ మార్కు బటన్ (బ్రౌజరు టూలు బార్ మీద ఉంటుంది) ని నొక్కితే పేజీ మొత్తం ఎంపిక మోడ్ లోనికి మారుతుంది. అప్పుడు మనకు కావలసిన విషయం, పేరాల మీద మౌస్ ను ఉంచితే వాటి చుట్టూ ఒక గీతతో డబ్బా కనిపిస్తుంది. మనకు సరిపోయే విధంగా డబ్బా కనిపిస్తే ఒక్క మౌస్ నొక్కు నొక్కటమే...ఆ డబ్బాలో ఉన్నదంతా మన క్లిప్ స్టోర్ లోనికి వచ్చేస్తుంది...అప్పుడు చివరిసారిగా "సేవ్ క్లిప్ మార్కు" బొమ్మను నొక్కటమే...లాగిన్ అయ్యాక మన క్లిప్పులను అది సురక్షితంగా భధ్రపరుస్తుంది. వీటిని ఎక్కడినుంచి అయినా చదువుకోవచ్చు...ఇంకొకరి చేత చదివించ వచ్చూ...నా క్లిప్పులను ఇక్కడ మీరు చూడవచ్చు..
భలే ఉంది కదా ! ఇక ఆలస్యం ఎందుకూ? క్లిప్పుల వేట మొదలుపెట్టండి...రండి...పకోడీలను మరింత రుచికరంగా చేద్దాం ...:-)
3 comments:
చాలా బాగుంది అండి...
దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి...
ధన్యవాదములు... !!!
caalaabaagundandi
మంచి ఐడియా. మా చెంతకు చేర్చినందుకు కృతజ్ఞతలు.
నా క్లిప్పులు ఇక్కడ చూడండి http://clipmarks.com/clipper/saintpal/
Post a Comment